Wednesday, November 9, 2016

ఏపీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపికబురు. రాష్ట్రంలో గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 982 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులను పూర్తి ఆన్‌లైన్‌లో విధానంలో స్వీకరిస్తామన్నారు. 25 వేల మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్‌ పరీక్ష మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నామన్నారు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11.11.2016
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 10.12.2016
* ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 26, 2017
* మెయిన్స్‌ పరీక్ష: మే 20, 21వ తేదీల్లో (2017)
* పూర్తి వివరాలకు: www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
* వయెపరిమితి: సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 (20-42 సంవత్సరాల మధ్య), ఎక్సైజ్‌ ఎస్సై (18-28 సంవత్సరాల మధ్య) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* వీటికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 442
* నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 540
* మొత్తం పోస్టుల సంఖ్య: 982 

విజయవాడకు శాప్‌..

విజయవాడకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ(శాప్‌) శాఖ. శాప్‌ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజధానికి వచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాప్‌ నూతన కార్యాలయం ప్రారంబం అయ్యింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడమే ‘శాప్’ యొక్క ప్రధాన లక్ష్యం.
ఎంతో మంది ప్రతిభావంతులని శాప్ తీర్చిదిద్దింది. భారత హాకీ జట్టు గోల్ కీపర్ రజనీ శాప్ లోనే శిక్షణ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్రీడలకి మంచి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపద్యంలోనే శాప్ నూతన కార్యాలయం ప్రారంబం అయ్యింది. ఈ సందర్బంగా శాప్‌ ఎండీ రేఖారాణి మాట్లాడుతూ.. గతంలో క్రీడలకు రూ. 30, 40 కోట్లు మాత్రమే కేటాయించగా ప్రస్తుతం అత్యధికంగా రూ. 200 కోట్లు ఇవ్వడంతో క్రీడాకారులకు, క్రీడాభివృద్ధికి ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా క్రీడల అభివృద్ధి జరిగిందని, ఇక నుంచి నూతన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ నిధులతో ప్రతి జిల్లాలో రూ.2 కోట్లతో స్టేడియం నిర్మాణం చేస్తామని, డీఎస్‌డీవోలు అందరికీ రూ. కోటి చొప్పున నిధులు అందించి, క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇన్సెంటివ్‌లు, రాష్ట్ర అసోసియేషనలకు టీఏ, డీఏలు ఈ సంవత్సరం నుంచి అందిస్తామన్నారు. కొత్త స్టేడియం నిర్మాణాలు, రాష్ట్రంలో నూతనంగా వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
పేద కుటుంబాలలోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని, అందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వైజాగ్‌లో గ్లోబల్‌ ట్రస్ట్‌ స్కూల్‌ని ప్రారంభించారని, అక్కడ రైఫిల్‌ షూటింగ్‌, ఆర్చరీలో శిక్షణ ఇస్తున్నారని వివరించారు. క్రీడా పాలసీలో భాగంగా డ్రాఫ్ట్‌ పాలసీని ప్రారంభించామని దానిలో మండల, గ్రామ పరిధిలోని క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇస్తామని, అందుకు అవసరమైన 100 మంది కోచల నియామకాలు జరుపుతామని తెలిపారు. జాతీయ క్రీడలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామని, అందుకు ప్రభుత్వం, శాప్‌ కృషి చేస్తుందని ఎండీ రేఖారాణి తెలిపారు.

పాత నోట్లు ఇలా మార్చుకోవాలి

బ్లాక్ మనీపై యుద్ధం ప్రకటించామని.. అవినీతి అంతమే తమ లక్ష్యమని ప్రకటించారు పీఎం మోడీ. నకిలీ నోట్లను సమర్థవంతంగా అడ్డుకునేందుకు రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.  అయితే పాత నోట్లను ఎలా మార్చుకోవాలి అనే దానిపై అందరిలోనూ గందరగోళం, ఆందోళన నెలకొంది. వీటికి కొన్ని సూచనలు చేశారు ప్రధాని.

ఇలా మార్చుకోవచ్చు..

… ఈ నెల 10 నుంచి కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు
… నోట్ల మార్పిడికి ఎలాంటి రుసుము అవసరం లేదు
… పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో మార్పిడి
… రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక కౌంటర్లలో మార్చుకోవచ్చు
…. బ్యాంకుల నుంచి రోజుకు 10 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా
… వారానికి రూ. 20 వేలకు పరిమితి
… రైల్వే, బస్, విమాన టికెట్ల కొనుగోలుకు, పెట్రోల్ బంకులు, హోటల్స్ లో పాత నోట్ల చలామణికి ఎలాంటి ఇబ్బందులు లేవు
… ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోఆపరేటివ్ సంస్థలు, మిల్క్ బూత్ లు, శ్మశానాల్లో పాత నోట్లు చలామణి
…  ఆన్ లైన్ లావాదేవీలు యథేచ్చగా చేసుకోవచ్చు

ఇవే మన కొత్త నోట్లు వాటి కథ ఏంటంటే ?

రూ.500, రూ.2000 నోట్ల వల్ల మళ్ళి బ్లాక్ మనీ వస్తుందా?
ప్రధాని నరేంద్రమోడి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించారు. దేశం అంతా నివ్వెరపోయింది. ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. గ్రామాలు, పల్లెలు, సిటీలు దేశం అంతా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే టాపిక్.
ఐతే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు ప్రవేశ పెట్టనుంది. ఇదిలా ఉండగా…రూ.500, రూ.2000 నోట్లు వల్ల వచ్చే కాలంలో బ్లాక్ మనీ మరింత పెరిగే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు ఇది చూడండి…
ఈ రూ.500, రూ.2000 నోట్లు వల్ల ముందు కాలంలో ఎలాంటి బ్లాక్ మనీ బయటకి రాకుండ చాలా కచ్చితంగా ఈ నోట్లని తయారు చేశారు. RBI విడుదల చేసే ప్రతి రూ.500, రూ.2000 నోట్లపై ‘నానో GPS చిప్‘ (NGC) ని అమర్చారు. ఈ చిప్ యొక్క పని తీరు ఎలా ఉంటుందంటే… ఈ చిప్ కి ఎలాంటి పవర్ అవసరం లేదు. కేవలం రిఫ్లేక్టర్ సాయంతో ఇది పనిచేస్తుంది. ఎప్పుడైతే శాటిలైట్ NGC సిగ్నల్ ని అడిగిందో వెంటనే NGC దాని సమాచారాన్ని శాటిలైట్ కి తెలియజేస్తుంది. ఎక్కడ ఉందొ కచ్చితమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. ప్రదేశం మాత్రమే కాదు రూ.500, రూ.2000 యొక్క సీరియల్ నంబర్ కూడా తెలుస్తుంది.
ఇలా ‘నానో GPS చిప్’ అమర్చిన ప్రతి రూ.500, రూ.2000 నోట్లు ఎక్కడ ఉన్నాయో తేలికగా తెలుసుకోవచ్చు. దీని వల్ల దొంగ నోటు తయారు చేయటం కుదరదు, ఎలాంటి మతలబులు చెయ్యటానికి వీలుండదు. ఈ నోట్లు 120మీ. భూమి లోతులో పెట్టినా సులబంగా తెలుసుకోవచ్చు.
ప్రతి రూ.500, రూ.2000 నోట్లు NGC సాయంతో ఎలాగైతే శాటిలైట్ కనిపెట్టగలదో, అలాగే ఎంత మొత్తంలో నోట్లు ఉన్నాయో కచ్చితమైన లెక్క కూడా చెప్పగలదు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఎక్కడ నిలువ ఉంచిన, పోనీ ఎక్కువ రోజులు ఉంచిన వెంటనే శాటిలైట్ కి సమాచారం అందుతుంది. శాటిలైట్ వెంటనే ఆదాయ పన్నుల శాఖ (Income Tax Department) కి సమాచారం ఇస్తుంది.
నిజంగా ఇది అద్బుతం అనే చెప్పాలి ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా మన భారత ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోటం హర్షించతగ్గ విషయం. రానున్న రోజుల్లో భారత ప్రపంచ ఆర్ధిక శక్తీగా అవతరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Monday, November 7, 2016

ఆర్టీసీ కి ‘కృష్ణవేణి’ శోభ…

నవ్యాంధ్ర రహదార్లపై బ్రాండ్ ఇమేజ్ పరుగులు పెట్టనుంది రాజధాని బ్రాండ్ వ్యాల్యు మరింత పెరగనుంది. ఆర్టీసీ ఒడిలోకి మరో ఆణిముత్యం రానుంది. ‘కృష్ణవేణి’ బ్రాండ్ పేరుతో ఏసీ బస్సులు నవ్యాంధ్రలో తిరగనున్నాయి.
రాజధాని ప్రాంతంలో పారుతున్న కృష్ణానది బ్రాండ్ పెరిగేలా . ‘కృష్ణవేణి’ పేరుతో బస్సులను ఆర్టీసీ ప్రవేశ పెడుతుంది. ఇప్పటికే రాజధాని అమరావతి పేరు తో ప్రయాణీకులకి అందుబాటులో ఉన్న సర్వీస్ లకి ప్రయాణీకుల నుంచి మంచి స్పందన వస్తుంది .
పూనే లోని ‘కరోనా’ కంపెనీ ఈ బస్సులను తయారు చేస్తుంది. దాదాపు 110 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. రాష్ట్రమంతా ఈ బస్సులు తిరుగుతాయి. పూర్తిగా ఎయిర్ కండీషన్డ సదుపాయంతో రానున్నాయి.
ఎక్కువ బస్సులను కృష్ణా, గుంటూరు జిల్లాలు రీజియన్ కే కేటాయిస్తున్నారు. 30 నుంచి 35 బస్సులు ఈ రీజియన్ కి ఇస్తున్నారు. మిగతా రాష్ట్రమంతా ఒక్కో రీజియన్ కు 15 – 20 తక్కువ కాకుండా బస్సులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘కృష్ణవేణి’ బస్సులు ఆర్టీసీ కే తలమానికంలా నిలవాలని కోరుకుందాం

చంద్రబాబు కష్టం మట్టి పాలు అవుతుందా

ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ప్రతి శుక్రవారం సచివాలయంలో ఉండి ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వినతి పత్రాలను తీసుకోవాలి దీన్నే  గ్రీవెన్స్ డే గా నామకరణం చేశారు . ప్రతి మంత్రి గ్రీవెన్స్ డే రోజు తప్పకుండా అందుబాటులో ఉండాలని సియం చంద్రబాబు ఆదేశించారు. దీని మీద ఉత్తర్వులు కూడా జారి అయ్యాయి .
కానీ అమరావతిలో సచివాలయం ప్రారంభమై మూడు శుక్రవారాలు దాటిపోయాయి కాని ఒక్క శుక్రవారం కూడా గ్రీవెన్స్ డే జరగలేదు. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు వినతి పత్రాలు సమర్పించుకోటానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, సామాన్యులకు నిరాశ ఎదురైంది. మొదటి శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మంత్రులు నిమగ్నమయ్యారు. రెండో శుక్రవారం అమరావతిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అందరు మంత్రులు అక్కడే ఉన్నారు. ఇక మూడో శుక్రవారం మాత్రం మంత్రి నారాయణ మాత్రమే గ్రీవెన్స్ డే లో పాల్గొన్నారు. మిగతా మంత్రులు ఎవరు సచివాలయంలో కనిపించలేదు.
మొదట రెండు శుక్రవారాలు జరగలేదు మూడో శుక్రవారం అన్నా మంత్రులు అందుబాటులో ఉంటారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. మంత్రులు ఎప్పుడు ఉంటారో ముందే మాకు సమాచారం ఇస్తే అప్పుడే వస్తాము అని ప్రజలు వాపోతున్నారు.
చంద్రబాబు 66 ఏళ్ళ వయసులో అంతా తానై పొద్దున ఒక చోట మద్యాహ్నం ఒక చోట సాయంత్రం ఒక చోట అలుపెరగకుండా తిరుగుతుంటారు. రోజుకి 18 గంటలు పని చేస్తారు. రివ్యూలు, అధికారులతో వీడియొ కాన్ఫరెన్స్, మీటింగులు, పార్టీ నిర్వహణ ఇలా ఖాళీ లేకుండ పరిగెడుతూ అధికారులని పరిగెత్తిస్తుంటారు. చంద్రబాబు రాష్ట్రం కోసం ప్రజల కోసం అంత కష్టపడుతుంటే ఎంత మంది  మంత్రులు ఎంత బాధ్యత గా ఉంటున్నారు …ఎంత మంది ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అని ఒక్క సారి ప్రశ్నించుకుంటే మంచిది …చంద్రబాబు దారిలో వీరు కూడా నడిస్తే పర్లేదు కాని ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన చంద్రబాబు కష్టాన్ని మట్టి పాలు చేసిన వారవుతారు 

మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి ఈ Whats app Message చదవండి.

ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.
ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?
విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…
” అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.
విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?
విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.
” అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”
మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.
అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
అని.
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి ” అని .
కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట,ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు….”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు
మహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..
అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమా-మేవాడ్
శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్
శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.
అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువ వచ్చు.
*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి ” తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా ” అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..
*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి
* మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
* మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.
* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.
* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు
* మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.
* రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
*చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా
*మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.
*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.
*మిత్రులారా మహార ణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు ,అంతే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.
*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.
* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.
మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.
* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.
*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ” ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను “అని అన్నాడట.
* మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయి.
Be proud to be INDIAN

ఆండ్రాయిడ్ లో త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ పుట్టినరోజు నవంబర్ 7 న ‘త్రివిక్రమ్’ పేరుతో ఆండ్రాయిడ్ యాప్ విడుదల
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం! ఎ.బి.సి. డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ ను, వెబ్ సైట్ ను (www.trivikramcelluloid.in) ఈ సంస్థ ప్రారంభిస్తోంది. కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబర్ 7) న ఈ కానుకను అందించబోతోంది.
ఇక మీదట ఆయన అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్లెండ్లీ యాప్ ఇందులోని అప్ డేట్స్ అన్నింటినీ నోటిఫికేషన్ మెసేజ్ ద్వారా యూజర్స్ కు తెలియచేస్తుంది అని సంస్థ ప్రతినిధి రాహుల్ మీడియా కు తెలిపారు

ఇండియన్ రైల్వే వేగం పెంచింది…

ఇండియన్ రైల్వే అభివృద్ధిని వేగవంతం చెయ్యాలనే ఆలోచనతో అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. రైళ్ళ వేగం పెంచే ఆలోచన చేసింది. మొదట దశలో రెండు ముఖ్యమైన మార్గాల్లో మిషన్‌ రఫ్తార్‌ పేరుతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రూ.10వేల కోట్లతో ప్రధాన మర్గాలైన దిల్లీ – ముంబయి, దిల్లీ – హౌరా మద్య తిరిగే రైళ్ళ వేగం గంటకు 160 కి.మీ. మేర పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇండియన్ రైల్వే. దాదాపు 9000 కి.మీ మేర ఉన్న ఈ రైల్వే లైన్స్ ని యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టాలని ఆదేశించింది రైల్వే శాఖ.
నిజంగా ఇది ఒక అద్బుత నిర్ణయం. ఇది సాకారం అయితే సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. రానున్న కాలంలో రెండు మర్గాల్లోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించాలని కోరుకుందాం.

మరో సంచలన నిర్ణయం

చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతానికి తలమానికంలా ఏదోక మైలురాయి ఉండాలనే ఆలోచన చేశారు. ఆ ఆలోచన అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం కొండపై బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు.
బుద్ధుని విగ్రహం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకోటం మాత్రమే కాదు ఆదేశాలు కూడా జారి చేశారు. తాజాగా ఇచ్చిన ఆదేశాలు పర్యాటకానికి నూతన రూపు తీసుకురానున్నాయి అనే చెప్పాలి.
గతంలో సీతానగరం కొండపై హిల్‌ ప్రాజెక్టు పేరుతో 60 అడుగుల బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దడానికి 2011లో వీజీటీఎం ఉడా ప్రతిపాదనలు రూపొందించింది. రూ.73.12 కోట్ల వ్యయంతో మూడు దశల్లో కొండను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది.
ఐతే ఈ ప్రాజెక్ట్ అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు 60 అడుగుల బుద్ధుని విగ్రహం కొండ పై వేలవనుంది. దీంతో సీతానగరం కొండను పర్యాటకంగా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.

Saturday, November 5, 2016

దుమ్ము దులుపుతున్న ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ప్రపంచానికి ఆదర్శమని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. చంద్రబాబు రోజుకో అద్బుతం చేస్తున్నారు. ఈ రోజు ఏం చేశారు అనుకుంటున్నారా… ఇంధన వినియోగంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు.
సమర్థ ఇంధన వినియోగంలో ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నం.1 గా నిలిచింది. రెండోస్థానంలో రాజస్థాన్‌, మూడోస్థానంలో మహారాష్ట్ర, నాలుగోస్థానంలో కర్ణాటక, ఐదోస్థానంలో కేరళ నిలిచాయి. ఏపీ ప్రారంభించిన ఎనర్జీ స్టార్‌ అమోఘమని సదస్సులో పాల్గొన్న వారు తెలిపారు.
ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర గార్గ్ మాట్లాడుతూ… అద్భుత విధానాలతో ఇంధన వినియోగంలో ఏపీ చాంపియన్‌గా నిలిచిందని ఆయన కొనియాడారు. ఢిల్లీ అంతర్జాతీయ సదస్సులో ఏపీని ప్రశంసించారు. ఇంధనాన్ని సమర్ధంగా వినియోగించడంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ప్రపంచానికి ఆదర్శమని సుభాష్‌ చంద్రగార్గ్ ప్రశంసల వర్షం కురిపించారు

Friday, November 4, 2016

రష్యన్ ఆఫీసర్ మనోడి లవ్ లో పడింది.వాళ్ల జంటను చూసి ఆ ఊరి జనమంతా షాక్.!!!

నరేంద్ర…మధ్యప్రదేశ్  లోని ఓ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న వ్యక్తి. ఉన్న ఊర్లో పనిలేకపోవడంతో….పొట్టచేత పట్టుకొని పనికోసం గోవా వెళ్లాడు. అక్కడ బార్ లో బేరర్ గా జీతం కుదిరాడు. గోవా కాబట్టి…బార్ లకు అమ్మాయిలు, మహిళలు  రావడం కామన్. ఎప్పటిలాగే తన పనిలో తాను ఉండగ…ఓ రష్యన్ అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది. బీర్ తెచ్చి, గ్లాస్ లో పోసి ఆమెకు అందించాడు నరేంద్ర….ఏమైందో ఏమో కానీ ఆ క్షణం నుండి నరేంద్ర ను ఇష్టపడడం స్టార్ట్ చేసింది ఆ రష్యన్ అమ్మాయి.
కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి గోవాలోని పార్క్ లు, బీచ్ లు తిరిగేశారు. అప్పటికే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు.  తర్వాత తెల్సిందేంటంటే….ఆ రష్యన్ అమ్మాయి పేరు ఆనస్తత… రష్యన్ పార్లమెంట్ హౌజ్ లో ఎకానమిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిని అంట…తన ప్రేయసిని చూడడానికి నరేంద్ర రెండు సార్లు రష్యాలోని మాస్కో కు కూడా వెళ్లొచ్చాడట.  ఒకరంటే  ఒకరికి ఇష్టం కావడంతో ఆనస్తత ఇండియాకు వచ్చి మరీ  నరేంద్ర ను పెళ్లి చేసుకుంది.
ఇక…ఓ సారి తన భార్యను తన ఊరికి తీసుకొచ్చిన నరేంద్ర ను చూసి ఊరోళంతా షాక్ అయ్యారంట….. అక్షరం ముక్క రానీ నరేంద్రను అంత పెద్ద చదువులు చదివిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అని ఊరంతా నోరెళ్లబెట్టారంట.! ఈ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అని చాలా మంది గొణుక్కున్నారంట….రెండేళ్లైనా …వీరి బంధం మాత్రం రోజురోజుకు బలపడుతుందే కానీ,…..ఏ మాత్రం తగ్గట్లేదు!  నరేంద్ర రష్యాలో పూర్తిస్థాయిలో సెట్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.!
దేశ సరిహద్దులు దాటిన నరేంద్ర ప్రేమకు మనకు అభినందనలు తెల్పుదాం

కర్నూలు జిల్లాలో పక్షవాతానికి అద్భుత వైద్యం.. దయచేసి అందరికీ తెలియ చేయండి

పక్షవాతం.. శరీరం బిగుసుకు పోవడం, ముఖం వంకర్లు తిరగడం, కాళ్ళు చేతులు చచ్చు పడి పోవడం పక్షవాతం లక్షణాలు. ఈ వ్యాధితో బాధ పడేవారి కష్టాలు వర్ణనాతీతం. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక లేజర్ టెక్నలాజి అందుబాటులో ఉన్నప్పటికీ.. పూర్తిగా నయం చేస్తామని గ్యారెంటీ ఇవ్వలేని స్థితి. అయితే.. కర్నూలు జిల్లాలో తన తండ్రి నుండి నేర్చుకున్న హరిబాబు అనే వ్యక్తి చేసే పసరు వైద్యంతో.. మూడు నెలలలోనే పక్షవాతం పరిగెత్తుతుంది.
నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాతం రోగులతో కిక్కిరిసి పోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మాహారాష్ట్ర నుండి ఎందరో పసరు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుండి విముక్తి కలిగిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ముందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.
ఇక చికిత్స సంగతికి వస్తే.. మొదటి రోజు వెల్లుల్లి ని రోలో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతని బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న వాళ్ళు మూడు నెలల దాకా పత్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యుడు ఇచ్చిన తైలంతో చచ్చుబడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రి కి తిరిగినా నయం కానిది.. ఇక్కడ నయం చేశారని అక్కడ చికిత్స పొందినవారు చెబుతున్నారు.

గ్యాస్ సమస్యలు తగ్గించే జింజర్-బట్టర్ మిల్క్!

గ్యాస్ సమస్యలు తగ్గించే జింజర్-బట్టర్ మిల్క్!

1) అల్లంలో ఉండే ఔషధ గుణాలు , మజ్జిగలో ఉండే కూలింగ్ లక్షణాలు పొట్టలో గ్యాస్ , అసిడిటీ తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి. 

2) ఒక గ్లాస్ మజ్జిగలో రెండు ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకొంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. 

3) గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు రెండు గ్లాసులు త్రాగాలి. 

4) ప్రతి రోజు గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో కారం , పులుపు , మసాలాలు , మాంసాహారం తగ్గించి తీసుకోవాలి. 

5) గ్యాస్ సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ కాలం గ్యాస్ సమస్య ఉన్నవారికి పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. 

6) దగ్గర్లో డాక్టర్ ని సంప్రదించి మందులు వాడుకొని , డైట్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. 

7) ఎక్కువ మొత్తంలో నీటిని త్రాగుతూ ఉండాలి. సమయానికి భోజనం చేయాలి.

వేగంగా నిర్మాణవుతున్న చరణ్, ఉపాసనల నివాసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతుల కోసం ఓ అత్యాధునిక భవనం నిర్మాణమవుతోంది. జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు వంటి అనేక వసతులు ఈ నివాసంలో ఉండనున్నాయి. ఇందులో ఉండే ఫర్నిచర్ కూడా విదేశాల నుంచి దిగుమతి అయింది. మెగాస్టార్ తనయుడు ఇల్లు కోసం ఖర్చు పెడుతున్న మొత్తం ఎంతో తెలుసా .. అక్షరాలా 80 కోట్లు.
ఇల్లు పూర్తి అయ్యేసరికి ఈ మొత్తం పెరిగే  అవకాశం ఉంది. భవనం పూర్తి స్థాయిలో సిద్దమయిన తర్వాత తండ్రి చిరంజీవి నివాసం నుంచి చెర్రీ బయటకు రానున్నారు. భార్య ఉపాసనతో కలిసి ఇందులో నివశించనున్నారు. ఈ నూతన భవనంలోకి అడుగు పెట్టిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తామని ఉపాసన కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. మరి ఈ కొత్త ఇంట్లో గృహ ప్రవేశ కార్యక్రమ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

నాగార్జున‌తో వెంకీకి కొత్త గొడ‌వ‌

టాలీవుడ్‌లో బావ‌బావ‌మ‌రుదులైన కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఫ్యామిలీ ఇమేజ్‌తో వీరు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక వీరిద్ద‌రు సీనియారిటీ దృష్ట్యా త‌మ వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్‌పై దూసుకుపోతున్నారు.
వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్ ఊపిరి, మ‌నం, సోగ్గాడు లాంటి వైవిధ్య‌మైన క‌థుల ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్ద‌రు బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్‌కు తెర‌లేవ‌నుంది.
ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ గురులో న‌టిస్తుంటే, నాగ్ కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మోః వెంక‌టేశాయా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముందుగా సంక్రాంతి రేసులో ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.
సంక్రాంతికి మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీరిద్ద‌రు త‌మ సినిమాల‌ను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌కు వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఫైటింగ్‌కు తెర‌లేవ‌నుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ బావ‌బావ‌మ‌రుదుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి

ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ ఫీచర్ల తో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌

పూర్తిస్థాయిలో ‘ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ’ ఫీచర్లను అందించే సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. ‘ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ’ అంటే మొన్ననే పోకెమాన్‌ గో అనే గేమ్ గురించి తెలుసు కదా.. ఆ గేమ్ ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ సా0కేతికతతోనే పని చేస్తుంది.
‘లెనొవొ ఫ్యాబ్‌2 ప్రో’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిస్థాయి ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ‘టాంగో’ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.
‘లెనొవొ ఫ్యాబ్‌2 ప్రో’ ఫోన్ కెమెరా తో ఫోటో తీస్తే ఆ ఫోటో 3D విజువల్‌ లోకి మారిపోతుంది. అలా మార్చేసేలా ఈ ఫోన్‌లో ప్రత్యేక సెన్సర్లు ఉన్నాయి. 3D విజువల్‌ మాత్రమే కాదు మనం తీసిన వస్తువు యొక్క ఎత్తు, పొడవు, పరిమాణం కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా ‘టాంగో’ టెక్నాలజీతో పనిచేసే 32 యాప్‌లను గూగుల్‌ విడుదల చేసింది. వాటిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం రూ.33,326 గా ఉంది.
‘లెనొవొ ఫ్యాబ్‌2 ప్రో’ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి :
  • * 6.4అంగుళాల డిస్‌ప్లే
  • ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 6.0 (మార్ష్‌మాల్లో)
  • స్నాప్‌డ్రాగన్‌ 652 ప్రాసెసర్‌
  • 4జీబీ ర్యామ్‌
  • 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 4,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • కెమెరా: ముందు 8 మెగాపిక్సెల్‌, వెనుక 16 మెగాపిక్సెల్‌

న‌వంబ‌ర్ 11 న వస్తున్న నాగచైతన్య

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో లవ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహసం శ్వాసగా సాగిపో’.
మిర్యాల‌ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.
ఏ మాయ చేసావే త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌ల‌వుతుంది. 
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 

ఎన్టీఆర్ వైద్యసేవ మరింత చేరువలో…

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తృతం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉచిత వైద్యసేవ పధకంలో కొన్ని మార్పులు చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తుంది.
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 421 ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. నవంబర్ 1 వరకు రాష్ట్రంలో ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్లు మొత్తం 66లక్షల మందికి వైద్యసేవ పథకం ద్వారా చికిత్స చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ఖర్చు లేకుండా అన్నివిధాలుగా ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ అందిస్తున్నామని తెలిపింది
ఎన్టీఆర్ వైద్యసేవలో ఇంతకుముందు ఉన్న 944 చికిత్సలకు అదనంగా 100 చికిత్సలను ఈ పరిధిలోకి తీసుకువస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి అంశాలను కూడా చేర్చారు. వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు చేసే కాక్లియార్ ఇంప్లాటేషన్‌కు రూ.6 లక్షల వరకు, మూత్రపిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ.3.5లక్షల వరకు ఈ పథకం కింద లబ్ధిపొందవచ్చు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం చేసేందుకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు ప్రభుత్వం పెంచనుంది.
2014 జూన్ 2 నుంచి ముందుగా అనుమతి తీసుకుని వైద్యం చేయించుకున్న వారు 8.65 లక్షల మంది అని, వారి చికిత్స కోసం అయిన మొత్తం 2,528 కోట్లు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 8.54లక్షలుగా ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి.

గ్రూప్ పరీక్షలకు వయోపరిమితి పెంపు.. ...........

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు వయోపరిమితిని పెంచారు. 42 ఏళ్ల దాకా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 2 ఏళ్ల పొడిగిస్తూ ఆదేశాలు జారి చేశారు. ఇప్పుడు గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు వయోపరిమితి పెంచారు నిరుద్యోగుల ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

రివ‌ర్స్ షాక్‌: టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి జంపింగ్‌లు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన నాయ‌కులు టీఆర్ఎస్‌కు రివర్స్‌షాక్ లు ఇస్తున్నారు. ఒక‌ప్పుడు టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో టీడీపీ నాయ‌కులు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ‌స్థాయి నాయ‌కుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వ‌ర‌కు అంద‌రూ కారెక్కేశారు.
ఇప్పుడు వారంతా మ‌ళ్లీ మాతృపార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రెడీ అవుతుండ‌డం టీఆర్ఎస్‌కు పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది. టీడీపీలో ఉన్న‌ప్పుడు ఒక‌వెలుగు వెలిగిన‌, మంచి హోదా అనుభ‌వించిన వారంతా టీఆర్ఎస్‌లో ఇమ‌డలేక, పార్టీ విధానాలు న‌చ్చ‌క‌, పార్టీలో స‌రైన గుర్తింపు లేక చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌ని స‌మాచారం. దీంతో త‌మ సొంత పార్టీ అయిన టీడీపీలోకి వ‌చ్చేయాల‌ని స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.
ఈ రివ‌ర్స్ జంపింగ్‌లు ఎక్కువ‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉండ‌నున్నాయి. ఇప్ప‌టికే మ‌ల్కాజిగిరి ఎంపీ మ‌ల్లారెడ్డి బామ్మార్ది, గుండ్ల‌పోచంప‌ల్లి మాజీ స‌ర్పంచ్ మ‌ద్దుల శ్రీ‌నివాస్‌రెడ్డి టీడీపీ తీర్థాన్ని పుచ్చుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఇక గ్రేట‌ర్‌, రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్‌లో అసంతృప్తి వాదుల‌ను తిరిగి పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మాన్ని టీ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌, తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నున్నారు.
త్వ‌ర‌లోనే రంగారెడ్డి జిల్లాలోని మేడ్చ‌ల్‌, శామీర్ పేట‌, కీస‌ర‌, ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లాల నుంచి అధిక సంఖ్య‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తిరిగి టీడీపీలో చేర‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు స‌మాచారం. టీఆర్ఎస్‌లో ప‌ద‌వులు ఆశించి వెళ్లిపోయిన ద్వితీయ శ్రేణి నాయ‌కులు అక్క‌డ ప‌ద‌వులు రాక‌పోవ‌డం, స‌రైన గౌర‌వం లేక‌పోవ‌డంతో తిరిగి టీడీపీలో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీ కాంగ్రెస్ కు మెగా షాక్

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఏదో ఒక రకంగా పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాపు ఉద్యమం కారణంగా మళ్లీ జవసత్వాలు నింపుకోవాలని భావించిన ఏపీ కాంగ్రెస్ నేతలు… ఆ ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో డీలా పడిపోయారు. మళ్లీ ఎలాగోలా చల్లపడ్డ కాపు ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం విజయవాడలో కాపు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు ఆ పార్టీ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్. అయితే ఈ సమావేశానికి కాపులను ఆకర్షించే కీలక నేత అయిన సినీ నటుడు చిరంజీవి రాకపోవడంపై కాంగ్రెస్ లోనే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొద్ది రోజులగా కాంగ్రెస్ నేత చిరంజీవి టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇస్తున్నారనే తప్ప… మెగాస్టార్ వైపు నుంచి ఈ వార్తను ఎవరూ కొట్టిపారేయడం లేదు. దీంతో చిరంజీవి అంశం ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే పెద్ద తలనొప్పిగా మారిందని గుసగుసలు మొదలయ్యాయి. షూటింగ్ కారణంగానే చిరు విజయవాడ మీటింగ్ కు రాలేదని కొందరు చెబుతున్నా.. టీడీపీలో చేరే విషయంలో ఆయన నుంచి స్పందన లేదేమిటని ప్రశ్నిస్తే మాత్రం ఎవరి నుంచి సరైన సమాధానం రావడం లేదని తెలుస్తోంది. అయితే గతంలో చిరంజీవి బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయని… ప్రస్తుతం టీడీపీలో చేరతారనే న్యూస్ కూడా అలాంటిదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా… కాపులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు మెగాస్టార్ షాక్ ఇచ్చినట్టే భావించకతప్పదు.

Now fly to America from Gannavaram with Just One Air Ticket

From tomorrow, May 1st Air India is running a flight from Gannavaram that connects cities like San Francisco, New York and Chicago. Air India flight connects these cities with change of aircraft in New Delhi, but a single ticket is issued from Vijayawada.
Below is the schedule if you want to travel from Gannavaram to New York
  • The flight Airbus A319, will start at 8.30 PM in Gannavaram and reach Delhi at 10.30 PM, where the travel time is exactly 2 hours
  • You will have a Layover in New Delhi Airport for 3 hours 15 mins.
  • You will get into New York flight Boeing 777, at 1.45 AM and reach New York city within 15 hours 10 mins
  • The overall travel time is approx. 20 hours
This would help the flyers from Krishna, Guntur, Prakasam and Godavari Districts in the state and they need not to depend on Hyderabad or Chennai Airport to catch international flights.

ఇంటిని రెంట్‌కు ఇచ్చిన వెంక‌టేష్‌

విక్ట‌రీ వెంక‌టేష్ ఫిలింన‌గ‌ర్‌లో ఉన్న త‌న ఇంటిని అద్దెకు ఇచ్చాడు.. అదేంటి ఆయ‌న ఇంటిని రెంట్‌కి ఇవ్వ‌డ‌మేంటి ? ఆయ‌న‌కు అంత అవ‌స‌రం ఏముంటుంది అనుకుంటున్నారా.. ? ఇది నిజ‌మే.. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ ప్రాంతం సినీ ప్ర‌ముఖుల‌తో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది ఈ ప్రాంతం. సినీ ప్రముఖులంతా తిరిగే ఏరియా కావడంతో ఈ పోష్ ఏరియా నిరంతరం చాలా రిచ్‌గా, కార్లతో హ‌డావుడిగా ఉంటుంది. ఫిలిం నగర్ రోడ్ మొద‌టిలో ద‌గ్గుబాటి వెంకటేష్ ఇల్లు అంటే ఎవరికైనా తెలిసిపోతుంది.
ప్రస్తుతం విక్ట‌రీ వెంక‌టేష్‌ మణికొండకు షిఫ్ట్ అయిపోవడంతో.. ఫిలింనగర్ లో ఆయన ఇంటిని ఇత‌ర‌ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేశారు. వెంకీ ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా కలిపి ఓ చిన్నపాటి బిజినెస్ సెంటర్ గా రూపుదిద్దుకుంది. ఫుడ్ జాయింట్ సముదాయంగా మారిపోవడంతో..రిచ్ బాబులంతా.. బెంజ్ కార్లతో అర్ధరాత్రి వరకు అక్క‌డ నానా హంగామా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వెంకీ హౌస్‌ ఫుల్ బిజీగా మారిపోయింది.
ఫిలిం నగర్ సెంటర్లో ఈ రేంజ్లో ఉన్న‌ఫుడ్ సెంట‌ర్ లేక‌పోవ‌డంతో ఈ ప్లేస్‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఈ వ్యాపారం మూడు కాఫీలు, ముఫ్ఫై ప‌రోటాలుగా దూసుకెళుతోంది. ఇంపోర్టెడ్‌ ఐస్ క్రీమ్స్ విక్రయించే ఓ ఐస్ క్రీమ్ షాప్.. డిఫరెంట్ కాంబినేషన్స్ లభించే జ్యూస్ స్టాల్స్ ఇక్క‌డ వెలిసిపోయాయి. అన్నికాస్ట్‌లీ ఐట‌మ్స్‌, పేరు మోసిన బ్రాండ్స్ విరివిగా లభ్యమవుతుండడంతో వెంకీ హౌస్ ఇప్పుడు నిత్యం ఎంతో సంద‌డితో ఉంటోంది.

సింగపూర్ ప్రయాణీకులకి శుభవార్త

సింగపూర్ కి ప్రయాణించే వారి కోసం ప్రముఖ బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన టైగర్ ఎయిర్ కొత్త ఆఫర్ ప్రకటించింది
ఈ ఆఫర్ హైదరాబాద్ కొచ్చిన్ తిరుచ్చి బెంగళూరు లక్నో నుంచి సింగపూర్ ప్రయాణించే వారు ఈ ఆఫర్ పొందవచ్చు …పైన చెప్పిన ప్రాంతాల నుంచి కేవలం 13,599 రూపాయలకే సింగపూర్ వెళ్లి రావచ్చు ….
ఈ ఆఫర్ నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు …కానీ ప్రయాణ తేదీలు మాత్రం ఫిబ్రవరి 1 2017 నుండి అక్టోబర్ 30 వరకు ఉండాలి అంటే ఈ సమయం లో ప్రయాణం కోసం ముందస్తు రిజర్వేషన్స్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది

మాజీ సీఎం కిర‌ణ్‌కు మ‌ళ్లీ పెళ్లి…ముహూర్తం ఫిక్స్‌

మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి న‌క్క తోక తొక్కి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు ఉన్నారు. పీలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న మంత్రి కాకుండానే డైరెక్టుగా స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎం అయిపోయారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ స్టేట్‌ను విభ‌జించ‌డంతో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కిర‌ణ్ ఆపై ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గట్టుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో కిర‌ణ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.
ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత దాదాపు రెండున్న‌రేళ్లు సైలెంటుగా ఉన్న కిర‌ణ్ మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా కిర‌ణ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పీలేరు ప‌ర్య‌ట‌న‌లో చేసిన వ్యాఖ్య‌లే ఆమ‌న రీ పాలిటిక్స్ ఎంట్రీకి ఊత‌మిస్తున్నాయి. కిర‌ణ్ రెండు రోజుల క్రితం గుర్రంకొండ మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు రాజ‌కీయంగా మీరు కూడా ఓ స్టెప్ తీసుకుని త‌మ‌కు కూడా దారి చూపించాల‌ని చెప్పారు.

దీనిపై స్పందించిన ఆయ‌న ఇప్పటికే పెళ్లి కుదిరింద‌ని… పెళ్లి కూతురు ఎవరన్నది మాత్రం ప్ర‌స్తుతానికి రహస్యమ‌ని… త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అంద‌రికీ స్వ‌యంగా చెపుతాన‌ని, శుభలేఖలు అందరికీ వస్తాయ‌నీ చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.
వాస్త‌వానికి కొద్ది రోజుల క్రితం కిర‌ణ్ బీజేపీలోకి వెళ‌తార‌న్న టాక్ వ‌చ్చింది. అయితే కొంద‌రు వైకాపాలోకి వెళ‌తార‌ని కూడా అంటున్నారు. కిర‌ణ్ టీడీపీలోకి వెళ్లే ఛాన్సులు లేవ‌ని జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించాల‌నుకుంటే బీజేపీ లేదా ఏపీలో కీ రోల్ పోషించాల‌నుకుంటే వైకాపాలోకి వెళ‌తార‌న్న టాక్ చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. మ‌రికొంద‌రు మాత్రం గతంలో విడిపోయిన కాంగ్రెస్ లోనే తిరిగి సమైక్యాంధ్ర పార్టీని విలీనం చేయ‌బోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.

ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఇవన్నీ తప్పనిసరి!

1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
21. గోపుర దర్శనం తప్పక చేయాలి.
22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి మహార్దశ

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త రూపు దాల్చనుంది.
ఏకంగా 600 పడకల సామర్ధ్యంతో తల్లీ, పిల్లలకు సమస్త వైద్యసేవలు లభించనున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ ఎం) కింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.20 కోట్లతో జీజీహెచ్‌కు మాతా శిశు ఆరోగ్య కేంద్రం మంజూరు చేసింది. దీంతో 200 ప్రసూతి పడకలు సమ కూరురాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు అంతస్తులుగా ఈ భవనం నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ నేపథ్యం లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా)  వైద్యులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారు. జింకానా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరంతస్తులతో బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. 
మూడు అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.30 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపద్యంలో జింకానా వైద్యులు రూ.15 కోట్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం రూ.15 కోట్లు గ్రాంటు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ చొరవతో మరో ఎన్నారై డాక్టర్‌ రూ.15 కోట్లు విరాళం అందించేందుకు అంగీకరించారు. దీంతో కేంద్ర మంజూరు చేసిన రూ.20 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు రూ.15 కోట్లు, ఎన్నారై డాక్టర్‌లు విరాళంగా అందజేసే రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్లుతో ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఇదే విషయం మంత్రి కామినేని సచివాలయంలో మంగళవారం ప్రకటించారు. 
మొత్తం రూ.65 కోట్ల వ్యయంతో ఆరంతస్తులుగా ఈ భవనాన్ని తీర్దిదిద్దునున్నారు. గుంటూరు (మెడికల్‌): జీజీ హెచలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని జీ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్స్‌తో హైదరాబాద్‌కు చెందిన స్టాం డర్డ్‌ ఇనఫ్రా లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తుం ది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో సహ నాలుగు అంతస్తుల్లో సీ్త్ర, ప్రసూతి వార్డులు, రెండు అంతస్తుల్లో నవ జాత శిశువుల వార్డులు ఉంటాయి. పీడియాట్రిక్‌ ఐసీయూ, నియోనేటల్‌ ఐసీయూ, స్పెషల్‌ కేర్‌ న్యూబార్న్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) వంటి అన్ని పిల్లల వార్డులు ఈ భవనంలోకే తరలిస్తారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో 180 కాన్పుల పడకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడవి మూడు రెట్లకు పెరగనున్నాయి. దీంతో కాన్పుల కష్టాలు తీరతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు

నేతాజీ మరణం గురించిన పూర్తి నిజాల్ని తెలిపే వ్యాసాన్ని పోస్టు చేస్తున్నాను… ప్రతీ వ్యక్తి చదివి మీ మీ మిత్రులకు షేర్ చేయండి…

(ఎం.వి.ఆర్. శాస్త్రి, ఆంధ్రభూమి ఎడిటర్, ఉన్నమాట, 03/10/2015)
గాంధీగారు కాంగ్రెసుకు సర్వాధికారి.
తిరుగులేని నియంత.
అంతటివాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచినవాడు జాతీయ కాంగ్రెసు చరిత్రలో ఒకే ఒక్కడు:
నేతాజీ సుభాష్ చంద్ర బోస్.
1939 త్రిపురి కాంగ్రెసు అధ్యక్ష ఎన్నికలో నేతాజీకి పోటీగా పట్ట్భా సీతారామయ్యను నిలబెట్టి మహాత్ముడు సర్వశక్తులు ఒడ్డినా బోసుబాబే ఘనవిజయం సాధించాడు.
* * *
దేశాన్ని అడ్డగోలుగా చీలుస్తూంటే మీరెలా ఊరుకున్నారు? ఎందుకు తిరగబడలేదు అని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తరవాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రు పండితుడు ఏమన్నాడు?
‘అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి. పోరాటాలు చేసిచేసి అలసిపోయాం. మళ్లీ ఉద్యమించి జైళ్లకు వెళ్లే ఓపిక మాకెవరికీ లేదు. స్వాతంత్య్రానికి దేశ విభజన దగ్గరిదారి చూపింది. అందుకే ఒప్పేసుకున్నాం.’
నెహ్రులాగే, ఆయనకు తోడుబోయిన కాంగ్రెసు మహానాయకుల్లాగే మిగతా దేశం కూడా కాడికింద పారేసి కాళ్లు బారజాపి కూచుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్య్రం కూడా సిద్ధించేది కాదు. మిగిలిన అగ్రనేతలు అలిసి సొలిసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు. ఆంగ్లేయ సర్కారు కళ్లుకప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిషు వారిపై పోరుకు సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు. ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు. స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హింద్ ఫౌజ్‌తో దండెత్తివచ్చి, తెల్లవారి పీచమణచి, దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడే.
* * *
‘కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొనే్నళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పెత్తనానికి వచ్చిన గత్తరలూ లేవు. మరి మీరేమిటి – కొంపలేవో మునుగుతున్నట్టు అలా ఆదరాబాదరా జెండా పీక్కొని పలాయనం చిత్తగించారు? అంత అర్జంటుగా స్వాతంత్య్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడానికి మిమ్మల్ని పురికొల్పిన కారణాలేమిటి?’
-అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’
* * *
అంటే – ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొన్నదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే. జాతికి, దేశానే్నలే వారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.
చెప్పుకుంటే సిగ్గుచేటు. పూజించే మాట దేవుడెరుగు. కనీస మర్యాద, మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు.
ప్రపంచంలో ఏ దేశంలోనైనా – విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వతంత్ర ప్రభుత్వమూ ఒడిగట్టదు.
మహా ఘనత వహించిన నీతులమారి భారత సర్కారు మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావుశతాబ్దం పాటు జంకులేకుండా సాగించింది.
ప్రజాస్వామిక విలువలను,
నెహ్రు పండితుడే బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలను పొంచి చూడమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.
ఇక్కడో సందేహం సహజం.
నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వారూ అంగీకరించారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?
వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని! అసలు సంగతి తెలిస్తే జనం తమ మొగాన పేడనీళ్లు ఎక్కడ కొడతారోనని!!
1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.
శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.
‘విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పాడు. వైస్రాయ్ తల ఊచాడు.
ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు పవర్లోకి వచ్చింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రు ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే.
కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతాశ్రీలకు తెలుసు. ప్రజాబలంలో అతడి ముందు వారు ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకూ క్షేమమని వారూ తలిచారు. ఏమి జరిగిందో ఎరగనట్టు మాయమాటలతో కాలక్షేపం చేశారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టారు. వారికొచ్చే ఉత్తరాలను చించి, తమకు చిక్కులు తెచ్చే వాటిని సర్కారీ అరల్లో దాచేసేవారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు… ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారిని కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల కిందే బయటపెట్టాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.
అసలు మిస్టరీ ఇది కాదు.
సాటిలేని జాతీయ వీరుడైన బోస్ జ్ఞాపకాలను తుడి చెయ్యాలని ఆయన ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రు ఆరాటపడ్డాడంటే అర్థం ఉంది. తమ కులదైవాల ప్రతిష్ఠ మసకబారకూడదన్న ఆదుర్దాలో కాంగ్రెసు ప్రభుత్వాలు గుట్టురట్టు కానివ్వలేదన్నా అర్థం చేసుకోవచ్చు.
‘మీ రక్తం ఇవ్వండి; స్వాతంత్య్రం పొందండి’ అని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా?
మన స్వాతంత్య్రం మేడిపండేనా?…

అమరావతి లో అట్టహాసంగా శంఖుస్థాపన

ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ శంకుస్థాపన అమరావతిలో జరిగింది. విట్ యూనివర్సటీ 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. జూలై 2017 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఆరు నెలల్లో విట్ భవనాలను పూర్తి చేయనుంది.
‘విట్’ తమ యూనివర్సిటీ నెలకొల్పడమే కాదు అమరావతిలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంటుంది. శాఖమూరు, వెలగపూడి, ఐనవోలు గ్రామాలను ‘విట్’ యూనివర్సిటీ దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని వీసీ విశ్వనాథన్ ప్రకటించారు.
అమరావతి ఐనవోలులో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల పాల్గొన్నారు. విట్ శిలాఫలకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు వల్లే విట్ వచ్చిందని. విట్ ద్వారా 32 వేల మందికి సాంకేతిక విద్య అందనుందని, వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లులాంటివని, విశ్వనాథన్ రాజకీయాలు వద్దని విట్‌ను స్థాపించారని, పెట్టుబడులు వస్తేనే సంపద పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి త్వరలో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలను తీసుకువస్తాం అన్నారు. విట్ క్యాంపస్‌లలో అమరావతి క్యాంపస్ నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌తో దేశానికే అమరావతి నాలెడ్జ్ హబ్‌గా మారుతుందని, త్వరలో అమరావతిలో ఎస్‌ఆర్ఎం, ఆమ్జే, ఎయిమ్స్ విద్యాసంస్థలను తీసుకువస్తామన్నారు. అవకాశం ఇస్తే తెలుగు విద్యార్థులు ప్రపంచాన్ని జయిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

గోవును వధించడానికి వచ్చిన వాన్ని చూసి గోవు ఎందుకు నవ్వింది. గోవు చెప్పే ఈ సారాంశాన్ని తప్పక చదవండి.

ఒకరోజు పశు వధ శాలలో ఒకడు
గోవును చంపడానికొచ్చినపుడు
గోవు వానిని చూసి నవ్వింది.
దాన్ని చూసి కసాయి అడిగాడు.
నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.
.
అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.
ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే
నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.
పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.
నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.
అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.
ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.
కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్…..
నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.
ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.
నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.
కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.
నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.
శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.
.
(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ
ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)
జై గోమాత.?

జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

1.కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.
?2.సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు.ఎడతెగని ప్రయత్నం కావాలి.
?3.ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
?4.మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
?5.గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు.కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు.కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
?6.బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు.బలవంతుడి పక్షం వహించినట్లు.
?7.అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
?8.అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
?9.ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
?10.నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
?11.మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.
?12.బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
?13.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
?14.పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం….ఇదే జీవితం.
?15.ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… –  శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
?16.తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.
?17.మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
?18.మెరుగు పెట్టకుండా రత్నానికి,  – కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
?19.కేవలం డబ్బుంటే సరిపోదు.మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.n
?20.ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.