Friday, November 4, 2016

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి మహార్దశ

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త రూపు దాల్చనుంది.
ఏకంగా 600 పడకల సామర్ధ్యంతో తల్లీ, పిల్లలకు సమస్త వైద్యసేవలు లభించనున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ ఎం) కింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.20 కోట్లతో జీజీహెచ్‌కు మాతా శిశు ఆరోగ్య కేంద్రం మంజూరు చేసింది. దీంతో 200 ప్రసూతి పడకలు సమ కూరురాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు అంతస్తులుగా ఈ భవనం నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ నేపథ్యం లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా)  వైద్యులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారు. జింకానా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరంతస్తులతో బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. 
మూడు అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.30 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపద్యంలో జింకానా వైద్యులు రూ.15 కోట్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం రూ.15 కోట్లు గ్రాంటు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ చొరవతో మరో ఎన్నారై డాక్టర్‌ రూ.15 కోట్లు విరాళం అందించేందుకు అంగీకరించారు. దీంతో కేంద్ర మంజూరు చేసిన రూ.20 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు రూ.15 కోట్లు, ఎన్నారై డాక్టర్‌లు విరాళంగా అందజేసే రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్లుతో ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఇదే విషయం మంత్రి కామినేని సచివాలయంలో మంగళవారం ప్రకటించారు. 
మొత్తం రూ.65 కోట్ల వ్యయంతో ఆరంతస్తులుగా ఈ భవనాన్ని తీర్దిదిద్దునున్నారు. గుంటూరు (మెడికల్‌): జీజీ హెచలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని జీ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్స్‌తో హైదరాబాద్‌కు చెందిన స్టాం డర్డ్‌ ఇనఫ్రా లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తుం ది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో సహ నాలుగు అంతస్తుల్లో సీ్త్ర, ప్రసూతి వార్డులు, రెండు అంతస్తుల్లో నవ జాత శిశువుల వార్డులు ఉంటాయి. పీడియాట్రిక్‌ ఐసీయూ, నియోనేటల్‌ ఐసీయూ, స్పెషల్‌ కేర్‌ న్యూబార్న్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) వంటి అన్ని పిల్లల వార్డులు ఈ భవనంలోకే తరలిస్తారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో 180 కాన్పుల పడకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడవి మూడు రెట్లకు పెరగనున్నాయి. దీంతో కాన్పుల కష్టాలు తీరతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు

No comments:

Post a Comment