Monday, November 7, 2016

చంద్రబాబు కష్టం మట్టి పాలు అవుతుందా

ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ప్రతి శుక్రవారం సచివాలయంలో ఉండి ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వినతి పత్రాలను తీసుకోవాలి దీన్నే  గ్రీవెన్స్ డే గా నామకరణం చేశారు . ప్రతి మంత్రి గ్రీవెన్స్ డే రోజు తప్పకుండా అందుబాటులో ఉండాలని సియం చంద్రబాబు ఆదేశించారు. దీని మీద ఉత్తర్వులు కూడా జారి అయ్యాయి .
కానీ అమరావతిలో సచివాలయం ప్రారంభమై మూడు శుక్రవారాలు దాటిపోయాయి కాని ఒక్క శుక్రవారం కూడా గ్రీవెన్స్ డే జరగలేదు. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు వినతి పత్రాలు సమర్పించుకోటానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, సామాన్యులకు నిరాశ ఎదురైంది. మొదటి శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మంత్రులు నిమగ్నమయ్యారు. రెండో శుక్రవారం అమరావతిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అందరు మంత్రులు అక్కడే ఉన్నారు. ఇక మూడో శుక్రవారం మాత్రం మంత్రి నారాయణ మాత్రమే గ్రీవెన్స్ డే లో పాల్గొన్నారు. మిగతా మంత్రులు ఎవరు సచివాలయంలో కనిపించలేదు.
మొదట రెండు శుక్రవారాలు జరగలేదు మూడో శుక్రవారం అన్నా మంత్రులు అందుబాటులో ఉంటారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. మంత్రులు ఎప్పుడు ఉంటారో ముందే మాకు సమాచారం ఇస్తే అప్పుడే వస్తాము అని ప్రజలు వాపోతున్నారు.
చంద్రబాబు 66 ఏళ్ళ వయసులో అంతా తానై పొద్దున ఒక చోట మద్యాహ్నం ఒక చోట సాయంత్రం ఒక చోట అలుపెరగకుండా తిరుగుతుంటారు. రోజుకి 18 గంటలు పని చేస్తారు. రివ్యూలు, అధికారులతో వీడియొ కాన్ఫరెన్స్, మీటింగులు, పార్టీ నిర్వహణ ఇలా ఖాళీ లేకుండ పరిగెడుతూ అధికారులని పరిగెత్తిస్తుంటారు. చంద్రబాబు రాష్ట్రం కోసం ప్రజల కోసం అంత కష్టపడుతుంటే ఎంత మంది  మంత్రులు ఎంత బాధ్యత గా ఉంటున్నారు …ఎంత మంది ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అని ఒక్క సారి ప్రశ్నించుకుంటే మంచిది …చంద్రబాబు దారిలో వీరు కూడా నడిస్తే పర్లేదు కాని ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన చంద్రబాబు కష్టాన్ని మట్టి పాలు చేసిన వారవుతారు 

No comments:

Post a Comment