ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన వెల్లూరు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ శంకుస్థాపన అమరావతిలో జరిగింది. విట్ యూనివర్సటీ 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. జూలై 2017 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఆరు నెలల్లో విట్ భవనాలను పూర్తి చేయనుంది.
‘విట్’ తమ యూనివర్సిటీ నెలకొల్పడమే కాదు అమరావతిలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంటుంది. శాఖమూరు, వెలగపూడి, ఐనవోలు గ్రామాలను ‘విట్’ యూనివర్సిటీ దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని వీసీ విశ్వనాథన్ ప్రకటించారు.
అమరావతి ఐనవోలులో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల పాల్గొన్నారు. విట్ శిలాఫలకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు వల్లే విట్ వచ్చిందని. విట్ ద్వారా 32 వేల మందికి సాంకేతిక విద్య అందనుందని, వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లులాంటివని, విశ్వనాథన్ రాజకీయాలు వద్దని విట్‌ను స్థాపించారని, పెట్టుబడులు వస్తేనే సంపద పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి త్వరలో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలను తీసుకువస్తాం అన్నారు. విట్ క్యాంపస్‌లలో అమరావతి క్యాంపస్ నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌తో దేశానికే అమరావతి నాలెడ్జ్ హబ్‌గా మారుతుందని, త్వరలో అమరావతిలో ఎస్ఆర్ఎం, ఆమ్జే, ఎయిమ్స్ విద్యాసంస్థలను తీసుకువస్తామన్నారు. అవకాశం ఇస్తే తెలుగు విద్యార్థులు ప్రపంచాన్ని జయిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
No comments:
Post a Comment