రియల్ ఎస్టేట్ చట్టం నిబంధనల్లో ఆర్‌బిఐ వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్టు ఆర్‌బిఐ వర్గాలు తెలిపాయి.
నిర్మాణం, రియల్టీ రంగాలు, వివాదాల సత్వర పరిష్కారం, స్తంభించిపోయిన ప్రాజెక్టుల పునరుజ్జీవం వంటి చర్యలను కేంద్రకేబినెట్ ఈ ఏడాది ప్రారంభంలో అనుమతించింది. ఆ రంగాల్లోని కంపెనీలకు ఊరట కల్పించేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ని ప్రవేశ పెడుతుంది.
వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ యొక్క ఉపయోగాలు:
- అగ్రిమెంట్ లో పేర్కొన్న సమయానికి రియల్టర్ గనక ఇల్లు కట్టి ఇవ్వకపోతే కస్టమర్లు ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకోవచ్చు. అలాగే.. కస్టమర్లు సమయానికి డబ్బు చెల్లించకపోతే రియల్టర్లు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది.
- కస్టమర్ డబ్బు చెల్లించడంలో జాప్యం చేస్తే అతడికి కేటాయించిన ఇంటిని రద్దు చేయడంతో పాటు బుకింగ్ డబ్బులు, వడ్డీని మినహాయించి మిగిలిన డబ్బును కస్టమర్ కు రియల్టర్ చెల్లించాలి.
- అలాగే.. రియల్టర్ సకాలంలో ఇంటిని నిర్మించి ఇవ్వలేకపోతే కస్టమర్లు అగ్రిమెంట్ ను రద్దు చేసుకుని, తాము చెల్లించిన డబ్బును 45రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు.
- సకాలంలో ఇల్లు కట్టకపోయినా కస్టమర్ గనుక అగ్రిమెంట్ ను రద్దు చేసుకోకుండా కొనసాగించినట్లయితే పాత నిబంధనలు ప్రకారం యస్బిఐ లెండింగ్ రేటుతో పాటు 2 శాతం అదనంగా వడ్డీని రియల్టర్ నుంచి పొందొచ్చు.
- ముందు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తాన్ని రియల్టర్లు వసూలు చేయరాదు. అధికార వర్గాలు డెవలప్మెంట్ చార్జీలు పెంచితే తప్ప అపార్ట్ మెంట్ లేదా ప్లాట్ ధరను పెంచడం కుదరదు.
- రియల్టర్ ఇంటిని పూర్తి చేసి ఇచ్చిన 2 నెలల్లోనే కస్టమర్ దాన్ని స్వాదీనం చేసుకోవాలి. కాగా, కస్టమర్లు, రియల్టర్లుకు సమాన హక్కులుండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
No comments:
Post a Comment