Monday, November 7, 2016

మరో సంచలన నిర్ణయం

చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతానికి తలమానికంలా ఏదోక మైలురాయి ఉండాలనే ఆలోచన చేశారు. ఆ ఆలోచన అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం కొండపై బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు.
బుద్ధుని విగ్రహం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకోటం మాత్రమే కాదు ఆదేశాలు కూడా జారి చేశారు. తాజాగా ఇచ్చిన ఆదేశాలు పర్యాటకానికి నూతన రూపు తీసుకురానున్నాయి అనే చెప్పాలి.
గతంలో సీతానగరం కొండపై హిల్‌ ప్రాజెక్టు పేరుతో 60 అడుగుల బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దడానికి 2011లో వీజీటీఎం ఉడా ప్రతిపాదనలు రూపొందించింది. రూ.73.12 కోట్ల వ్యయంతో మూడు దశల్లో కొండను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది.
ఐతే ఈ ప్రాజెక్ట్ అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు 60 అడుగుల బుద్ధుని విగ్రహం కొండ పై వేలవనుంది. దీంతో సీతానగరం కొండను పర్యాటకంగా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.

No comments:

Post a Comment