మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నక్క తోక తొక్కి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉన్నారు. పీలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రి కాకుండానే డైరెక్టుగా సమైక్యాంధ్రప్రదేశ్‌కు సీఎం అయిపోయారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ స్టేట్‌ను విభజించడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కిరణ్ ఆపై ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కిరణ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దాదాపు రెండున్నరేళ్లు సైలెంటుగా ఉన్న కిరణ్ మళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా కిరణ్ తన సొంత నియోజకవర్గమైన పీలేరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలే ఆమన రీ పాలిటిక్స్ ఎంట్రీకి ఊతమిస్తున్నాయి. కిరణ్ రెండు రోజుల క్రితం గుర్రంకొండ మండలంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన అనుచరులు కొందరు రాజకీయంగా మీరు కూడా ఓ స్టెప్ తీసుకుని తమకు కూడా దారి చూపించాలని చెప్పారు.
దీనిపై స్పందించిన ఆయన ఇప్పటికే పెళ్లి కుదిరిందని… పెళ్లి కూతురు ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి రహస్యమని… త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అందరికీ స్వయంగా చెపుతానని, శుభలేఖలు అందరికీ వస్తాయనీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనంగా మారాయి.
వాస్తవానికి కొద్ది రోజుల క్రితం కిరణ్ బీజేపీలోకి వెళతారన్న టాక్ వచ్చింది. అయితే కొందరు వైకాపాలోకి వెళతారని కూడా అంటున్నారు. కిరణ్ టీడీపీలోకి వెళ్లే ఛాన్సులు లేవని జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించాలనుకుంటే బీజేపీ లేదా ఏపీలో కీ రోల్ పోషించాలనుకుంటే వైకాపాలోకి వెళతారన్న టాక్ చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. మరికొందరు మాత్రం గతంలో విడిపోయిన కాంగ్రెస్ లోనే తిరిగి సమైక్యాంధ్ర పార్టీని విలీనం చేయబోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.
No comments:
Post a Comment