Friday, November 4, 2016

ఎన్టీఆర్ వైద్యసేవ మరింత చేరువలో…

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తృతం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉచిత వైద్యసేవ పధకంలో కొన్ని మార్పులు చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తుంది.
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 421 ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. నవంబర్ 1 వరకు రాష్ట్రంలో ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్లు మొత్తం 66లక్షల మందికి వైద్యసేవ పథకం ద్వారా చికిత్స చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ఖర్చు లేకుండా అన్నివిధాలుగా ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ అందిస్తున్నామని తెలిపింది
ఎన్టీఆర్ వైద్యసేవలో ఇంతకుముందు ఉన్న 944 చికిత్సలకు అదనంగా 100 చికిత్సలను ఈ పరిధిలోకి తీసుకువస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి అంశాలను కూడా చేర్చారు. వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు చేసే కాక్లియార్ ఇంప్లాటేషన్‌కు రూ.6 లక్షల వరకు, మూత్రపిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ.3.5లక్షల వరకు ఈ పథకం కింద లబ్ధిపొందవచ్చు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం చేసేందుకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు ప్రభుత్వం పెంచనుంది.
2014 జూన్ 2 నుంచి ముందుగా అనుమతి తీసుకుని వైద్యం చేయించుకున్న వారు 8.65 లక్షల మంది అని, వారి చికిత్స కోసం అయిన మొత్తం 2,528 కోట్లు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 8.54లక్షలుగా ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి.

No comments:

Post a Comment