పూర్తిస్థాయిలో ‘ఆగ్‌మెంటెడ్ రియాలిటీ’ ఫీచర్లను అందించే సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ‘ఆగ్‌మెంటెడ్ రియాలిటీ’ అంటే మొన్ననే పోకెమాన్ గో అనే గేమ్ గురించి తెలుసు కదా.. ఆ గేమ్ ఆగ్‌మెంటెడ్ రియాలిటీ సా0కేతికతతోనే పని చేస్తుంది.
‘లెనొవొ ఫ్యాబ్2 ప్రో’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిస్థాయి ఆగ్‌మెంటెడ్ రియాలిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ‘టాంగో’ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.
‘లెనొవొ ఫ్యాబ్2 ప్రో’ ఫోన్ కెమెరా తో ఫోటో తీస్తే ఆ ఫోటో 3D విజువల్ లోకి మారిపోతుంది. అలా మార్చేసేలా ఈ ఫోన్‌లో ప్రత్యేక సెన్సర్లు ఉన్నాయి. 3D విజువల్ మాత్రమే కాదు మనం తీసిన వస్తువు యొక్క ఎత్తు, పొడవు, పరిమాణం కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా ‘టాంగో’ టెక్నాలజీతో పనిచేసే 32 యాప్‌లను గూగుల్ విడుదల చేసింది. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.33,326 గా ఉంది.
‘లెనొవొ ఫ్యాబ్2 ప్రో’ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి :
- * 6.4అంగుళాల డిస్‌ప్లే
- ఓఎస్: ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మాల్లో)
- స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్
- 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ
- కెమెరా: ముందు 8 మెగాపిక్సెల్, వెనుక 16 మెగాపిక్సెల్
No comments:
Post a Comment