ఇండియన్ రైల్వే అభివృద్ధిని వేగవంతం చెయ్యాలనే ఆలోచనతో అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. రైళ్ళ వేగం పెంచే ఆలోచన చేసింది. మొదట దశలో రెండు ముఖ్యమైన మార్గాల్లో మిషన్ రఫ్తార్ పేరుతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రూ.10వేల కోట్లతో ప్రధాన మర్గాలైన దిల్లీ – ముంబయి, దిల్లీ – హౌరా మద్య తిరిగే రైళ్ళ వేగం గంటకు 160 కి.మీ. మేర పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇండియన్ రైల్వే. దాదాపు 9000 కి.మీ మేర ఉన్న ఈ రైల్వే లైన్స్ ని యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టాలని ఆదేశించింది రైల్వే శాఖ.
నిజంగా ఇది ఒక అద్బుత నిర్ణయం. ఇది సాకారం అయితే సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. రానున్న కాలంలో రెండు మర్గాల్లోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించాలని కోరుకుందాం.
No comments:
Post a Comment