Monday, October 31, 2016

పరిటాల సునీత కి కోపం తెప్పించింది ఎవరు ?

పరిటాల సునీత తన సొంత నియోజకవర్గం అయిన రాప్తాడు లో ప్రభుత్వ పధకాల అమలు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి పని తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనపై తప్పుడు లెక్కలు చెప్పొద్దని నియోజకవర్గంలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉందనేది తనకు బాగా తెలుసునని. కథలు చెప్పడం మానేసి వాస్తవాలు చెప్పాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల్ని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పేదలకు రాగులు, జొన్నలు ఇతరత్రా తృణ ధాన్యాలు రేషన్‌ దుకాణం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తెల్లకార్డులపై రేషన్‌ తీసుకోకపోయినా కార్డు రద్దు చేయకుండా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పలు పథకాల్లో క్షేత్రస్థాయికి భిన్నంగా అవాస్తవాలు చెబుతున్న కొందరు అధికారులను ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

అమరావతి నిర్మాణంలో మరో అపురూప ఘట్టం

అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకో అడుగు ముందుకు వేస్తుంది. మొన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభించగా, నిన్న ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేసుకున్నారు.
ఈ విషయం మరచిపోకముందే నేడు అమరావతి నిర్మాణంలో ముందడుగు వేస్తూ కొన్ని శంఖుస్థాపనలు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 3.30 నిమిషాలకి నిర్ణయించిన ముహూర్తానికి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతో పాటు 7 కీలక రహదారులకు శంఖుస్థాపన చేయనున్నారు. వీటి శంఖుస్థాపనతో పాటుగా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకీ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం అమరావతిలో లక్ష మందికి ఫస్ట్‌ రెసిడెంట్ కార్డులు, 37 వేల కుటుంబాలకు హెల్త్‌కార్డులతోపాటు నిరుద్యోగులకు ఆఫర్‌ లెటర్లను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అందజేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకి, నిర్మాణ సంస్థలకి స్పష్టం చేశారు.
దీనికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చే విందులో అరుణ్ పాటు మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు.

మనసులోని కోరిక నెరవేరాలంటే………….

ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి 21 రోజులు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు సీతారామస్తోత్రాన్ని 11 మార్లు పారాయణ చేయాలి. చివరిరోజు హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి.
శ్రీ సీతారామ స్తోత్రమ్
——————-
అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!
రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!
పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!
కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!
చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!
చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!
శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!
దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!
అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం.

ఎలక్ట్రిక్ బస్సులు రెడీ

రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ప్రభుత్వ రవాణాకు సంబందించిన ఆర్టీసి బస్సుల నుండి వచ్చే పొగ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బస్సు వెళ్ళింది అంటే రోడ్డు మొత్తం నల్లటి దుప్పటిలా పొగ కమ్మేస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందికర వాతావరణ కాలుష్యాన్ని పెంపొందించే పరిస్థితులని కట్టడి చేసేందుకు విద్యుత్తు(ఎలక్ట్రిక్‌) బస్సుల పనితీరుపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
జనవరికల్లా ప్రయోగాత్మకంగా ఒకట్రెండు బస్సులను నడపాలని యోచిస్తోంది. విద్యుత్తు బస్సుల ధర అధికమైనప్పటికీ వాటి నిర్వహణ వ్యయం తక్కువవ్వడంతో అధికారులకి సైతం దీని మీద ఆసక్తిపెరుగుతోంది. దేశంలో తొలిసారిగా బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(బీఎంటీఏ) సుమారు వందకు పైగా విద్యుత్తు బస్సులను నగర ప్రయాణికుల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిశ్చయించింది.
2014లో ఒక చైనా కంపెనీ విద్యుత్తు బస్సును ప్రయోగాత్మకంగా నడిపింది. అప్పట్లో ఒక్కో బస్సు విలువ రూ. 2.75 కోట్ల వరకు ఉండగా ప్రస్తుతం ఆధునిక బస్సుల ఖరీదు రూ.కోటి వరకూ ఉంది. తాజాగా దేశీయంగా విద్యుత్తుబస్సుల నిర్మాణానికి సైతం మార్గం సుగమం కావడంతో బీఎంటీసీ తాజాగా అదే దిశగా అడుగులు వేసే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం ఆర్టీసి నడుపుతున్న పెట్రోలు, డీజిల్‌ బస్సులతో పోలిస్తే విద్యుత్తు బస్సుల ద్వారా ఆదాయం మరింత పెరుగుతుంది అనేది బీఎంటీఏ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడించింది. కాలుష్య నివారణతో పాటు వ్యయం కూడా చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖలోని అధికారుల బృందం ఈ రిపోర్టుని మరింత లోతుగా అధ్యయనం చేసిన తరువాత విద్యుత్తు బస్సును ప్రోత్సహించేందుకు కేంద్రం ముసాయిదాను సిద్ధం చేసింది. విద్యుత్తు బస్సుల బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే చాలు 250 కిలోమీటర్ల దూరం పయనిస్తుంది. వీటిని వినియోగంలోకి తీసుకువస్తే రానున్న రోజుల్లో ఎక్కువ కిలోమీటర్లు నడిచే బస్సులు తప్పక వస్తాయని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న హైదరాబాద్‌లో ఈ బస్సులను నడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కాలుష్యం ఊహించనంత తగ్గుతుంది అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ తన అధ్యయనంలో తెలిపింది. కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్తు బస్సులపై రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో విద్యుత్తు బస్సులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. అలాగే విధ్యుత్ బుస్సులని మన నగరాలకి తెచ్చినప్పటికి వాటి బ్యాటరీ రీఛార్జింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు సమస్య అనేది లేదు, పైగా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సౌకర్యం ఉన్నందున వీటిని నడపడం పెద్ద సమస్య లేదని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి.రమణారావు వెల్లడించారు.

పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

శుక్రవారం (అక్టోబర్ 28) విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో నాలుగు భారీ పరిశ్రమలు ఏర్పాటుకి రంగం సిద్దమైంది. ఇవి రాష్ట్రంలో రూ.26,630 కోట్ల పెట్టుబడులు పెట్టి 53,100 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న మూడు సంస్థలకు ఆమోదం తెలిపారు. ఇవి రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 6700 మందికి ఉపాధి కల్పించే ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండున్నరేళ్లలో రూ.3,31,650 కోట్ల పెట్టుబడితో పలు సంస్థలు 375 పరిశ్రమలు స్థాపించనున్నట్లు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 253 పరిశ్రమల నిర్మాణం ప్రారంభం కాగా మరో 55 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రధానంగా సౌర, ఎలక్ట్రానిక్స్‌, చేనేత, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులపై పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలు :
1. ఎస్సెల్‌ జీసీఎల్‌ కన్సార్టియమ్‌ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.21,300 కోట్ల పెట్టుబడితో సౌరఫలకల తయారీ పరిశ్రమ.
2. తిరుపతికి సమీపంలో ‘డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ రూ.150 కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌.
3. అనిల్‌అంబానీకి చెందిన అడాగ్‌ సంస్థ ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’ విశాఖపట్నంలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ             యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
4. అనంతపురం జిల్లాలో గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ రూ.180 కోట్లతో గార్మెంట్‌ యూనిట్‌.
5. యునైటెడ్ సీమ్ లెస్ ట్యుబ్ లర్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.900 కోట్లతో అల్లాయ్ స్టీల్, పైపులు తయారీ సంస్థ.
6. తూర్పు గోదావరి జిల్లాలో కామినేని స్టీల్, పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.950 కోట్లతో స్టీల్ బిల్లేట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుంది.
7. ఆయిల్ అండ్ కంట్రీ ట్యుబులర్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.150 కోట్లతో ట్యూబులర్ గూడ్స్ తయారీ సంస్థ ఏర్పాటు చేస్తుంది.
8. చిత్తూరులో టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.152 కోట్లతో దుస్తులు తయారీ సంస్థ ఏర్పాటు చేస్తుంది.
9. చిత్తూరులోనే బ్రిటానియా ఇండస్ట్రీస్ రూ.145 కోట్లతో, జైన్ ఇరిగేషన్ సిస్టం లిమిటెడ్ రూ.365 కోట్లతో వ్యవసాయ ఉద్యాన పార్క్          ఏర్పాటు చేస్తున్నాయి.
10. ఇండాని గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ లో బంగారం, వెండి శుద్ధి కర్మాగారం రూ.100 కోట్లతో సంస్థ ఏర్పాటు చేస్తుంది.
11. వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు లో రూ. 5000 కోట్లతో ఆహార పార్క్ ఏర్పాటు చేస్తుంది.
12. హట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.50 కోట్లతో పాలసుద్ది కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది.
13. వర్షా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో రూ.45 కోట్లతో ఆహార పార్క్ వస్తుంది.

రవాణా శాఖకి కళ్ళు చెదిరే ఆదాయం

తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ నెంబర్లకి చాలా క్రేజ్ అంతా ఇంతా కాదు . సెంటిమెంట్ గా కొంత మంది భావిస్తే కొంతమంది సంఘం లో హోదా గా భావిస్తారు.
కావాల్సిన నెంబర్ కోసం లక్షలు వెచ్చిస్తారు. నిన్న శనివారం (అక్టోబర్ 29) ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు విడుదల చేసింది రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.
AP 31 DJ 9999 నెంబరుకు నలుగురు వ్యక్తులు మద్య పోటీ జరగగా రూ.3.65 లక్షలకు ఒక వ్యక్తి కైవసం చేసుకున్నారు. 9999 నంబర్‌కు గతంలో ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరలేదు.
అలాగే కొత్తగా విడుదల చేసినAP 31 DT సిరీస్ పోటీ పెరిగింది. 
ఏపీ31 డీటీ 0009ను మరో వ్యక్తి రూ.3,00,609లకు దక్కించుకున్నారు.
ఇదే సిరీస్‌లోని 0001 నెంబరును రూ.2 లక్షలకు, 
0005 నెంబరును రూ.1.70 లక్షలకు, 0007 నెంబరును రూ.1.36,850లకు, 
0006 నెంబరును రూ.1.19 లక్షలకు కార్ల యజమానులు దక్కించుకున్నారు. 
మొత్తంగా కలిపి 25 నెంబర్లకుగాను ఈ వేలంలో రూ.18,86,175 మేర రవాణా శాఖకు ఆదాయం చేకూరింది.

నారా వారి పల్లె లో హై అలెర్ట్ …

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారా వారి పల్లె ఒక్క సారిగా నిఘా నీడ లో కి వెళ్ళిపోయింది
ఈనెల 24న ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకున్నారన్న నిఘావర్గాల సమాచారంతో వారికి ఇప్పుడున్న బద్రతాసిబ్బందిని ప్రభుత్వం పెంచింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లితో పాటు శేషాపురం, ఆరేపల్లి రంగంపేట వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
చంద్రబాబు ఇప్పుడు విజయవాడ లో కదా ఉండేది, కుటుంబ సభ్యులు కూడా ఎవరు నారావారిపల్లితో ఉండట్లేదు మరి అక్కడ నిఘా ఎందుకు అనుకుంటున్నారా…ప్రస్తుతం ఇంటిలో ఎవరూ నివాసం లేకున్నప్పటికీ ప్రతిఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో నాలుగురోజులపాటు గ్రామంలో విడిది చేస్తున్నారు.
దీంతో నారావారిపల్లిలోని ముఖ్యమంత్రి స్వగృహంతో పాటు అటువైపు శేషాపురం, ఇటువైపు రంగంపేట కేంద్రాల వద్ద పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఏపీ పోలీసులతో పాటు ఏఆర్‌ఎస్‌ సాయుధ పోలీసులను జిల్లా ఎస్పీ నియమించారు. నారావారిపల్లిలో 50 మంది, రంగంపేట వద్ద 12 మంది, శేషాపురం వద్ద నలుగురు పోలీసు బలగాలను మోహరించాయి. నారావారిపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ పోలీసులు మోహరించారు. మరికొందరు నారావారిపల్లి గ్రామానికి నాలుగువైపులా సంచరిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అమరావతి ని వెదుక్కుంటూ వచ్చిన ప్రముఖ యూనివర్సిటీ

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ‘వెల్లూరు ఇస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ’ ఇప్పుడు మన రాజధాని అమరావతికి రానుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందించటంలో ‘విట్’ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.
యువత ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్దులు మన రాష్ట్రం నుంచే కాక దేశవ్యాప్తంగా తమిళనాడు లో ని వెల్లూరు కి వెళ్ళి ‘విట్’ యూనివర్సిటీ లో చేరటానికి ఆసక్తి చూపిస్తారు . అలాంటి అత్యత్తమ ప్రమాణాలు కలిగిన ‘విట్’ యూనివర్సిటీ మన అమరావతికి రావటం నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవాలి.
‘వెల్లూరు ఇస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ’ అమరావతిలో నెలకొల్పడానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. CRDA పరిధిలో ‘విట్’ యూనివర్సిటీ కి 100 ఎకరాల భూమి కేటాయించింది. దీనికి గాను VIT సంస్థ ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయల చెక్ అందించింది . ఈ నెల 3వ తారీకు భూమి పూజ చెయ్యాలని ‘విట్’ యూనివర్సిటీ కి చెందిన అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
2017 జులై నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. సో మన రాష్ట్ర విద్యార్ధులకి వచ్చే సంవత్సర కాలం లో ఒక అంతర్జాతీయ విద్యా సంస్థ అందుబాటులోకి వచ్చినట్లే 

రామ్ చరణ్ అంటే చంద్రబాబుకి అంత ప్రేమా?

రాంచరణ్ కు సీఎం చంద్రబాబు రూ.5కోట్లు ఇచ్చారా నిజమేనా అనే సందేహం వచ్చింది కదూ. నిజమే చంద్రబాబు రూ.5కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ మొత్తం ఇచ్చింది రాంచరణ్ కు కాదు.. రాంచరణ్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న మేఘా టర్బో ఎయిర్ లైన్స్ సంస్థకు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)కింద చంద్రబాబు ప్రభుత్వం రూ. 4.90 కోట్లు మంజూరు చేసింది.
విజయవాడ – కడప, విజయవాడ – తిరుపతి మధ్య వారంలో నాలుగు రోజుల పాటు ప్రయాణికులు ఉన్నా, లేకున్నా సర్వీసులు నిర్వహిస్తున్నందుకు జరిగే నష్టాన్ని భరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 72 సీట్ల సామర్థ్యం ఉన్న ఏటీఆర్ – 72 విమానాలను ట్రూజెట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సర్వీసులో 5 సీట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి కేటాయిస్తోంది. ఇక ఏడాదిలో 672 సర్వీసులు నడిపినందుకు గాను ప్రభుత్వం రూ. 9.76 కోట్లను చెల్లించాల్సి ఉండగా, తొలి ఆరు నెలలకు గాను నష్ట పరిహారంగా రూ. 4.90 కోట్లను చెల్లించింది.

రేవంత్ ఎంట్రీ అదిరింది …

తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఇటివలే ఇండియన్ హాకీ ఫెడరేషన్ చైర్మన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా…నిన్న మలేషియా లోని క్వాంటన్‌లో జరిగిన ఏసియన్ ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ అధ్బుత విజయం సాధించింది.
ఈ నేపద్యంలో మన హాకీ టీం ఇంతటి ఘన విజయయాన్ని సాదించటంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ తోడైనట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎంట్రీ తోనే కప్ కొట్టారు . తెలంగాణా తెలుగు తమ్ముళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ఎంట్రీ తో నే టైటిల్ సాధించటం తో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు

దీపావళికి బాంబులు కొనే బదులు పేదలకు దానం చేస్తే మంచిదని ప్రచారం చేసే వాళ్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు చూడండి

ఈ దీపావళి కి 500, 1000, 5000 వేలుపెట్టి బాంబులు కొనే బదులు
ఒక పేద వాడికి కడుపు నింపండి అని.! ఓ తెగ ప్రచారం చేస్తున్నారు.
మీకు హిందూ పండుగలు రాగానే ఇలాంటివి గుర్తొస్తాయి.
అదే కొత్త సంవత్సరము అప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాణా సంచాలకే కొన్ని వేల కోట్ల రూపాయలు తగల పెడతారు అప్పుడు అడగరేం? పేదవాడి ఆకలి గురుంచి! ..
రాజకీయ పార్టీలు అధికారములోకి వచ్చినప్పుడు, ఏవరైన నాయకుడు గెలిచినప్పుడు లక్షలాది రూపాయల బాంబులు కాలుస్తారు.. కటౌట్ లకి పాలాభిషేకాలు చేస్తారు మరి అప్పుడు గుర్తుకు రాడే పేద వాడు ..రాడు కానీ
అదే గో మాత పాలతో దేవుడికి అభిషేకం చేస్తుంటే మాత్రం అరే పాలను వృధా చేస్తున్నారు పేదోడి ఆకలంటావ్ ..
అభిషేకం అనగానే నోర్లు లేస్తయ్,
ఐనా మీకు పాలాభిషేకాలు గుర్తోస్తాయి కానీ
అన్నదాన కార్యక్రమాలు గుర్తుకురావా..
కొన్ని వేల మందికి ప్రతీ పుణ్య క్షేత్రంలో నిత్య అన్నధాన కార్యక్రమాలు జరుగుతున్నవి ఇవి కనబడవా? మీకు…
మళ్ళీ పేదోడు అని నీలుగుతారు , మీరు ఎప్పుడన్నా
పేదోడికి కడుపు నిండ అన్నం పెట్టారా
ఒక్క రూపాయ ధర్మం చేసారా లేదు కానీ బార్ కెళ్ళి వందలు ఖర్చు పెట్టి బీర్లు తాగుతారు..
ఇక మీదట ఎవడన్న పేదోడికి అన్నం, ఆకలి అని
హిందూ ధర్మాన్ని కించపర్చితే ఈ సందేశాన్ని అందజేయవలసిందిగా నా మనవి.!!
దీపావళి బాణాసంచాకు 500 రూపాయలు కాల్చకుండా దానం చెయ్యండని ఉచితసలహా ఇస్తున్నమిత్రులారా..
ఐదు వందల కోరకు సంవత్సరానికి ఒక సారి వచ్చే దీపావళి జరుపుకోవద్దా???
మొదట మీరు ఇంటర్నెట్కనెక్షన్ తొలగించుకోండి, టీవీకి కేబుల్ కనెక్షన్ తొలగించుకోండి,
న్యూఇయర్ పేరున తాగితందనాలు ఆడడం లేకుంటే ఇంకా చాలామంది పేదవాళ్ల కడుపు నింపవచ్చు..
బాణాసంచా లేని దీపావళి.,.
రంగులు లేని హోళీ ఉండదు….
దయచేసి అవకాశవాద రాజకీయాలు మానుకోండి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయద్దు.

Thursday, October 27, 2016

సల్మాన్ ఖాన్ తో కళ్యాణ్ రామ్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కళ్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడా అంటే అవును అనే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చితరం తెరకెక్కనుంది. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై స్వీయ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ నటించి భారీ హిట్ కొట్టిన ఇజం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరి – కళ్యాణ్ రామ్.
అయితే గతంలో సల్మాన్ ని ఫ్లోప్ లు నుండి బయటపడేసిన వాంటెడ్(తెలుగు పోకిరి) లాంటి హిట్ సినిమాకి కథ అందించిన పూరి ఈ కథ చెప్పగానే సల్మాన్ సైతం ఓకే చెప్పారట. అక్కడి నేటివిటికి తగ్గట్లు కథలో చిన్న మార్పులు చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతగా వ్యవహరించిన కళ్యాణ్ రామ్ స్వయంగా యన్టీఆర్ ఆర్ట్స్ పై హిందీలో సైతం నిర్మించనున్నారు అని ఫిలింనగర్ వర్గాలు చెప్తున్నాయి.
ఒక వేళ అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగు సినిమా పరిశ్రమలో రాజీ పడని నిర్మాణ సంస్థగా పేరున్న యన్టీఆర్ ఆర్ట్స్ హిందీలో భారీ సినిమాతో తెరంగ్రేటం చేయనుంది అని సమాచారం.

వైసీపీ కీలక నేతకి సీబీఐ షాక్..

వైసీపీ నేతలకి, సీబీఐ కి విడదియ్యని అనుబంధం ఉందనే చెప్పాలి. రాష్ట్రం లోనే కాదు, దేశ రాజధాని డిల్లీలో సీబీఐ సోదాలు చేసినా వైసీపీ నేతల పేర్లే వస్తున్నాయి. ఈసారి ఎవరు బయటపడ్డారు అనుకుంటున్నారా…
వల్లభనేని బాలశౌరి కిందటి ఎలక్షన్స్ లో గుంటూరు నుంచి లోక్ సభకి పోటి చేసి జయదేవ్ గళ్ళ చేతిలో ఓటమిపాలయ్యారు. చాలా రోజులుగా ఇయన పేరు పెద్దగా వినిపించట్లేదు. ఐతే అనుహ్యంగ సీబీఐ ఢిల్లీలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ మాజీ అధికారి పోలు శ్రీధర్‌ పై దాడి చేసి విచారిస్తున్న సమయంలో బాలశౌరి గుట్టు బయటపడింది. ఆయనకు చెందిన రూ.11 కోట్ల 9 లక్షల అక్రమ ఆస్థుల్ని సీబీఐ సీజ్‌ చేసింది. శ్రీధర్‌తో పాటు ఢిల్లీ నజాఫ్‌గఢ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌పైన కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది.
గుంటూరు, హైదరాబాద్‌, నోయిడాల్లోని వల్లభనేని బాలశౌరి ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై బాలశౌరి ని ఏ క్షణంలో నైనా సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ విషయంపై బాలశౌరి స్పందిస్తూ… ఇందులో తనకేమీ సంబంధంలేదని, చట్టప్రకారమే రూ. 12.5 కోట్లతో 20 ఎకరాల పొలం కొనుగోలు చేశామన్నారు.

విజయవాడ, గుంటూరు నగరాల్లో హై అలెర్ట్

విజయవాడ, గుంటూరు నగరాలు ఒక్కసారిగా టెన్షన్ వాతావరం నెల్కొంది. కారణం ఏమిటో తెలుసుకునే లోపే రెండు నగరాల్లో హై అలర్ట్ అనే వార్తలు టివిల్లో ప్రత్యక్షమయ్యాయి.
అయితే అసలు విషయం ఏమిటి అంటే నిన్న జరిగిన ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడ, గుంటూరులలో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచారు.
నగరంలోని అన్ని కూడలిలో ప్రతి సన్నివేశాన్ని సిసి టివిల ద్వారా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద భద్రతను రెట్టింపు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకి సమచారం అందచేయమని పోలీసులు అధికారులు తెలుపుతున్నారు.

జగన్ అస్త్రానికి పవన్ కౌంటర్ ఇస్తాడా? కలసిపోతాడా?

ప్రత్యేక హోదా అంశం సామాన్య ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు కానీ, విద్యావంతుల్లో, యువతలో ఇది ఒక రాజకీయ అంశంగా మారింది. నవ్యాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి అంతగా లేకపోవడం, కొత్త ఉద్యోగాలు రాకపోవడం వల్ల అసంతృప్తి అయితే ఉంది. దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని జగన్, పవన్ ఇద్దరూ భావిస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా సభలు పెడుతున్నారు. జగన్ మీద ఉన్న అవినీతి కేసులు ఒక్కటి కూడా నిరూపణ కాకపోవడంతో క్రమేణా తటస్త విద్యావంతుల్లో జగన్ పై ఉన్న వ్యతిరేకత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో జగన్, ఎంపీల రాజీనామా అస్త్రాన్ని సంధించబోతున్నాం అని ప్రకటించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయిపోగానే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ నిన్న కర్నూలులో ప్రకటించారు. అంటే ఏప్రిల్ లో ఎంపీల రాజీనామాలు ఉండొచ్చు. ఈ రాజీనామా అస్త్రానికి బిజెపి బెదరదు కానీ, తెదేపా డిఫెన్స్ లో పడుతుంది. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ఇచ్చిన (సారీ, ప్రకటించిన) ప్యాకేజీయే మంచిదని, తెదేపా ఊదరగొడుతుంది. అయితే, హోదా కోసం రాజీనామా చేయడం వల్ల వైకాపా ఎంపీలపై ప్రజలలో సానుభూతి వస్తుంది. ఉప ఎన్నికలు వస్తే అవి తెదేపా, వైకాపా మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. అప్పుడు పవన్ ఏం చేస్తారు అనేదే ప్రశ్న. కాకినాడ సభలో అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి మీరు హోదా కోసం రాజీనామా చేయండి నేను మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తా అని పవన్ హామీ ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయలేదు కానీ, ఇప్పుడు వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తాము అంటున్నారు. అప్పుడు పవన్ హోదా కోసం పోరాడుతున్న వైకాపా ఎంపీలకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే పవన్ జనసేన ఇమేజ్ డామేజ్ అవుతుంది. మద్దతు ఇస్తే, ఎన్నికల్లో గెలిచి ప్రత్యేక హోదా కోసం పోరాడిన క్రెడిట్ వైకాపా కొట్టేస్తుంది. ఈ పరిస్థితుల్లో పవన్ ఏం చేస్తాడో, నవంబర్ 10న అనంతపురం బహిరంగ సభలో క్లారిటీ రావచ్చు.

శివగామిగా రాజమౌళి ముందు ఎవర్ని అనుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

బాహుబలి మొదటి పార్ట్ లో హీరో, విలన్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న పాత్రలు రెండు. ఒకటి శివగామి, రెండు కట్టప్ప. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ మీదనే ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ పార్ట్ 600 కోట్లు బిజినెస్ చేస్తోంది. ఇక శివగామి పాత్రలో అయితే రమ్యకృష్ణ అద్దిరిపోయే నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్రకి శ్రీదేవిని అప్రోచ్ అయ్యారని ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో  ఆ తర్వాత టబుని అడిగారని, వీరిద్దరూ కుదరకపోవడంతో, రమ్యకృష్ణను తీసుకున్నారని ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న కథనం. వీరిద్దరి కన్నా ముందు ఇంకొకర్ని ఈ పాత్ర కోసం అడిగారట. ఆమె ఎవరంటే.. షాక్ అవ్వొద్దు.. మంచు లక్ష్మి ని ఈ పాత్ర కోసం రాజమౌళి అడిగారట. ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో ఐరేంద్రి పాత్రలో విలన్ గా అద్బుతమైన నటన ప్రదర్శించిన మంచు లక్ష్మీతో ఈ పాత్ర చేయించాలని రాజమౌళి అనుకున్నారట. అయితే, ప్రభాస్ తల్లిగా తను నటిస్తే బాగోదని లక్ష్మి ఈ ఆఫర్ కు నో చెప్పిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ యే స్వయంగా చెప్పింది. ఇప్పుడంటే రమ్యకృష్ణని ఆ పాత్రలో చూసాము కాబట్టి, లక్ష్మిని ఊహించుకోలేము. ఒక్క సారి ఐరేంద్రి పాత్ర గుర్తు తెచ్చుకుంటే మాత్రం, రాజమౌళి ఆలోచన 100% కరెక్ట్ అని ఒప్పుకుంటారు.

‘ఏదో పొడిచేస్తాడనుకుంటే’..! ‘మిస్త్రీ’కి ఇస్త్రీ చేసింది అందుకేనట..

ఏదో పొడిచేస్తాడని అంతా అనుకున్నారు. కంపెనీని మరింత అభివృద్ది చేస్తాడని విశ్వసించారు. తమ సామ్రాజ్యాన్ని విదేశాల్లో మరింతగా విస్తరింపజేస్తాడని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులను బాగా చూసుకుంటాడని కలలు కన్నారు.. కానీ సీన్ రివర్స్ అయింది. అభివృద్ధి మాట ఏమో కాని.. ఉన్న కంపెనీని కూడా మూతపడేలా చేస్తున్నాడు. ప్రపంచం గర్వించదగ్గ కంపెనీని తల ఎత్తుకోలేని విధంగా చేశాడు. ఇలానే వదిలేస్తే మరింత డ్యామేజీ ఖాయమనే భయంతో.. వెంటనే పదవి నుంచి దింపేశారు.

టాటా… ఈ పేరు ఇండియాలోనే ఒక తిరుగులేని బ్రాండ్. టాటా ప్రొడెక్ట్ ఏదైనా సరే.. రెండు రూపాయలు ఎక్కువైనా సరే.. జనాలు కళ్లు మూసుకుని కొనేస్తారు. స్వతంత్ర భారతదేశం కంటే వయస్సులో(149 ఏళ్ల ఘన చరిత్ర) పెద్దదైన టాటా గ్రూప్ తన సుదీర్ఘ ప్రయాణంలో సాధించుకున్న అసలు లాభం దాని బ్రాండ్ వాల్యూ. దేశంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజంగా.. సకల రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెలుగులీనుతున్న కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్ లో అకస్మాత్తుగా తలెత్తిన పెను సంక్షోభం అందరినీ విస్మయానికి గురిచేసింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 100 కంపెనీలతో ఆరు ఖండాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం కావడంతో సహజంగానే భారతలోనే కాకుండా విదేశాల్లోనూ టాటా గ్రూప్‌ పరిణామాలు తీవ్ర విస్మయాన్నీ, ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

ఒక కార్పొరేట్‌ దిగ్గజం అత్యున్నత స్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం ముందస్తు సంకేతాలు లేకుండా ఒక్క దెబ్బతో మార్చేయడం దేశీయ కార్పొరేట్‌ రంగంలో పెను సంచలనంగా మారింది. ఈ తరహా నిర్ణయం తీసుకోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇంత సడెన్ గా మిస్త్రీకి ఎందుకు ఉద్వాసన పలికారు? టాటా వారసుడిగా పగ్గాలు చేపట్టిన మిస్త్రీ ఏమంత పెద్ద తప్పు చేశాడు. నాలుగేళ్లు తిరక్కుండానే ఎందుకు ఇంటికి పంపించారు? టాటా యాజమాన్యం ఎందుకంత కంగారుగా ఉంది? అసలు ఏం జరిగింది?

ఈ వివరాల్లోకి వెళితే.. 44 ఏళ్ల వయసులోనే టాటా సన్స్ ఛైర్మన్‌ గా ఐరిష్ జాతీయుడైన సైరన్ మిస్త్రీ కీలక బాధ్యతలు చేపట్టారు. 2012 డిసెంబర్ 28న రతన్ టాటా నుంచి పగ్గాలు అందుకున్నారు. ఆ సమయంలో ఆయనకు సుదీర్ఘ కాలంపాటు అగ్ర నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వెసులుబాటు ఉండటంతో ఆయన సారథ్యంలో టాటా గ్రూప్‌ కొత్త శిఖరాలను చేరుతుందని మార్కెట్‌ పండితులు అంచనావేశారు. అయితే, అందరి అంచనాలు తారుమారయ్యాయి. మిస్త్రీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో డజన్ల సంఖ్యలో ఉన్న కంపెనీల్లో లాభాల్లో నడుస్తున్న వాటిపై మాత్రమే ఫోకస్‌ పెడుతూ నష్టాల్లో ఉన్న సంస్థలను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది బోర్డు పెద్దలకు ఏమాత్రం రుచించలేదు.

పైగా కొన్ని దశాబ్దాలుగా టాటా గ్రూప్‌ పాటిస్తున్న వ్యాపార విలువలు, తాత్వికతకు సైరస్‌ ధోరణి భిన్నంగా ఉంటూ వచ్చింది. కంపెనీ రుణాలు పెరగడంతో పాటు.. ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి అనేక అంశాలు మిస్త్రీ ఉద్వాసనకు దారితీశాయి.

టాటా సన్స్‌లో మెజార్టీ వాటాలు (దాదాపు 66 శాతం వాటా) టాటా ట్రస్ట్‌ల చేతుల్లో ఉన్నాయి. టాటా కుటుంబ సభ్యుల సారథ్యంలో ఉన్న ఈ ట్రస్ట్‌లు ప్రధానంగా ధార్మిక, సమాజ సేవ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాయి. ఇందులో సర్‌ దోరబ్జీ టాటా ట్రస్ట్‌, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌‌లు అత్యంత కీలకమైనవి. ఈ ట్రస్ట్‌ల నుంచి కూడా టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తప్పించాల్సిందిగా ఒత్తిడి వచ్చిందనీ అందువల్లే ఆయనకు బోర్డు ఉద్వాసన పలికందనే వార్తలు పరిశ్రమలో వినొస్తున్నాయి.

మిస్త్రీ ఉద్వాసనకు కారణాలు..
* లాభాపేక్ష లేని వ్యాపారాల పైన మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటిని అమ్మేయడం
* యూరప్‌ లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడం
* కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం
* ఇండియన్‌ హోటల్స్‌కు చెందిన విదేశీ ఆస్తుల విక్రయం
* యూరప్ లోని టాటాల ఉక్కు వ్యాపారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు
* దయాదాక్షిణ్యాలు లేకుండా ఉద్యోగుల తొలగింపు
* అన్నింటికీ మించి టాటా డొకొమో(జపాన్) జాయింట్‌ వెంచర్‌ కు స్వస్తి సందర్భంగా తలెత్తిన లీగల్‌ వివాదం

ఆరునూరైనా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలను ఒప్పందం మేరకు కాపాడే టాటాల సంప్రదాయానికి విరుద్ధంగా జపాన్‌ సంస్థ డొకొమోతో మిస్త్రీ కయ్యానికి దిగడం, 120 కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఉత్తర్వు తమకు వ్యతిరేకంగా రావడంతో రతన్‌ షాకయ్యారు. నిజానికి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు జపాన్‌ రాయబారిని కూడా రతన్‌ కలిసారు. అయితే ఈ లోగా మిస్త్రీ ఒంటెత్తు పోకడతో పరిస్థితి చేజారింది.

ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు మిస్త్రీ. ఇంకా ఇలా వదిలిస్తే లాభం లేదని భావించిన టాటా యాజమాన్యం వెంటనే మిస్త్రీకి టాటా చెప్పేసింది.

ఎంతటి తప్పు చేసినా, నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై అనూహ్యంగా వేటు వేయడం టాటాల సంస్కృతి కాదు. చిన్న స్థాయి ఉద్యోగి విషయంలో చర్య తీసుకోవాల్సి వచ్చినా మానవత్వంతో ఆలోచించే వరవడి ఉన్న అలాంటి గ్రూప్‌ లో లో సైరస్‌ మిస్త్రీకి ఉద్వాసన పలకడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

అబ్బాయ్ కోసం రంగంలోకి దిగిన బాబాయ్‌

జ‌గ‌న్ కోసం ఆయ‌న బాబాయ్ వైఎస్‌.వివేకానంద రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో విప‌క్ష వైకాపా క్రేజ్ రోజు రోజుకు త‌గ్గుతోంది. ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చాలా ఏరియాల్లో ధీటైన అభ్య‌ర్థుల కొర‌త ఉంది. ఇక ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు స‌మ‌ర్థులైన నాయ‌కులు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ నేప‌థ్యంలోనే అబ్బాయ్ జ‌గ‌న్ కోసం బాబాయ్ వైఎస్‌.వివేక రంగంలోకి దిగుతున్నారు.
రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్నారు.
వివేక అయితే పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌న్న అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వైకాపా విజ‌యం సాధించ‌డం సులువుకాద‌న్న టాక్ ఉంది. ఈ టైంలో క్లీన్ ఇమేజ్ ఉన్న త‌న బాబాయ్ ను బ‌రిలోకి దింపి విజ‌యం సాధిస్తే అది పార్టీకి మంచి బ‌లం ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌.
జ‌గ‌న్ నుంచి ఆదేశాలు రావ‌డంతో వివేకా కూడా ప‌ది రోజులుగా జిల్లాలో ప‌ర్య‌ట‌న కూడా మొద‌లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వివేకాను ఢీకొనేందుకు అధికార టీడీపీ కూడా సిద్ధ‌మైపోయింది. వివేక‌పై పులివెందులకే చెందిన బీటెక్ రవిని పోటీకి దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

వైకాపాలోకి మ‌రో హీరోయిన్‌..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ఉన్న సినీ గ్లామ‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీకి లేదు. తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ సినీన‌టుడు కావ‌డంతో స‌హ‌జంగానే చిత్ర‌రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా టీడీపీ వైపే ఉంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు సీఎంగా ఉన్నా కూడా ఎంతోమంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు టీడీపీతోనే ఉంటున్నారు.
ఇక ఇప్పుడు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా కూడా సినీ గ్లామ‌ర్ పెంచుకునే ప‌నిలో ఉంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో రోజా లాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు సినీ రంగం నుంచే ఉన్నారు. ఇక ఇప్పుడు నిన్న‌టి త‌రానికి చెందిన మ‌రో క్రేజీ హీరోయిన్ కూడా వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.
మాజీ హీరోయిన్ రాశి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక, ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టు కూడా స‌మాచారం. రాశీ ఇటీవ‌లే జ‌గ‌న్ లోట‌స్ పాండ్‌కు త‌న కుమార్తెతో స‌హా వ‌చ్చింది. అప్పుడు రాశి వైకాపా ఎంట్రీపై పెద్ద చ‌ర్చ‌లు జ‌రిగాయి.
ఈ వార్త‌ల‌పై స్పందించిన రాశి త‌న కుమార్తె పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే తాను జ‌గ‌న్ కార్యాల‌యానికి వ‌చ్చాన‌ని చెప్పింది. జ‌గ‌న్ కూడా వైకాపాకు సినీ గ్లామ‌ర్ వ‌చ్చేందుకు రాశితో పాటు మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌ను త‌న పార్టీలోకి ఆహ్వానించే ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం.

తండ్రికి, తాతకి నిద్రలేకుండా చేస్తున్న దేవాన్ష్..

ముద్దుల మనవడితో గడపలేకపోతున్నానని తాత. కొడుకుని సరిగా చుసుకోలేకపోతున్నా అనే భాదతో తండ్రి లోకేశ్‌. నాలుగు రోజులు గుంటూరు, మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటుండటంతో దేవాన్ష్ తో గడపలేకపోతున్నామని లోకేశ్‌ పార్టీ సహచరుల వద్ద చెబుతున్నారు. ఇక చంద్రబాబు సంగతి తెలిసిందే నెలకి ఒక్కసారే హైదరాబాద్ వెళుతున్నారు. ప్రతిపక్షం విమర్శలతో చిర్రెత్తుకు వస్తున్న చంద్రబాబు కుటుంబానికి తాము పడుతున్న బాధ ఏమిటో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తున్నారు.
నిన్నటి వరకు చంద్రబాబునే టార్గెట్ గా పెట్టుకుని విమర్శలు చేసే ప్రతిపక్షనాయకులు ఇప్పుడు తమ దృష్టిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పైకి మరల్చారు. చంద్రబాబు, లోకేష్ మద్య విభేదాలు వచ్చాయని మంత్రిపదవి కోసం చంద్రబాబుపై లోకేశ్‌ ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ తమకి చెందిన ఒక పత్రిక ద్వారా విమర్శించింది. ఈ మద్య కె.ఎల్‌.యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాపులో చివరి రోజు లోకేశ్‌ హాజరయ్యారు. అప్పుడు జరిగిన మీటింగ్ లో హోంమంత్రి చిన్న రాజప్ప, లోకేష్ మధ్య జరిగిన సంబాషణని వైసీపీ వేరే విధంగా ప్రచారం చేసి ఫూల్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
ఇలాంటి విమర్శల వల్ల చంద్రబాబు కుటుంబానికి చిర్రెత్తుకొచ్చింది. చంద్రబాబు కోడలు బ్రహ్మణి హెరిటేజ్‌ వ్యాపారంలో తలమునకలుగా ఉండటంతో విజయవాడ రావడానికి వీలు దొరకడం లేదు.. దీంతో దేవాన్ష్‌ను కూడా విజయవాడ తీసుకురాలేకపోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో మాత్రమే దేవాన్ష్‌తో గడిపేందుకు కాసింత సమయం దొరుకుతున్నది.. పదిహేను రోజుల కిందట చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో నాయనమ్మ భువనేశ్వరి.. తాత చంద్రబాబుతో కలిసి దేవాన్ష్‌ వాకింగ్‌ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.. సహజంగా తాతకు ముద్దుల మనవడితో గడపాలని.. ఆ చిన్నారిని షికారుకు తీసుకెళ్లాలని ఉంటుంది.. అయితే పరిపాలన విజయవాడకు మారడంతో చంద్రబాబు నెలలో అన్ని రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. దేవాన్ష్ కి సమయం కేటాయించలేకపోతున్నారు అని బాద పడుతున్నారు.

పైసా ఖర్చు లేకుండా గుండె, కిడ్నీ, కళ్ళు, ఎముకలకు ఉచిత వైద్యం

గుండె, కిడ్నీ, కళ్ళు, ఎముకలలో.. ఈ రోజులో ఈ సమస్యల్లో ఎదో ఒకటి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే.. ఈ సమస్య లు అన్నిటికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసే ఆసుపత్రి ఒకటి ఉంది. అవును.. వీటికి సంబంధించి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేసే హాస్పిటల్ అనంతపురం పుట్టపర్తిలో ఉంది. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ అనే ఆసుపత్రిలో రోగులకు ప్రపంచ స్థాయి కార్పొరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది.
ఈ సమస్యలకు సంబంధించి.. మీరు గతంలో ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులను తీసుకొని.. ఉదయం 6 గంటల కల్లా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు క్యూ లో ఉంటే.. 7 గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రిలోపలికి అనుమతిస్తారు. అలానే వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు తెల్లవారుజామున 3 గంటల నుండే క్యూలో వేచి చూస్తూ ఉంటారు.
ఏయే జబ్బులకు సంబంధించి ఆయా విభాగపు వైద్యుల రూముల దగ్గరికిరిపోర్టులను పరిశీలించి లోపలికి పంపిస్తారు. రోగితో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు. రోగికి చెందిన ఐడి ప్రూఫ్ ఉంచుకోవాలి. అనంతపురం పట్టణం నుండి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు సౌకర్యం ఉండగా.. పుట్టపర్తిలోని ప్రశాంతి రైల్వే స్టేషన్ కు వివిధ ప్రాంతాల నుండి రైలు సౌకర్యం కూడా ఉంది

అమెజాన్ దీపావళి సూపర్ డీల్స్

దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో రాయితీల వర్షం కురుస్తోంది. అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల నుంచిమధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ సీజన్లో ప్రత్యేకమైన ధర తగ్గింపును అందుకున్నాయి. దీపావళిని పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ ఫెస్టివల్ ప్త్రత్యేక రాయితీలు ఈ నెల 26 నుండి 31 వరకు ఉంటాయి.
ఈ ఫెస్టివల్ లో బాగంగా తన సేల్స్ పైన 8౦% డిసౌంట్కు ఇస్తుంది, ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా మీరు ఆ డిస్కౌట్ పొందవచ్చు.
అంతే కాకుండా మీరు ఎటువంటి కొనుగోలు చేయకున్నా క్రింద లబించే లింకుల ద్వార అమెజాన్ లో రిజిస్టర్ అయితే 100 రూపాయల వరకు పొందవాచ్చు

ఓటుకి నోటు కేసులో కీలక తీర్పు

తెలుగు రాష్ట్రల్లో సంచనాలు రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ప్రతి సోమవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించి ఇకపై ప్రతి సోమవారం రేవంత్ రెడ్డి ఏసిబి ఆఫీసుకు హాజరు కాకుండా మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తూ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ నిందితుడిపై ఏసిబి దర్యాప్తు ముగిసిందని, చార్జిషీటు కూడా దాఖలు చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం ఏసిబి కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని న్యాయవాది రవికిరణ్ రావు కోరడంతో హైకోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నామని, కాని ఏసిబి ఎప్పుడు కోరితే అప్పుడు కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్ళవలసి ఉంటుందని పేర్కొంది.
కాగా రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏసిబి దాఖలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు ముగిసి, చార్జిషీటు దాఖలైనందు వల్ల బెయిల్ రద్దు చేయాలన్న వాదనలో పసలేదని హైకోర్టు పేర్కొంది.
ఇన్ని మలుపులు తిరిగుతున్న ఈ కేసు ఎప్పుడు పూర్తి అవుతుందా అని తెలుగుదేశం కార్యకర్తలు, రేవంత్ అభిమానులే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల నాయకులు సైతం ఎదురు చూస్తున్నారు. 

Wednesday, October 26, 2016

చంద్ర‌బాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి వార్నింగ్‌

ఏవోబీలో మావోయిస్టుల‌ను భారీ ఎన్‌కౌంట‌ర్ చేసిన నేప‌థ్యంలో వారు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ ఏపీ క‌మిటీ అధికారి ప్ర‌తినిధి శ్యామ్ పేరుతో రిలీజ్ అయిన ఓ లేఖ‌లో వారు చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుటుంబం మొత్తాన్ని చంపేందుకు అవ‌స‌ర‌మైతే ఆత్మాహుతి దాడికి కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.
చంద్రబాబు నాయుడు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని శ్యామ్ అన్నారు.
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.
ఈ దారుణ‌ మారణకాండ ఫలితాన్ని ఆయ‌న త్వ‌ర‌లోనే అనుభ‌వించ‌బోతున్నార‌ని…. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు లోకేష్ సైతం త‌మ నుంచి త‌ప్పించుకోలేర‌ని శ్యామ్ తీవ్ర‌స్థాయి హెచ్చ‌రిక‌లు చేశారు. ఈ హ‌త్యాకాండ‌కు ప్ర‌తీకారంగా తాము ఏపీలో ప‌లువురు రాజకీయ నాయ‌కుల‌ను సైతం టార్గెట్ చేస్తామ‌ని… కోవ‌ర్డుల ద్వారా మావోయిస్టుల‌కు విషం క‌లిపిన అన్నం పంపించి..వారు ప‌డిపోయాక వారిని ప‌ట్టుకుని కాల్చి చంపేశార‌ని కూడా శ్యామ్ ఆరోపించారు.
గాయాల‌తో ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న మావోయిస్టుల‌ను వెంట‌నే విడుద‌ల చేయ‌ని ప‌క్షంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక 2003లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు అలిపిరి దాడిలో త‌మ నుంచి త‌ప్పించుకున్నా…ఈ సారి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌ప్పించుకోర‌ని కూడా శ్యామ్ హెచ్చ‌రిక చేశారు. చంద్ర‌బాబుకు మావోయిస్టుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఏపీలో భ‌ద్ర‌తా ద‌ళాలు అలెర్ట్ అయ్యాయి.

ఆగ్రహంతో సెట్స్ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోరు. తిక్క పుట్టిందంటే ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. మొహం మీదే అడిగేస్తారు. ఈ తత్వం ఆయనకు టీనేజ్ నుంచి ఉంది. ఈ మధ్య జనసేన పార్టీకి అధినేత కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు. సహనం, సంయమనం పాటిస్తున్నారు. అలా చాలా మారిన పవన్ కళ్యాణ్ కి కాటమరాయుడు చిత్ర బృందం కోపం తెప్పించింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ సికింద్రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సోమవారం షూటింగ్ కి హాజరైన పవర్ స్టార్ కి ఆరోజు యాక్షన్, డైలాగ్ పేపర్ ని డైరక్టర్ టీమ్ అందించలేదు.
మధ్యాహ్నం అవుతున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో కోపంతో సెట్స్ లోకి వచ్చిన పవన్ ఆగ్రహంతో డైరక్టర్ పై అరిచారు. ఈరోజు సీన్ ఏమిటి, అందులో నటించే వారెవరు వాటన్నింటినీ సరిగ్గా ప్లాన్ చేయకుండా సమయాన్ని వృథా చేశారని డాలీపై ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి మరో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో డైరక్టర్ చురుకుగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు. మంగళవారం నుంచి కాటమరాయుడు షూటింగ్ యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

ఏపీలో 60 మినీ జిల్లాలు

చిన్న జిల్లాల‌తో ప‌రిపాల‌న సౌల‌భ్యం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పరిపాల‌న అంద‌రికి అందే ఉద్దేశంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 జిల్లాల‌ను కాస్తా 31 జిల్లాలుగా మార్చేశారు. అడిగిన వాళ్ల‌కు అడిగిన‌ట్టుగా కేసీఆర్ జిల్లాల‌ను ఇచ్చి ప‌డేశారు. ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో కేసీఆర్‌కు కాస్త భిన్నంగా వెళుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.
ఏపీలోని 13 జిల్లాలు ఇక‌పై 60 మినీ జిల్లాలుగా మార‌నున్నాయి. ఈ మేర‌కు చంద్ర‌బాబు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, పేరుకే జిల్లాలుగా పేర్కొన్నా అవి నేరుగా జిల్లాల స్వ‌రూపం సంత‌రించుకోవు! కేవ‌లం రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య‌ను మాత్ర‌మే 60 చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఇక్క‌డ జిల్లాల‌ను పెంచితే ర‌క‌ర‌కాల ఆందోళ‌న‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో రెవెన్యూ డివిజ‌న్ల‌ను పెంచి పాల‌న ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌కు చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న విధానం ప్ర‌కారం జిల్లా క‌లెక్ట‌ర్‌పై పెను భారం ప‌డుతోంది. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు అందుతున్నాయో అన్న‌దానిపై క్లారిటీ లేదు.
రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య పెరిగితే ప్ర‌స్తుతం డివిజ‌న్ స్థాయిలో ఉన్న అధికారుల‌కు మ‌రిన్ని అధికారాలు పెరిగి పాల‌న‌లో వేగం, పార‌ద‌ర్శ‌క‌త‌, అధికారుల జ‌వాబుదారీ త‌నం పెరుగుతాయి. డివిజ‌న్ల ఏర్పాటుతో ఆర్డీవోలు, డీఎస్పీల సంఖ్య పెరుగుతుంది. ఆర్డీవోలు, డీఎస్పీల‌కు అధికారాల‌ను పెంచుతారు. త్వ‌ర‌లోనే ఇది ఏపీలో అమ‌ల్లోకి రానుంది.

చెర్రీకి కోట్లు ఇచ్చిన ఏపీ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్ లో విమానాలు నడుపుతున్నారా?. మీకు నష్టం వస్తుందా?అయితే మీరు బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే మీకు ఏపీ ప్ర‌భుత్వం సర్కారు సర్దుబాటు నిధి (విజీఎఫ్) కింద ఆరు నెలలకు ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఎస్ ఇది నిజం. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది.
ఏపీ స‌ర్కార్ ఒకప్పుడు విమర్శించి..ఇప్పుడు చంకనెక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ కుటుంబ సభ్యులు…రామ్ చరణ్ డైరక్టర్ గా ఉన్న టర్భో మెగా ఎయిర్ వేస్ కు సర్కారు 4.90 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ-తిరుపతి-విజయవాడ, విజయవాడ-కడప-విజయవాడ రూట్లలో సర్వీసులు నడిపినందుకు గాను ఈ ఎయిర్ లైన్స్ కు సర్కారు వీజీఎఫ్ కింద ఈ నిధులు మంజూరు చేసింది.
మ‌రి ఈ సంస్థ విమానాలు న‌డిపితే వాళ్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఏకంగా రూ.5 కోట్ల ల‌బ్ధి క‌లిగేలా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ఏంట‌న్న డౌట్ రాకుండా మాన‌దు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఈ రూట్లు లాభదాయం కాదనే ఉద్దేశంతో వీజీఎఫ్ పెట్టి..ఈ పథకం కింద సర్కారు నిధులు కేటాయించింది.
ఇప్ప‌టికే విమానాల్లో ఉపయోగించే ఇంథనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) పై అతి తక్కువ ఫన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంది. ఇదే ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌కు చాలా హెల్ఫ్ ఫుల్‌గా ఉంది. ఈ లాభం స‌రిపోదున్న‌ట్టు అస‌లు క‌ష్టాల్లో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు ఆరు నెలలకు గాను ఐదు కోట్ల రూపాయలు చెల్లించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌కు చెందిన ఈ సంస్థ‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుందా అన్న చ‌ర్చ‌లు కూడా ఓ వైపు జ‌రుగుతున్నాయి.

ఎయిర్ హోస్టెస్‌ని ఆ..విధంగా కూడా వాడొచ్చా?

మ‌రీ! నీఛం.. హేయం.. ఓ ఎయిర్ హోస్ట‌స్ ని ఉద్దేశించి ఓ కో పైలెట్‌చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. వింటే.. ఎవ‌రికైనా జుగుప్స అనిపించ‌క‌మాన‌దు.నిన్న‌టి వేళ ఓ ఎయిర్ హోస్ట‌స్ విమానంలో వ్య‌భిచారం చేస్తున్న సంగ‌తి వెలుగు చూస్తే.. ఇప్పుడేమో ఏకంగా ఓ కో – పైలెట్టే నిసిగ్గుగా.. తమ ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోవ‌చ్చ‌ని ప్ర‌యాణికుల‌ను శృంగారానికి ప్రేరేపించాడు.
విమానం ఆలస్యమైనందుకు ఆగ్రహించవద్దని చెబుతూనే..ఈ విధంగా ఉచితానుచితాలు ఆలోచించ‌క ఓ స‌ల‌హా ఇచ్చిప‌డేశాడు. దీంతో అక్క‌డున్న‌వారంతా అవాక్క‌య్యారు. కొంద‌రికి కోపం త‌న్నుకొచ్చింది. లయన్ ఎయిర్ ఫ్లైట్‌లో బాలీకి వెళ్తున్నవారికి ఎదురైన విచిత్ర అనుభ‌వం ఇది. సంబంధిత విమానం జావా ద్వీపం నుంచి ఆలస్యంగా బయల్దేర డంతో వారిని శాంతిపజేసేందుకు కో – పైలెట్ ఈ నీఛ‌మైన ఆలోచన చేశాడు.
విమానం ఆలస్యంగా బయల్దేరినందుకు చింతిస్తున్నామని, మీరు కావాలంటే మా ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోవచ్చని ప్రకటించాడు. అప్పటికే కాక్‌పిట్‌ లోపలి నుంచి మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో లాంబెర్టస్ అనే ప్రయాణికుడికి కోపం తన్నుకొచ్చింది. కో పైలెట్ వ్యహారంపై అతడు రవాణా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. విమానం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎయిర్‌ హోస్టెస్‌లను ఆఫర్‌ చేయడం లయన్ ఎయిర్ సంస్థ అనుసరిస్తున్న విధానమా? అని నిలదీశాడు. విమానం ల్యాండ్ కాగానే కో – పైలట్‌ను పట్టుకునేందుకు ప్రయాణికులంతా విఫలయత్నం చేశారు. లాంబెర్టస్ ఫిర్యాదుపై లయన్ ఎయిర్ అధికారులు స్పందించారు.కో – పైలట్ తీరుపై విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ.. పైలెట్‌ను విధుల‌కు దూరంగా ఉండ‌మ‌ని ఆదేశించారు.

బ‌య‌టికొచ్చిన విజ‌య‌శాంతి భ‌ర్త‌

పెళ్లికి ముందు స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు.. పెళ్ల‌వ‌డంతో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల‌కి దూర‌మైపోతారు. ఇంటి బాధ్య‌త‌లు చూసుకుంటూ చ‌క్క‌గా ఆద‌ర్శ గృహిణులుగా మారిపోతారు. కొంత‌మంది అప్పుడప్పుడూ అక్క‌గానో, అత్త‌గానో త‌ళుక్కుమ‌ని మెరిపిస్తుంటారు. ఏస‌మ‌యంలోనూ వారి ఫ్యామిలీ మెంబ‌ర్లు గానీ, పిల్ల‌లు, భ‌ర్త ఇటువంటి విష‌యాలేమీ బ‌య‌ట‌కు రావు. ఎప్పుడ‌యినా ఏదైనా ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు వారి ఫ్యామిలీ హాజ‌ర‌యితే త‌ప్ప వారెవ‌రో అస‌లు ముఖ‌ప‌రిచ‌యం కూడా ఉండ‌దు. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి అడగు పెట్టిన లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి పెళ్లి చేసుకుందని త‌క్కువ‌మందికే తెలుసు. కానీ ఆమె భ‌ర్త‌ను ఎప్పుడూ ఎవ‌రూ చూసి కూడా ఉండ‌రు. భ‌ర్త గురించి ఆమె ఎప్పుడూ చెప్ప‌లేదు కూడా! ఇప్పుడు వీరిద్ద‌రికీ సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.


ఆధార్ కార్డు పోతే………… తిరిగి కొత్తది ఎలా పొందాలంటే………….

ఆధార్ కార్డు పోయిందా…………. అయితే ఇలా చేయండి .
***********************************************
ప్రస్తుతం వివిధ అవసరాలకు ఆధార్ కార్డును తప్పనిసరిగా కావాలంటున్నారు.
అలాంటి కార్డును ఎక్కడైనా పొరపాటున పోగొట్టుకున్నా ……….. లేదా
ఎవరైనా చోరీ చేసినా చాలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఏం చేయాలో అర్థం కాక చాలామంది గాభరా పడుతుంటారు.
మళ్ళీ వాటిని తిరిగి పొందటం ఎలా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కొన్ని పద్ధతులు పాటిస్తే , పోయిన కార్డుకు బదులుగా నకలు కార్డు ( డూప్లికేట్ ) పొందవచ్చు.
adhar
పోయిన ఆధార్ కార్డు తిరిగి పొందే విధానం :
*******************************
ఆధార్ కార్డు పోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 18001801947 కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి.
దీనికి ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
కార్డును ఇచ్చిన అడ్రసుకు పోస్టులో పంపిస్తారు.
దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి కార్డు నంబరు , వివరాలు అందజేస్తే ,
దానికి అనుసంధానించిన ఫోన్ నంబర్ ఆధారంగా కలర్ ప్రింట్ తీసి ఇస్తారు.
ఇది పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యే విధంగా వినియోగించుకోవచ్చు.


లేదా hep@uidai.gov.in వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పొందవచ్చు.

హోంమంత్రి రాజప్పకు గాయాలు

అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చిన రాజప్పకు గాయాలయ్యి అదే ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
పెద్దాపురం మండలం కట్టమూరు వద్ద రొయ్యల శుద్ధి పరిశ్రమలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన బాధితులని కాకినాడలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన హోంమంత్రి చినరాజప్ప ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించి మూడో అంతస్థు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపోవడంతో చిన రాజప్ప లిఫ్టులో పడిపోయారు. మంత్రి చినరాజప్ప నడుము భాగంలో గాయాలయ్యాయి.
దీంతో అదే ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మంత్రి చిన్న రాజప్పతో పాటు అయన వెంటే ఉన్న కానిస్టేబుల్‌, ఫోటో గ్రాఫర్‌కు గాయాలయ్యాయి. వారికి కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఆంధ్రాకి మళ్ళీ తుఫాను

తూర్పు మధ్య భంగాలఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుంది. దీనికి కైంట్ అని పేరు పెట్టారు. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 685 కిలోమీటర్లు, మచిలీపట్నం రేవు కి 900 కిలోమీటర్ల దూరం లో కైంట్ కేంద్రీకృతం అయి ఉంది.
గంటకు 6 కిలోమీటర్ల వేగం కైంట్ కదులుతుందని. అలాగే పశ్చిమ వాయువ్యదిశగా కూడా కైంట్‌ తుపాను కదులుతున్నదని, దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో గురువారం నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.

రంభ డైవ‌ర్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ గుర్తుందా.. అంత తేలిక‌గా మ‌రిచిపోయే హీరోయిన్ కాదులే.. మంచి న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. అంద‌రినీ మైమ‌ర‌పించింది. అస‌లు విష‌యంలోకి వెళితే.. ఈ న‌టి వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్ధంలో ప‌డింది. గత కొన్ని నెలలుగా రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి సెప‌రేట్‌గా ఉంటుంది. రంభ దంపతులకు ఇద్దరు ఆడ‌పిల్ల‌లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది.
ఫ్యామిలీ కోర్టులో వేసిన‌ పిటీషన్ లో తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్టు పేర్కొంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం త‌న భ‌ర్తతో క‌లిసి ఉండే హక్కులు కల్పించాలని కోరింది. అయితే కోర్టులో డిసెంబర్‌ 3న రంభ కేసు విచారణకు రానుంది. బాలీవుడ్ లో మొదలైన డైవ‌ర్స్‌ వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కొంచెం ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో ఇటువంటి సమస్యలే మొద‌ల‌య్యాయి.
కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను 2010 ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది. ఏవో కొన్ని సమస్యలు రావడంతో కొన్ని నెలలుగా విడి విడిగా ఉంటున్నారు. వివాహానికి ముందు టాలీవుడ్ లో 1990, 2000 దశకంలో అగ్రహీరోలతో నటించి రంభ అల‌రించింది. ఈమె తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మూవీలలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది.

టిడిపి నేత కిడ్నాప్

రాయలసీమ తెలుగు తమ్ముళ్ళు ఈరోజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లాలో టిడిపి నేత కిడ్నాప్ అయ్యారని తెలిసి అటు పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణానికి చెందిన ప్రేమ్‌నాథ్‌రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నేత కిడ్నాప్‌‌ అయ్యారు.
ఆయన్ని కడప జిల్లాకి చెందిన కొందరు కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈయన కిడ్నాప్ కి బహుశా ఆర్దిక లావదేవీలే కారణం అయి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం ముదరకముందే దాన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్నారు జిల్లా పోలీసులు. 

దీపావ‌ళి ముందు వ‌చ్చే ధంతేర‌స్ రోజు బంగారమే కాదు ఈ వ‌స్తువులు కొన్నా శుభాలు క‌లుగుతాయ్.!

దీపావ‌ళి వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌పాసులు. పండుగ వారం ఉంద‌న‌గానే ఎవ‌రి ఇంట్లోనైనా ఈ సంద‌డే ఉంటుంది. ఇక పిల్ల‌లు ఉంటే వారు ట‌పాకాయలు కొనే దాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా దీపావ‌ళి ట‌పాసులు కాల్చ‌డ‌మంటే అదో స‌ర‌దా. అయితే దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాసులే కాదు, అదో దీపాల పండుగ‌. న‌ర‌కాసురున్ని వ‌ధించినందుకు గాను ప్ర‌జ‌లంతా సంతోషంతో జ‌రుపుకునే వేడుక అది. దీంతోపాటు చాలా మంది ఆ రోజున ల‌క్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. దీపావ‌ళికి ముందు రోజున వచ్చే ధంతేర‌స్ రోజున అంద‌రూ ల‌క్ష్మీ దేవికి పూజ‌లు చేస్తారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఆ రోజున ఏమేం వ‌స్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
dhanteras-items
వంట‌పాత్ర‌లు… 
ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.
చీపురు…
ధంతేర‌స్ రోజున చీపురును కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.
ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు… 
ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.
అకౌంట్స్ బుక్‌…
వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని (రిజిస్ట‌ర్‌) కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో ప‌డ‌మ‌ర దిశ‌గా ఉంచాలి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.
చేసే వృత్తికి సంబంధించిన‌వి… 
ఎవ‌రు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వ‌స్తువును ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. దీంతో వారికి ఆ రంగంలో విజ‌యం చేకూరుతుంది.
గోమ‌తి చ‌క్ర‌…
గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి వాటిని ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో సంప‌ద క‌లుగుతుంది.

అమరావతిలో ఏ కార్యాలయం ఎక్కడ?

నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఇప్పుడు రాజధాని ప్రాంతానికి తరలుతున్నాయి.. మరి రాజధాని ప్రాంతంలో నూతన రాష్ట్ర కార్యాలయాల ఎక్కడెక్కడ పెడుతున్నారు, వాటి వివరాలు మీకోసం..
  • సూర్యారావుపేటలోని సివిల్‌ కోర్టు కాంపౌండ్‌, పక్కన రాష్ట్ర ఇరిగేషన్‌ కార్యాలయం,
  • గొల్లపూడి వన్‌ సెంటర్‌లో పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయం, దగ్గర రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం,
  • రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాలయం,
  • గుణదలలో ఈఎస్‌ఐ ఆస్పత్రి దగ్గర లీగల్‌ మెట్రాలజీ కార్యాలయం,
  • బస్టాండ్‌ దగ్గర పోలీస్‌ కంట్రోల్‌రూం వెనుక రాష్ట్ర అగ్నిమాపకశాఖ కార్యాలయం,
  • సూర్యారావుపేటలోని సీఎంవో సమీపంలో డీజీపీ కార్యాలయం,
  • డీజీపీ కార్యాలయం పక్కనే సమాచార శాఖ కార్యాలయం,
  • పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ పాలనా కార్యాలయం,
  • పండిట్‌ నెహ్రూ బస్‌ కాంప్లెక్స్‌లో రవాణాశాఖ కార్యాలయం.
  • సూర్యారావుపేటలోని చరితశ్రీ బిల్డింగ్‌లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం,
  • బందర్‌ రోడ్డులోని పీడబ్ల్యూడీ కాంపౌండ్‌ ఎదురుగా పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ కార్యాలయం,
  • గొల్లపూడి సెంటర్‌లోని వసుధ కాంప్లెక్స్‌లో గ్రామీణ మంచినీటి సరఫరా కార్యాలయం,
  • పాయకాపురంలోని సోషల్‌వెల్ఫేర్‌ భవన్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం,
  • ఏలూరు రోడ్డులోని జీపీఆర్‌ స్ట్రీట్‌లోని వి.ప్లాజాలో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం.
  • ప్రసాదంపాడులోని టయోటా షోరూం ఎదురుగా ఉన్న ఏఎన్‌ఆర్‌ టవర్స్‌లో సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం,
  • బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాప్‌ కార్యాలయం,
  • గొల్లపూడిలోని టీటీడీసీ కార్యాలయంలో వెలుగు రాష్ట్ర కార్యాలయం,
  • ప్రసాదంపాడు సెంటర్‌లో రాష్ట్ర ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.