Thursday, October 27, 2016

వైకాపాలోకి మ‌రో హీరోయిన్‌..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ఉన్న సినీ గ్లామ‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీకి లేదు. తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ సినీన‌టుడు కావ‌డంతో స‌హ‌జంగానే చిత్ర‌రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా టీడీపీ వైపే ఉంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు సీఎంగా ఉన్నా కూడా ఎంతోమంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు టీడీపీతోనే ఉంటున్నారు.
ఇక ఇప్పుడు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా కూడా సినీ గ్లామ‌ర్ పెంచుకునే ప‌నిలో ఉంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో రోజా లాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు సినీ రంగం నుంచే ఉన్నారు. ఇక ఇప్పుడు నిన్న‌టి త‌రానికి చెందిన మ‌రో క్రేజీ హీరోయిన్ కూడా వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.
మాజీ హీరోయిన్ రాశి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక, ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టు కూడా స‌మాచారం. రాశీ ఇటీవ‌లే జ‌గ‌న్ లోట‌స్ పాండ్‌కు త‌న కుమార్తెతో స‌హా వ‌చ్చింది. అప్పుడు రాశి వైకాపా ఎంట్రీపై పెద్ద చ‌ర్చ‌లు జ‌రిగాయి.
ఈ వార్త‌ల‌పై స్పందించిన రాశి త‌న కుమార్తె పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే తాను జ‌గ‌న్ కార్యాల‌యానికి వ‌చ్చాన‌ని చెప్పింది. జ‌గ‌న్ కూడా వైకాపాకు సినీ గ్లామ‌ర్ వ‌చ్చేందుకు రాశితో పాటు మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌ను త‌న పార్టీలోకి ఆహ్వానించే ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం.

No comments:

Post a Comment