గత నెల రోజులుగా అనారోగ్యం తో భాద పడుతు అపోలో లో చికిత్స పొదుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి కోలుకున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా వైద్యులు చేసిన ప్రకటన అమ్మ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. జయలలిత కోలుకుంటున్నారని, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామనడంతో అభిమానుల మనసు కుదుటపడింది. ఈ విషయాన్ని స్వయంగా అపోలో వైద్యులే ద్రువికరించారు. జయలలిత ని వచ్చే ఆదివారం (30-10-2016) డిశ్చార్జ్ చేసే ఆలోచనలో అపోలో వైద్యులు ఉన్నారు.
జయ డిశ్చార్జ్ అవుతున్నారు అన్న వార్త తెలియగానే తమిళనాడు మొత్తం కొన్ని రోజలు ముందుగానే దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
No comments:
Post a Comment