ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే తన మంత్రివర్గంలోని సహచరులతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరుపై సర్వే చేయించి వారికి పనితీరు ఆధారంగా గ్రేడింగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో జరిగిన శిక్షణ తరగతుల అనంతరం ఆయా నేతలకు వారి గ్రేడ్లు, పనితీరు ఉన్న సీల్డు కవర్లు ఇచ్చారు.
అయితే ఈ కవర్లలోని మ్యాటర్ లీక్ కాకూడదని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన టాప్ గ్రేడ్లు, ర్యాంకులు వచ్చిన వారు మాత్రం తమ సన్నిహితులతో ఆ ఆనందం పంచుకోవడంతో ఈ ర్యాంకులు ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సర్వేలో ఓ ముగ్గురు మంత్రులకు మాత్రం ఏ గ్రేడ్ వచ్చినట్టు టీడీపీ ఇన్నర్ పాలిటిక్స్‌లో వార్తలు వస్తున్నాయి.
హోం, జలవనరులు, మునిసిపల్ శాఖల మంత్రులుగా ఉన్న చినరాజప్ప, దేవినేని ఉమా, నారాయణలకు చెందిన గ్రేడ్ ఏ అని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురి పనితీరు విషయంలో చంద్రబాబు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, వీరు ముగ్గురూ అవినీతికి దూరంగా ఉండడ మేకాకుండా ప్రజలకు చేరువగా కూడా ఉంటున్నారని సర్వేలో స్పష్టమైందట.
ఇక ముగ్గురు మంత్రుల్లోను చినరాజప్పకు మిగిలిన ఇద్దరు మంత్రులు అయిన ఉమా, నారాయణకంటే ఎక్కువ మార్కులు వచ్చాయట. నారాయణ అందరితోను కలివిడిగా ఉండలేకపోతున్నారట. ఆయన మండలి సభ్యుడు కావడంలో ఈ విషయంలో కాస్త వెనుకంజలో ఉన్నారట.
No comments:
Post a Comment