Saturday, October 22, 2016

నేడు ఆంధ్రులు మర్చిపోలేని రోజు

సరిగ్గా సంవత్సరం ముందు ఇదే రోజున ఆంధ్రరాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా, దేశానికే తలమానికంగా నిలిచే ఆంధ్రుల అద్భుత రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముఖ్యఅతిధి గా హాజరయ్యారు, అమరావతి కి తొలి అడుగు వేశారు.
సంవత్సరం ఎంత తొందరగా గడిచిందో రాజధాని అభివృధి కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఎనిమిది నెలల రికార్డు సమయంలో సీఎం చంద్రబాబు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని పూర్తి చేయించి రాజధాని ప్రజలు తన మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొన్నారు. ఇది ప్రపంచ స్థాయి రికార్డ అని చెప్పుకోక తప్పదు. గతంలో చెరువులు పశువులకు ఆవాసంగా ఉండే రాజధాని ప్రాంతం ఇప్పుడు చెరువు చుట్టూత వాకింగ్‌ ట్రాక్‌, ఉద్యానవనంతో పట్టణీకరణ సంతరించుకుంటుంది. నిత్యం వందల సంఖ్యలో రాజధాని గ్రామాల ప్రజలు వాకింగ్‌కు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. గతంలో రచ్చబండలకు పరిమితమైన చర్చలు ఇప్పుడు వాకింగ్‌ ట్రాక్‌లు ఎక్కాయి. రాజధాని గ్రామాలన్నింటికి ప్రభుత్వం ఎల్‌ఈడీ సౌకర్యంతో వీధి దీపాలను అమర్చింది. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఆర్‌వో ప్లాంట్లను నిర్మించింది.
అమరావతి కి కనెక్టివిటీ :
వాన వస్తే బురద. చిన్న కారు వస్తే ఎదుటివాళ్ళు వెనక్కి వెళ్ళి దారి ఇవ్వాల్సిన పరిస్థితి అంత చిన్న రోడ్లు కొంచం పెద్ద వాహనాలు ఐతే అటు వెళ్ళటానికి కూడా ఆలోచించారు. అలంటి పరిష్టితుల నుంచి… కీలకమైన రవాణాకు ఉపయోగపడే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌ హైవేలని తలపిస్తున్నాయి ఆ రోడ్లు చూస్తుంటే అని అనుకునేలా చేశారు చంద్రబాబు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో పాటు మరో ఎక్స్‌ప్రెస్‌ రోడ్ల నిర్మాణానికి సర్వే జరుగుతోంది. త్వరలో పనులు చేపట్టనున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి గ్రీన్ ప్రాజెక్ట్ లో చేరింది :
పచ్చదనం వెల్లి విరిసేలా తాయారు కాబోతుంది. దీని కోసం దాదాపు రూ.4.5 కోట్లు ఖర్చుచేస్తున్నారు. పచ్చని మొక్కలతో నవ్య రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయం అదిరిపోతోంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి తెప్పించిన రకరకాల మొక్కలతో పాటు రాజధాని ప్రాంతంలోని నర్సరీల్లో పెంచిన మొక్కలను కూడా సచివాలయం ప్రాంగణంలో నాటుతున్నారు. అందులో ప్రధానంగా ఫైకాస్‌ఫాం, మినీ ఇజ్జోర, కార్పోలాన, ఫైకస్‌మల్లీబాల్‌, టెంపుల్‌ ట్రీ, మహాగని, మొర య్యడ్వాల్స్‌ తదితర మొక్కలున్నాయి. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డ్‌లను ఏర్పాటు చేశారు. సచివాలయ మార్గాలన్నీ పచ్చని చెట్లతో కన్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ అభివృద్ధి, ప్లానింగ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుకుంటుంటే చంద్రబాబు మాత్రం మరింత అభివృద్ధి చేయడానికి ఎక్కడ రాజీ పడకుండా దేశవిదేశాల ప్రతినిధులకి అమరావతి చేరువయ్యేలా చేస్తున్నారు. ఆ మధ్య అమరావతి గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఈ అమరావతిలో చేయనున్న అభివృద్దే తమ పార్టీని మరొక 30 ఏళ్ళు అధికారంలో నిలపెడుతుంది అన్నారంటే ఏ స్థాయి అభివృద్ది రాష్ట్రప్రభుత్వం రానున్న రోజుల్లో చేయనుంది అనే విషయం అర్ధం చేసుకోండి…

No comments:

Post a Comment