Saturday, October 22, 2016

సినిమాల‌కు ర‌వితేజ గుడ్ బై

మాస్ హీరో ర‌వితేజ లేటు వ‌య‌సులో హీరోగా నిల‌దొక్కుకున్నా మంచి చ‌లాకీగా సినిమాల‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం అత‌నికే చాటి అని చెప్పాలి. చాలా యాక్టివ్‌గా ఫైటింగ్‌లు, డాన్స్‌లు కూడా చేస్తాడు. సినీ వార‌సులే రాజ్య‌మేలుతున్న ప్రస్తుత ప్ర‌పంచంలో ఎలాంటి వార‌స‌త్వం లేకుండా ఓ స్టార్ హీరోగా ఎదిగాడంటే అత‌డి ప‌ట్టుద‌ల, కృషి అని చెప్పాలి. అయితే ఎందుక‌నో ఇటీవ‌ల కాలంలో సినిమాల‌పై ఆయ‌న విసిగిపోయారా ? అనిపిస్తోంది. ఏడాదిగా ర‌వితేజ ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు..? ఇక‌, ఆయ‌న రిటైర్‌మెంట్‌కు రెడీ అవుతున్నారా ? అనే సందేహాలు సోష‌ల్ మీడియాలో మిన్నంటున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సినిమాకి సినిమాకి తీసుకుంటున్న గ్యాప్ చూస్తుంటే ఈ మాటల‌కు ఊత‌మిచ్చిన‌ట్టే అనిపిస్తుంది.
2015 డిసెంబ‌ర్‌లో బెంగాల్ టైగ‌ర్ విడుద‌ల‌యిన తర్వాత మాస్ మ‌హ‌రాజ్ మూడు సినిమాల‌కు ఒప్పందం చేసుకున్నాడు. వాటిలో ఒక్క‌టి కూడా సెట్స్‌పైకి కార్యాచ‌ర‌ణ రూపుదిద్దుకోలేదు. దిల్‌ రాజు నిర్మాత‌గా ఓ మూవీతోపాటు, మ‌రో రెండు చిత్రాల‌కు ప‌చ్చ‌జెండా ఊపాడు. అవి కూడా సెట్స్‌పైకి రాలేదు. రీసెంట్‌గా ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు బాబీతోనూ ఓ మూవీ ఒప్పుకున్నాడు. అది కూడా పెండింగ్‌లో ఉంది. రాబిన్‌హుడ్ అనే మ‌రో సినిమా కొత్త ద‌ర్శ‌కుడు చంటితో చేయాల‌ని అనుకున్నా ఇంత‌వ‌ర‌కు ఆ ప్రాజెక్టు కూడా ఫైన‌ల్ కాలేదు.
ఈ విధంగా కొత్త సినిమాల‌కు సంత‌కం చేయ‌క‌పోవ‌డంతో పాటు, చేతిలో ఉన్న చిత్రాలు డ్రాప్ అవ‌డంతో ర‌వితేజ కెరీర్‌పై ఆలోచ‌న‌లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా పూరి జ‌గ‌న్నాధ్ మాట్లాడుతూ ర‌వితేజ సినీ కెరీర్‌పై ర‌వితేజ విసిగిపోయాడ‌ని, ప్ర‌పంచ టూర్ వేసిన త‌ర్వాతే మూవీల‌పై ఆలోచిస్తాడ‌ని స్ప‌ష్టం చేశాడు. ఆ టూర్‌కి త‌న‌ను కూడా ఆహ్వానించాడ‌ని, ఆ విష‌య‌మై తాను ఇంకా ఆలోచించ‌లేన్నాడు. సో.. ప్ర‌స్తుతం ర‌వితేజ‌ కొత్త సినిమాల గురించి ఆలోచించే స్థితిలో లేడ‌న్న‌మాట‌. అంతేకాకుండా కెరీర్‌లో మ‌రో రెండు మూడు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని ప‌లువురు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ర‌వితేజ షాకింగ్ న్యూస్‌తో ఏవిధంగా షాకింగ్ ఇస్తాడో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాలి.

No comments:

Post a Comment