Saturday, October 22, 2016

ర‌ష్మీపై వ్య‌భిచారం ఆరోప‌ణ‌లు

బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోలో హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు కిక్కుల మీద కిక్కులు ఇచ్చిన ర‌ష్మీ ఇప్పుడు గుంటూరు టాకీస్ సినిమాతో వెండితెర‌మీద కూడా ఎంట్రీ ఇచ్చి అక్క‌డ కూడా అదే రేంజ్‌లో అందాల‌ను ఎలాంటి మొహ‌మాటం లేకుండా ఆర‌బోస్తోంది. గుంటూరు టాకీస్‌లో ఆమె అందాల ఆర‌బోత‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డంతో ర‌ష్మీ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోంది.
గుంటూరు టాకీస్ త‌ర్వాత అంతం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌ష్మీ ఇప్పుడు తాజాగా త‌ను వ‌చ్చెనంట సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న రష్మీ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
గుంటూరు టాకీస్ తరువాత చాలా మంది త‌న‌ను ఐటెం సాంగులు చేయ‌మ‌ని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నార‌ని… అయితే పెద్ద హీరోలు, పెద్ద బ్యాన‌ర్ల నుంచి ఇలాంటి ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో తాను ఈ ఐటెం సాంగుల‌కు ఒప్పుకోలేద‌ని చెపుతోంది. భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయాలంటే, పేరున్న హీరో లేదా పేరున్న బ్యానర్‌ సినిమాలోనే చేస్తాన‌ని ఖ‌రాకండీగా చెప్పేస్తోంది.
ఇక సుడిగాలి సుధీర్‌కు త‌నకు ఎఫైర్ ఉంద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించిన ఆమె త‌మ ఇద్ద‌రి గురించి ఎన్ని గాసిప్పులైనా రాసుకోండ‌ని మీడియాకు చెపుతోంది. అలాగైనా త‌న‌కు బాగా ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని అంటోంది. ఇక తనపై వచ్చిన వ్యభిచారం ఆరోపణలు త‌న‌ను చాలా బాగా బాధ‌పెట్టాయ‌ని… ఆ నింద‌ను తాను మోయ‌లేక‌పోయాన‌ని వాపోయింది ఈ హాట్ యాంక‌ర్ కం హీరోయిన్‌.

No comments:

Post a Comment