Monday, October 24, 2016

నిఘా నీడలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్

రాష్ట్ర రాజధాని అమరావతికి ఇప్పుడు నిత్యం విఐపిలు, పారిశ్రామికవేత్తలు ,ఎమ్మెల్యేలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు వస్తుండటంతో అది ఒక స్పెషల్ విఐపి జోన్ లా తయారయ్యింది. మరి అక్కడి భద్రత ఎలా ఉందొ తెలుసా?
ఇప్పటికే స్పెషల్‌ ప్రొటెక్షన ఫోర్స్‌ కంట్రోల్‌లో ఉన్న సచివాలయంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో వేగం పెరగడం… శాఖలు అన్ని నిదానంగా అమరావతి సచివాలయంకి మారడంతో అసెంబ్లీ, శాసనమండలి కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నందున కొద్దిరోజుల్లో దీన్ని మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
కార్పొరేట్‌ సంస్ధల తరహాలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో సాంకేతిక నిర్వహణను సీమెన్స్ కంపెనీకి అప్పగించగా సచివాలయంలోని ప్రతి బ్లాక్‌లోనూ 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు అనుసంధానం చేయడం ద్వారా బ్లాకులతో పాటు ప్రహరీకి నలువైపులా కలిసి మూడొందలకు పైగా సీసీ కెమెరాలుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సచివాలయంలో ఏ చిన్న కదలిక జరిగిన సీసీ కెమెరాల్లో రికార్డు కానుంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే మొదటి బ్లాకుకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జడ్‌ ప్లస్‌ క్యాటగిరీలో ఉన్నందున ఆయన కార్యాలయం ఫ్లోర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలు అమర్చారు. ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఉన్నంతసేపు మొబైల్స్‌ పనిచేయకుండా సిగ్నల్స్‌ ఆపే జామర్లు సైతం అమర్చనున్నారు. అదే బ్లాకులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సమాచార వ్యవస్థతో పాటుగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, పరిపాలన సౌలభ్యం కోసం డ్వాష్‌ బోర్డు ఏర్పాటు చేశారు.
సచివాలయానికి సీఆర్‌డీఏ కేటాయించిన 45 ఎకరాలలో ఇప్పటికే 20ఎకరాల్లో ఆరు బ్లాకులను నిర్మించారు. భవనాల చుట్టూ అన్ని వైపులా సెక్యూరిటీ కోసం ప్రహరీ నిర్మించారు. అయితే దీనిని మరింత పటిష్టం చేసేందుకు గోడలపై మరింత ఎత్తుగా ఒక దృడమైన ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. సచివాలయానికి రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేయగా నాలుగు గేట్‌వేలను అమర్చడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా ఈ గేట్లను దాటి సచివాలయంలోకి ప్రవేశించాలి అంటే పోలీసులు ప్రాథమిక తనిఖీలు చేసి గుర్తింపు కార్డుల పరిశీలించి కానీ అనుమతించారు. దీనికి అనువుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ను కూడా ఈ ప్రధాన గేట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇంట భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నవ్యాంధ్ర పాలన సాగనుంది.

No comments:

Post a Comment