యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ (నందమూరి మోక్షజ్ఞ) ఇండస్ట్రీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోనే మోక్షజ్ఞ కామియో రోల్‌తో ఎంట్రీ ఇస్తానడి వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య మాత్రం మోక్షజ్ఞ తన చదువు పూర్తి చేసిన వెంటనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని… ప్రస్తుతం అమెరికాలో నటన, డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుంటున్నాడని చెప్పాడు.
ఇదిలా ఉంటే మోక్షు ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే తన అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా చూసి..అన్న ఎన్టీఆర్ యాక్టింగ్‌ను తెగ మెచ్చుకున్నాడట. గ్యారేజ్ సినిమా చూసిన మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్లాడని తెలుస్తోంది.
అక్కడ వీరిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఇక ఇదే సమయంలో నటనకి సంబంధించి కొన్ని పాఠాలు, మెళుకువలు మోక్షు ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాడట. ముఖ్యంగా కథల ఎంపికలో చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలని ఎన్టీఆర్ మోక్షకు చెప్పాడట.
ఫ్యూచర్‌లో ఎన్టీఆర్ – మోక్షు కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రావచ్చని అంచనా. ఇక నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్-మోక్షు కలయికపై ఫుల్ ఖుషీగా ఉన్నారు.
No comments:
Post a Comment