చాలా మందికి భవనాలు, భూముల్లాంటి ఆస్తులు ఉంటాయి. అవి మనవే అని రుజువు చేసే పత్రాలూ ఉంటాయి. అయితే కొంత మంది పొరపాటునో, గ్రహపాటునో తమ పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన అసలు పత్రాలను పోగొట్టుకుంటారు. తాకట్టు లేక హామీ కింద ఆస్తుల అసలు పత్రాలను బ్యాంకులు లేదా మరెవరి దగ్గరైనా పెట్టినపుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటపుడు మీ ఆస్తులను అమ్మాలన్నా పెద్ద చిక్కే. కొనేందుక కూడా ఎవరూ పెద్దగా ముందుకు రారు. మరి అలాంపుడు ఆస్తిపై మీ హక్కును ధ్రువీకరించే పత్రాలు పొందడం ఎలా? ఇదిగో ఇలా..
వెంటనే ఫిర్యాదు చేయండి
మీ ఆస్తికి సంబంధించిన అసలు పత్రాలు పోయాయని తెలిసిన వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు ఆధారం గా పోలీసు శాఖ ఇచ్చే ఎఫ్‌ఐఆర్ కాపీని మీ దగ్గర జాగ్రత్త చేసుకోండి. మీరు ఆ ఆస్తిని అమ్మాలనుకుంటే కొనేవారు ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా అడిగే అవకాశం ఉంది.
ప్రకటన ఇవ్వండి
ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాక, పోయిన మీ ఆస్తి పత్రాలకు సంబంధించి ఒక ఆంగ్ల దిన పత్రిక, ఒక ప్రాంతీయ భాషా పత్రికలో ఆ విష యంపై ప్రకటన ఇవ్వండి. ప్రకటన ఇచ్చాక 15 రోజుల వరకు వేచి చూడండి. ఈలోపు ఆ పత్రాలు దొరికిన ఎవరైనా వాటిని తిరిగి మీకు అప్పగిస్తారేమో చూడండి.
వాటా సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేయండి
ఒకవేళ మీరు ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఉంటుంటే ఎఫ్‌ఐఆర్ కాపీ ని జత పరుస్తూ మీ వాటాకు సంబంధించి మీరు ఉంటున్న హౌజింగ్ సొసైటీ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇందుకోసం మీరు దరఖాస్తు చేస్తే హౌజింగ్ సొసైటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తుంది. ఎఫ్‌ఐఆర్‌తో సహా అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించి మీకు వాటా సర్టిఫికెట్ జారీ చేస్తుంది. హౌజింగ్ సొసైటీ ఇందుకోసం కొంత ఫీజు కూడా వసూలు చేస్తుంది. హౌజింగ్ సొసై టీ నుంచి వాటా సర్టిఫికెట్ తీసుకునేటపుడే ‘నిరభ్యంతర పత్రం’ (ఎన్‌ఒసి) కూడా తీసుకుంటే మంచిది.
నోటరీతో రిజిస్టర్ చేయించండి
పోయిన మీ ఆస్తి పత్రాలకు సంబంధించి మీరు దగ్గర ఉన్న ఎఫ్‌ఐఆర్, ఎన్‌ఒసి, వాటా సర్టిఫికెట్ల ఆధారంగా స్టాంప్ పేపర్ మీద మీరు ఒక హామీ ప్రకటన సిద్ధం చేయండి. తర్వాత మీ దగ్గర ఉన్న పత్రాలను దానికి జోడించి, నోటరీతో అటెస్ట్ చేయించండి. దాంతో ఆ హామీ పత్రానికి చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
డూప్లికేట్ సేల్ డీడ్ తీసుకోండి
ఇక ఇపుడు మీరు ఆ ఆస్తికి సంబంధించి డూప్లికేట్ సేల్ డీడ్ తీసుకోవాలి. ఇందుకోసం మీ దగ్గర ఉన్న ఎఫ్‌ఐఆర్, పేపర్లలో ఇచ్చిన ప్రకటన, హౌసింగ్ సొసైటీ ఇచ్చిన వాటా సర్టిఫికెట్, స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించిన హామీ పత్రాలను జత చేసి ఆ ఆస్తి ఏ రిజిస్ర్టార్ ఆఫీసు పరిధిలో ఉంటే ఆ రిజిస్ర్టార్ ఆఫీసులో ఇవ్వాలి. నిర్ణీత ఫీజు కూడా చెల్లిస్తే ఆ రిజిస్ర్టార్ ఆఫీసు మీకు డూప్లికేట్ సేల్ డీడ్ జారీ చేస్తుంది.
ఈ తతంగం అంతా పూర్తి చేసేందుకు శ్రమతో పాటు కొద్దిగా డబ్బు కూడా ఖర్చవుతుంది. సొమ్ములు పోయినా మీ ఆస్తికి సంబంధించి చట్టబద్దమైన డూప్లికేట్ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటుంది. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నాకగానీ ఇలాంటి ఆస్తులపైన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. కొన్ని బ్యాంకులైతే మీ దగ్గర డూప్లికేట్ సేల్ డీడ్ ఉన్నా రుణాలు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పత్రాలపై రుణాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్యాంకుల పొరపాటు లేదా నిర్లక్ష్యం వలన ఆస్తులకు సంబంధించిన పత్రాలు పోతే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ లాంటి సంస్థలకు ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొంద వచ్చు. ఇంత తతంగం మనకెందుకనుకుంటే.. ఆస్తులకు సంబంధించిన అసలు పత్రాలు పోకుండా మరింత జాగ్రత్తగా ఉండడం మేలు.

No comments:
Post a Comment