పెళ్లికి ముందు స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు.. పెళ్లవడంతో ఒక్కసారిగా ప్రేక్షకులకి దూరమైపోతారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ చక్కగా ఆదర్శ గృహిణులుగా మారిపోతారు. కొంతమంది అప్పుడప్పుడూ అక్కగానో, అత్తగానో తళుక్కుమని మెరిపిస్తుంటారు. ఏసమయంలోనూ వారి ఫ్యామిలీ మెంబర్లు గానీ, పిల్లలు, భర్త ఇటువంటి విషయాలేమీ బయటకు రావు. ఎప్పుడయినా ఏదైనా ప్రైవేటు కార్యక్రమాలకు వారి ఫ్యామిలీ హాజరయితే తప్ప వారెవరో అసలు ముఖపరిచయం కూడా ఉండదు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడగు పెట్టిన లేడీ అమితాబ్ విజయశాంతి పెళ్లి చేసుకుందని తక్కువమందికే తెలుసు. కానీ ఆమె భర్తను ఎప్పుడూ ఎవరూ చూసి కూడా ఉండరు. భర్త గురించి ఆమె ఎప్పుడూ చెప్పలేదు కూడా! ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
No comments:
Post a Comment