Saturday, October 22, 2016

ఇజం రివ్యూ

పటాస్ లాంటి భారీ విజయం తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ – పూరి జగన్నాధ్ కలయికలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఇజం చిత్రం పై ఇప్పటికే టీజర్, ఆడియో భారీ అంచనాలు సృష్టించాయి. పూర్తిగా తన లుక్ మార్చుకుని అటు మాస్ గా ఇటు క్లాస్ గా కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ మాట తీరు, దర్శకుడు పూరి మార్క్ ఈ సినిమా పై సామాన్య ప్రేక్షకుడి అంచనా పెంచాయి. అయితే ఈ నందమూరి హీరో ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు చేరుకున్నాడో చూద్దాం.

ఎవరెలా చేశారంటే :
ఇప్పటి వరకు కొంచెం క్లాస్ గా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అంటేనే బాగుంటుంది. ఒక పక్క మాస్ గా కనిపిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆలరించాడు.క్లైమ్యాక్స్ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ నటన చూస్తె నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయి పెరిగింది అని ఒప్పుకోక తప్పదు అనే చెప్పాలి.
హీరోయిన్ అదితి ఆర్యకి తొలి సినిమాతోనే నటనకి అవకాశం ఉన్న పాత్ర దొరకడంతో దానిని చక్కగా వినియోగించుకుంది. ఇది ఆమె తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు కూడా.అందంతో పాటు అభినయం ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.
జగపతి బాబు డాన్ పాత్రలో మరోసారి అద్భుతమైన నటన ప్రదర్శించాడు.తన లుక్ తో మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.
సాంకేతిక వర్గ పని తీరు ఎలా ఉందంటే :
అనూప్ రూబెన్స్ : అనూప్ అందించిన ఆడియో ఇప్పటికే హిట్ అయ్యింది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది
సినిమాటోగ్రఫి : ఈ చిత్రంలో ముకేష్ అందించిన సినిమాటోగ్రఫి మరొక హైలెట్. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించాడు. స్పెయిన్ అందాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
డైరెక్టన్ డిపార్ట్మెంట్ : దర్శకుడు పూరి తన మార్కుతో సగటు ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడో అది చక్కగా ఎలివేట్ చేశాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకున్నాడో అలా చూపించాడు. సినిమాలో ప్రతి డైలాగ్ సన్నివేశాన్ని మరొక మెట్టు ఎక్కించాయి.
నిర్మాణ సంస్థ : ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటేనే ఎక్కడ రాజీపడని పడని నిర్మాణ సంస్థ అని ఇండస్ట్రీలో మంచి పేరుంది. గత సినిమాలు మాదిరిగానే ఈ సినిమాలో నిర్మాత కళ్యాణ్ రామ్ ఖర్చులో, క్వాలిటీలో ఎక్కడా, దేనికి రాజీపడ లేదనే విషయం మనకి స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే అర్ధమైపోతుంది.
హైలెట్స్ : కళ్యాణ్ రామ్ నటన, అనూప్ రూబెన్స్ సంగీతం, సినిమాటోగ్రఫి, పూరి మార్కు డైరెక్టన్.కోర్టు సన్నివేశాలు.
చివరగా సినిమా ఎలా ఉంది అంటే :
పూరి మార్కుతో కళ్యాణ్ రామ్ ఈజ్ బ్యాక్….
రేటింగ్ : 3 / 5

No comments:

Post a Comment