బాహుబలి మొదటి పార్ట్ లో హీరో, విలన్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న పాత్రలు రెండు. ఒకటి శివగామి, రెండు కట్టప్ప. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ మీదనే ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ పార్ట్ 600 కోట్లు బిజినెస్ చేస్తోంది. ఇక శివగామి పాత్రలో అయితే రమ్యకృష్ణ అద్దిరిపోయే నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్రకి శ్రీదేవిని అప్రోచ్ అయ్యారని ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో ఆ తర్వాత టబుని అడిగారని, వీరిద్దరూ కుదరకపోవడంతో, రమ్యకృష్ణను తీసుకున్నారని ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న కథనం. వీరిద్దరి కన్నా ముందు ఇంకొకర్ని ఈ పాత్ర కోసం అడిగారట. ఆమె ఎవరంటే.. షాక్ అవ్వొద్దు.. మంచు లక్ష్మి ని ఈ పాత్ర కోసం రాజమౌళి అడిగారట. ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో ఐరేంద్రి పాత్రలో విలన్ గా అద్బుతమైన నటన ప్రదర్శించిన మంచు లక్ష్మీతో ఈ పాత్ర చేయించాలని రాజమౌళి అనుకున్నారట. అయితే, ప్రభాస్ తల్లిగా తను నటిస్తే బాగోదని లక్ష్మి ఈ ఆఫర్ కు నో చెప్పిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ యే స్వయంగా చెప్పింది. ఇప్పుడంటే రమ్యకృష్ణని ఆ పాత్రలో చూసాము కాబట్టి, లక్ష్మిని ఊహించుకోలేము. ఒక్క సారి ఐరేంద్రి పాత్ర గుర్తు తెచ్చుకుంటే మాత్రం, రాజమౌళి ఆలోచన 100% కరెక్ట్ అని ఒప్పుకుంటారు.
No comments:
Post a Comment