రిలయన్స్ అధినేత ముఖేస్ అంబానీ. ప్రపంచ ధనవంతులలో వరుసగా తొమ్మిదిసార్లు ఫోర్బ్స్ పత్రికలో చోటు సంపాదించుకున్న అత్యున్నత ధనవంతులలో ఒకరు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు పేరు ఈషా అంబానీ.. 1991లో పుట్టింది. సైకాలజీలో యేల్ యూనివర్సటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మెకన్సీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం ఆమె జియో, రిలయన్స్ రీటైల్ విభాగాల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. సాకర్ అంటే విపరీతమైన పిచ్చి.. ఫ్యాషన్ కూడా అంటే ఇష్టమేనట. సెలబ్రిటీల ఫ్యాషన్ షోలలో అప్పుడప్పుడు నబడుతుంది. పియానా వాయించడం మహా ఇష్టమట.
ఇటీవల డైమండ్ డ్రెస్‌లో ఇంట్లోనే వాక్ చేసి వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. ఈమెకు పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఇక అంబానీ కుమార్తె వివాహం అంటే మాములు విషయమా.. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చకా చకా జరిగిపోతున్నాయి. ఇంతకీ ఈషాను మనువాడే భర్త పేరు మాత్రం సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.
ముంబై లో కూడా ఈషాకు పెళ్లంట.. అంబానీకి అల్లుడొస్తున్నాడట అనే విషయాలు మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి. అల్లుడు విషయంలో అంబానీ ఫ్యామిలీ సభ్యులు కానీ.. రిలయన్స్ కుటుంబం కానీ దీనిపై ఇప్పటి వరకు ఓ ప్రకటన కూడా వెల్లడించలేదు. ఓ విషయం మాత్రం బయటకు వచ్చింది. ఈషా అతనితో ఇప్పటికే డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జియో ప్రచార కర్త, బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్.. ఈషా పెళ్లిలో డాన్స్ చేస్తాడని తెలిసింది.
No comments:
Post a Comment