విజయవాడ, గుంటూరు నగరాలు ఒక్కసారిగా టెన్షన్ వాతావరం నెల్కొంది. కారణం ఏమిటో తెలుసుకునే లోపే రెండు నగరాల్లో హై అలర్ట్ అనే వార్తలు టివిల్లో ప్రత్యక్షమయ్యాయి.
అయితే అసలు విషయం ఏమిటి అంటే నిన్న జరిగిన ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడ, గుంటూరులలో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచారు.
నగరంలోని అన్ని కూడలిలో ప్రతి సన్నివేశాన్ని సిసి టివిల ద్వారా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద భద్రతను రెట్టింపు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకి సమచారం అందచేయమని పోలీసులు అధికారులు తెలుపుతున్నారు.
No comments:
Post a Comment