ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకుమంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీనుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఈ మేరకు హామీ కూడా ఇచ్చారని టీడీపీ నేతలు అంటుంటారు. ఇందులో నిజమెంతనే విషయం తెలియకపోయినా… వైసీపీ
ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో గవర్నర్ నరసింహన్ సుముఖంగాలేరని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. విజయవాడలో ఏపీ సీఎంతో సమావేశమైన గవర్నర్ నరసింహాన్… మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టబోతున్నారని చంద్రబాబును అడగారట. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని… విస్తరణపైనిర్ణయం తీసుకున్న వెంటనే మిమ్మల్ని కలుస్తానని చంద్రబాబు సమాధానమిచ్చారట.
అయితే విస్తరణలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబును గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది. మీకు ఆ ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు కానీ… అలా చేయడం వల్ల ఒకప్పుడు టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఆరోపణలను భవిష్యత్తులో మీరు కూడా ఎదుర్కొవాల్సిన వస్తుందని ఏపీ సీఎంకు చెప్పారట నరసింహన్. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఆయనకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. మరోవైపు గవర్నర్ సూచనలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటే పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాబు కేబినెట్ లో వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కకుంటే… అందుకు కారణం గవర్నర్ నరసింహన్ అనిచెప్పాలేమో.

No comments:
Post a Comment