నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరికీ ఎవరి క్రేజ్ వారిదే. ఒకరు మాస్ ఐతే ఇంకొకరు క్లాస్. భారీ అభిమానులు ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తే, ఆ సినిమాకి డైరెక్టర్ గా మారిన మాస్ స్టార్ రైటర్ కొరటాల దర్శకత్వం వహిస్తే ఆ రికార్డులు సైతం ఊహకి అందవు.
ఇది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినపడుతున్న వార్తలు. అయితే ఈ ఊహగానలకి తెరదించుతూ స్టార్ డైరెక్టర్ కొరటాల తన పేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చారు. ఈ వార్త కేవలం పుకారే, దయచేసి ఇలాంటి వార్తలు నమ్మకండి అంటూ అభిమానులకి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment