Thursday, October 20, 2016

ప్రజా సంక్షేమం కోసం ఊహించని నిర్ణయం

ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం  కావాల్సిన చర్యలు తీసుకుంటూనే వాటిని కార్యరూపం దాలుస్తుంది.దీనిలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో సామాన్యులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు వీలుగా ప్రతి శుక్రవారాన్ని ఫిర్యాదుల దినముగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుండి ప్రతి శుక్రువారం మంత్రులు, అధికారులు వెలగపూడిలోని సచివాలయంలోనే ఉండాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. రాష్ట్ర ప్రజలు, అధికారులు తమకి ఏ సమస్య ఉన్న ఆ రోజు మంత్రులు,అధికారులు విన్నవించుకోవడానికి వారి వద్దకు వెళ్ళినప్పుడు కొందరు అందుబాటులో ఉండటం లేదని టిడిపి వర్క్ షాప్ లో నేతలు ప్రస్తావించగా చంద్రబాబు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెప్పారు.
అయితే గతంలో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్‌ డే’ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించేవారు. ఇప్పుడు అధికారులతోపాటు మంత్రులను సైతం చేర్చి సోమవారాన్ని శుక్రవారంకి మార్చి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని,వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం సూచించింది.
ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ ఈ ప్రక్రియకి సంభందించిన ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు అందరు ఇక విధి తప్పకుండ ప్రతి శుక్రవారం తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేయగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సామాన్యులకి మధ్య ఉన్న దూరం తగ్గించడంతో పాటుగా అపోహలు సైతం దూరం చేయడానికి సహాయపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

No comments:

Post a Comment