Monday, October 31, 2016

పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

శుక్రవారం (అక్టోబర్ 28) విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో నాలుగు భారీ పరిశ్రమలు ఏర్పాటుకి రంగం సిద్దమైంది. ఇవి రాష్ట్రంలో రూ.26,630 కోట్ల పెట్టుబడులు పెట్టి 53,100 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న మూడు సంస్థలకు ఆమోదం తెలిపారు. ఇవి రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 6700 మందికి ఉపాధి కల్పించే ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండున్నరేళ్లలో రూ.3,31,650 కోట్ల పెట్టుబడితో పలు సంస్థలు 375 పరిశ్రమలు స్థాపించనున్నట్లు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 253 పరిశ్రమల నిర్మాణం ప్రారంభం కాగా మరో 55 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రధానంగా సౌర, ఎలక్ట్రానిక్స్‌, చేనేత, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులపై పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలు :
1. ఎస్సెల్‌ జీసీఎల్‌ కన్సార్టియమ్‌ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.21,300 కోట్ల పెట్టుబడితో సౌరఫలకల తయారీ పరిశ్రమ.
2. తిరుపతికి సమీపంలో ‘డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ రూ.150 కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌.
3. అనిల్‌అంబానీకి చెందిన అడాగ్‌ సంస్థ ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’ విశాఖపట్నంలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ             యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
4. అనంతపురం జిల్లాలో గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ రూ.180 కోట్లతో గార్మెంట్‌ యూనిట్‌.
5. యునైటెడ్ సీమ్ లెస్ ట్యుబ్ లర్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.900 కోట్లతో అల్లాయ్ స్టీల్, పైపులు తయారీ సంస్థ.
6. తూర్పు గోదావరి జిల్లాలో కామినేని స్టీల్, పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.950 కోట్లతో స్టీల్ బిల్లేట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుంది.
7. ఆయిల్ అండ్ కంట్రీ ట్యుబులర్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.150 కోట్లతో ట్యూబులర్ గూడ్స్ తయారీ సంస్థ ఏర్పాటు చేస్తుంది.
8. చిత్తూరులో టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.152 కోట్లతో దుస్తులు తయారీ సంస్థ ఏర్పాటు చేస్తుంది.
9. చిత్తూరులోనే బ్రిటానియా ఇండస్ట్రీస్ రూ.145 కోట్లతో, జైన్ ఇరిగేషన్ సిస్టం లిమిటెడ్ రూ.365 కోట్లతో వ్యవసాయ ఉద్యాన పార్క్          ఏర్పాటు చేస్తున్నాయి.
10. ఇండాని గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ లో బంగారం, వెండి శుద్ధి కర్మాగారం రూ.100 కోట్లతో సంస్థ ఏర్పాటు చేస్తుంది.
11. వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు లో రూ. 5000 కోట్లతో ఆహార పార్క్ ఏర్పాటు చేస్తుంది.
12. హట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.50 కోట్లతో పాలసుద్ది కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది.
13. వర్షా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో రూ.45 కోట్లతో ఆహార పార్క్ వస్తుంది.

No comments:

Post a Comment