Monday, October 17, 2016

అమెరికాలో కొట్టుకున్న తెలుగు వారు

ఆతిధ్యానికి, మంచితానానికి పెట్టింది పేరు తెలుగు జాతి. అలాంటి తెలుగు వారి పరువు తీసేలా అమెరికాలో ప్రాచీనమైన ప్రముఖ ప్రవాస తెలుగు సంఘం ‘అమెరికా తెలుగు సంఘం’(ఆటా) సభ్యుల తమలో తాము పదవుల కోసం ఘర్షణ పడటంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
చికాగోలో ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా అమెరికాలోని తెలుగువారు షాక్ అయ్యారు. ఆటాలో హనుమంతరెడ్డి సర్వం తానే అయి వ్యహరిస్తున్నారని ఆ కార్యవర్గంలోని హరీందర్ రెడ్డితో సహా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే పోస్ట్ ఆఫీస్ నుండి ట్రస్టీ నామినేషన్ పత్రాలను సేకరించి తీసుకువస్తుండగా హనుమంతరెడ్డితో పాటు మరో ఇద్దరికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది.
వారిని అడ్డగించే ప్రయత్నంలో హరీందర్ రెడ్డి అయన అనుచరులుతో హనుమంత రెడ్డి వర్గాన్ని దూషిస్తుండగా ఇరువురి మధ్య తోపులాట సంభవించింది. అనుకోని ఈ పరిణామంతో ఆట సభ్యులు షాక్ అయ్యారు …. ఇప్పుడు ఆ వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది.

No comments:

Post a Comment