Saturday, October 22, 2016

అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కనున్న కృష్ణపట్నం

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెల్లూరు అభివృద్ధి పై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎంతో పేరుగాంచిన కృష్ణపట్నంలో ఇప్పటికే పవర్ ప్లాంట్ కూడా ఉంది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎరువల ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టడమే కాకుండా తొలి అడుగులు వేసింది. కేంద్రమంత్రి మన్షూద్‌ మాండవీయా మరియు ఏపీ భవన్‌ అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్ సమక్షంలో కంపెనీ (మొరాకో), క్రిబ్‌కో కంపెనీలు శుక్రవారం తాము రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.
అయితే ఎరువుల కర్మాగారానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయి లైన్ క్లియర్ కావడంతో ఆ ఏరియా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment