Saturday, October 22, 2016

మ‌హిళా రిపోర్ట‌ర్‌ను లైవ్‌లో చాచి కొట్టిన పోలీస్

ప్ర‌పంచ వ్యాప్తంగా పోలీస్‌కు ఉన్న గౌర‌వం, అదేవిధంగా ఒక మ‌నిషి త‌ప్పు చేస్తే కొట్టే అధికారం పోలీసుల‌కు మాత్ర‌మే ఉంటుంది. అంత‌టి ఉదాత్త‌మైన అధికారం వారికి ప్ర‌భుత్వాలు ఇచ్చాయంటే వారికి ఉన్న విలువ ఏపాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. అటువంటి గౌరవ హోదాలో ఉండాల్సిన, ర‌క్షించాల్సిన పోలీసే మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా అందరూ చూస్తుండగానే చాచి లెంపకాయ కొట్టి…ఆపై కాల్పులు జరిపిన పాక్ పోలీస్ కానిస్టేబుల్ ఉదంతం సంచలనమైంది. పూర్తి వివ‌రాల్లో వెళితే..
నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఫర్ డాటాబేస్ రిజిస్ట్రేషన్ (నాద్రా) కార్యాలయంలో కవరేజ్‌ కోసం కె-21 ఛానెల్ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్‌తో సహా అక్క‌డ‌కు వెళ్లింది. కార్యాలయానికి వచ్చిన జ‌నాల‌ పట్ల అక్కడి ఫ్రాంటియర్ కాప్స్ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తనను ఆమె నిలదీసింది. దీంతో మహిళా జ‌ర్న‌లిస్టు అనికూడా చూడకుండా ఆగ్ర‌హంతో వేలుచూపించి బెదరించడంతో ఆమె మ‌రింత తీవ్రంగా త‌న వాయిస్‌ను ప్రతిఘటించింది. ‘నీకు చెల్లీ తల్లీ లేరా ? జనంతో అనుచితంగా ప్రవర్తించడానికి సిగ్గు అనిపించడం లేదా’ అంటూ ఆ జ‌ర్న‌లిస్టు నిలదీయడంతో ఒక్కసారిగా క‌ట్ట‌లుతెంచుకున్న ఆ కానిస్టేబుల్ ఆమెను చాచిపెట్టి లెంపకాయ చెల్లుమ‌నిపించాడు.
అనంత‌రం అక్కడి జనాన్ని భయభ్రాంతులను చేస్తూ గాలిలోకి కాల్పులు కూడా జరిపాడు. అయితే లేడా రిపోర్టర్ ఇచ్చిన‌ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై పోలీసు కేసు నమోదు చేశారు. అయితే ఇదే సమయంలో డ్యూటీ ఉన్న గార్డును అడ్డుకోవడంతో పాటు అతని యూనిఫాంను కూడా చింపేసిందంటూ నాద్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ లేడా రిపోర్టర్‌పై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 

No comments:

Post a Comment