Tuesday, October 25, 2016

కొరటాల శివ మల్టీస్టారర్.. కుదిరితే బాక్సాఫీస్ షేక్!

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ మల్టీస్టారర్ కొల్లగొట్టే రికార్డులను బ్రేక్ చేయాలంటే తర్వాతి సినిమాలకు చాలా కష్టతరం అవుతుంది. ఇంత సత్తా ఉన్న ఈ మల్టీస్టారర్ అసలు రూపుదిద్దుకునే అవకాశం ఉందా... ఈ ఇద్దరితో మల్టీస్టారర్ ని ప్లాన్ చేసి తెరపై ఆవిష్కరించగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరు... అసలు ఏ డైరెక్టర్ అయినా ప్రయత్నిస్తాడా అనే ఆలోచనలు రాకమానవు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలనే ఆలోచన డైరెక్టర్ రాజమౌళికి ఉందని, ఆయన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ కూడా రెడీ చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. కథ కుదిరి మహేష్, బాలయ్య కాంబినేషన్ వర్కవుట్ అయితే కె.యల్. నారాయణ లేదా గల్లా జయదేవ్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని కూడా విశ్వసనీయమైన సమాచారం. తాజాగా ఈ కాంబినేషన్ కి సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. అదేంటంటే...

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి రెడీ చేసిన స్టోరీ లైన్ ప్రకారం మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందట. దాంతో ఈ మల్టీస్టారర్ కోసం బాలయ్య, మహేష్ ని రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడట కొరటాల. ఇటీవలే బాలయ్య ను కలిసి ఈ మల్టీస్టారర్ గురించి చెప్పి, కథ చెప్పాడట కొరటాల. కథ విన్న తర్వాత బాలయ్య పాజిటివ్ గానే స్పందించారని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా బాలయ్యతో స్ర్కీన్ షేర్ చేసుకోవడానిఇక ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని పిల్మ్ నగర్ టాక్. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మాములుగా ఉండదు. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

No comments:

Post a Comment