యువరత్న నందమూరి నటసింహం గౌతమీపుత్ర శాతకర్ణి గురించి లీక్ అయిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలయ్య కేరీర్‌లోనే ల్యాండ్ మార్క్ అయిన 100వ సినిమాగా తెరకెక్కుతున్న శాతకర్ణి సినిమా కోసం దర్శకుడు క్రిష్ ఏ విషయంలో కూడా అస్సలు రాజీపడడం లేదు.
మొరాకో.. జార్జియా లాంటి దేశాలకు వెళ్లి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేయించిన క్రిష్ ఇక్కడ కూడా భారీ సెట్టింగ్స్ వేయించి మరీ ఈ సినిమాలో అలనాటి వాతావరణం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా టేకింగ్‌తో పాటు నటీనటుల విషయంలో కూడా క్రిష్ రాజీపడడం లేదు.
శాతకర్ణిలో ఇప్పటికే కబీర్ బేడి లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్ తో పాటు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలినిని బాలయ్య తల్లి పాత్రకు తీసుకున్నాడు. ఇక ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులకు కూడా దగ్గర చేసేందుకు క్రిష్ మరో అదిరిపోయే ప్లాన్ వేశాడు.
శాతకర్ణిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఓ కీలక పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం. బాలయ్య – శివరాజ్‌కుమార్ ఇద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇటీవలే శివరాజ్ సినిమా ‘శివలింగ’ 100 రోజుల వేడుకకు కూడా బాలయ్య హాజరయ్యాడు. బాలయ్య సైతం శాతకర్ణి సినిమా విశిష్టతను వివరించడంతో శివరాజ్ ఆ కీలక రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
ఇక శివరాజ్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తే శాతకర్ణి శాండల్‌వుడ్‌లో కూడా దుమ్ముదులిపే అవకాశముంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
No comments:
Post a Comment