ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘మిస్టర్ ఆసియా’ టైటిల్ మన భారతదేశం సొంతమయ్యింది. బాడీబిల్డింగ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టైటిల్ ని బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే సామాన్య ట్యాంకర్ డ్రైవర్ సొంతం చేసుకున్నాడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఫిలి-ఏసియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘మిస్టర్ ఆసియా’ టైటిల్ విజేతగా నిలిచాడు.
అయితే బాలకృష్ణ గతంలో కూడా జర్మనీలో నిర్వహించిన పోటీలో అండర్-24 కేటగిరిలో మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుపొందాడు. ఆ తరువాత 2014 లో ఏథెన్స్‌లో జరిగిన పోటీల్లో సైతం అండర్ -24 కేటగిరిలో మిస్టర్ వరల్డ్ గా నిలిచాడు.
అయితే బాడీబిల్డింగ్‌లో ఎన్నో పతకాలు సాధించిన బాలకృష్ణ బెంగళూరు ఆర్నాల్డ్ గా పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న బాలకృష్ణ తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్ ల సహకారంతో ముంబయికి చెందిన సంగ్రామ్ చౌగ్లా, పంజాబ్ కి చెందిన మునిష్ కుమార్ ల వద్ద బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.
ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన బాలకృష్ణ ఒకవైపు జిమ్ ఇన్ స్ట్రక్టర్ గా ఉంటూనే తన ఖర్చుల కోసం వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తూ, అలా సంపాదించిన డబ్బుతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నాడు.
మరి కేవలం డ్రైవర్ గా తాను సంపాదిస్తున్న డబ్బుతోనే ‘మిస్టర్ ఆసియా’ గా నిలిస్తే ప్రభుత్వం ఆర్దిక సహాయం చేసి ప్రోత్సహిస్తే దేశానికి ఇంకా ఎన్నో రికార్డులు తెచ్చి మన కీర్తి నలుదిశలా వ్యాపింపచేస్తాడు అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బెంగుళూరు ప్రజలు.
No comments:
Post a Comment