Monday, October 31, 2016

పరిటాల సునీత కి కోపం తెప్పించింది ఎవరు ?

పరిటాల సునీత తన సొంత నియోజకవర్గం అయిన రాప్తాడు లో ప్రభుత్వ పధకాల అమలు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి పని తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనపై తప్పుడు లెక్కలు చెప్పొద్దని నియోజకవర్గంలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉందనేది తనకు బాగా తెలుసునని. కథలు చెప్పడం మానేసి వాస్తవాలు చెప్పాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల్ని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పేదలకు రాగులు, జొన్నలు ఇతరత్రా తృణ ధాన్యాలు రేషన్‌ దుకాణం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తెల్లకార్డులపై రేషన్‌ తీసుకోకపోయినా కార్డు రద్దు చేయకుండా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పలు పథకాల్లో క్షేత్రస్థాయికి భిన్నంగా అవాస్తవాలు చెబుతున్న కొందరు అధికారులను ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

No comments:

Post a Comment