Friday, November 4, 2016

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆఫర్..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గృహ రుణాలు పెట్టిన వాళ్ళకి కాస్త ఊరటనిచ్చే వార్త. పండుగ ఆఫర్ అంటూ ఇంటి రుణాలపై వడ్డీ తగ్గించింది.
నవంబరు 1 నుంచే ఈ ఆఫర్ ని అమల్లోకి తెచ్చింది స్టేట్‌ బ్యాంక్‌. గృహరుణాల వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించి ఆరేళ్ల కనిష్ఠానికి తీసుకొచ్చింది. మహిళా వినియోగదారులకు గృహరుణాలపై వడ్డీ రేటును ఏడాదికి 9.10 శాతం చేయగా, ఇతర ఖాతా దారులకి 9.15శాతంగా నిర్ణయించింది.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆఫర్ ద్వారా ఖాతాదారులకు రూ.75లక్షల వరకు రుణం తీసుకునే సదుపాయం ఉంది. తగ్గించిన వడ్డీ రేటు ప్రకారం 30 ఏళ్ల గడువుతో రూ.50లక్షల ఇంటి రుణం తీసుకుంటే నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో రూ.542 ఆదా అవుతుంది.

No comments:

Post a Comment