చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ప్రపంచానికి ఆదర్శమని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. చంద్రబాబు రోజుకో అద్బుతం చేస్తున్నారు. ఈ రోజు ఏం చేశారు అనుకుంటున్నారా… ఇంధన వినియోగంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు.
సమర్థ ఇంధన వినియోగంలో ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నం.1 గా నిలిచింది. రెండోస్థానంలో రాజస్థాన్, మూడోస్థానంలో మహారాష్ట్ర, నాలుగోస్థానంలో కర్ణాటక, ఐదోస్థానంలో కేరళ నిలిచాయి. ఏపీ ప్రారంభించిన ఎనర్జీ స్టార్ అమోఘమని సదస్సులో పాల్గొన్న వారు తెలిపారు.
ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ… అద్భుత విధానాలతో ఇంధన వినియోగంలో ఏపీ చాంపియన్‌గా నిలిచిందని ఆయన కొనియాడారు. ఢిల్లీ అంతర్జాతీయ సదస్సులో ఏపీని ప్రశంసించారు. ఇంధనాన్ని సమర్ధంగా వినియోగించడంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ప్రపంచానికి ఆదర్శమని సుభాష్ చంద్రగార్గ్ ప్రశంసల వర్షం కురిపించారు
No comments:
Post a Comment