Wednesday, November 9, 2016

విజయవాడకు శాప్‌..

విజయవాడకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ(శాప్‌) శాఖ. శాప్‌ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజధానికి వచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాప్‌ నూతన కార్యాలయం ప్రారంబం అయ్యింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడమే ‘శాప్’ యొక్క ప్రధాన లక్ష్యం.
ఎంతో మంది ప్రతిభావంతులని శాప్ తీర్చిదిద్దింది. భారత హాకీ జట్టు గోల్ కీపర్ రజనీ శాప్ లోనే శిక్షణ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్రీడలకి మంచి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపద్యంలోనే శాప్ నూతన కార్యాలయం ప్రారంబం అయ్యింది. ఈ సందర్బంగా శాప్‌ ఎండీ రేఖారాణి మాట్లాడుతూ.. గతంలో క్రీడలకు రూ. 30, 40 కోట్లు మాత్రమే కేటాయించగా ప్రస్తుతం అత్యధికంగా రూ. 200 కోట్లు ఇవ్వడంతో క్రీడాకారులకు, క్రీడాభివృద్ధికి ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా క్రీడల అభివృద్ధి జరిగిందని, ఇక నుంచి నూతన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ నిధులతో ప్రతి జిల్లాలో రూ.2 కోట్లతో స్టేడియం నిర్మాణం చేస్తామని, డీఎస్‌డీవోలు అందరికీ రూ. కోటి చొప్పున నిధులు అందించి, క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇన్సెంటివ్‌లు, రాష్ట్ర అసోసియేషనలకు టీఏ, డీఏలు ఈ సంవత్సరం నుంచి అందిస్తామన్నారు. కొత్త స్టేడియం నిర్మాణాలు, రాష్ట్రంలో నూతనంగా వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
పేద కుటుంబాలలోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని, అందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వైజాగ్‌లో గ్లోబల్‌ ట్రస్ట్‌ స్కూల్‌ని ప్రారంభించారని, అక్కడ రైఫిల్‌ షూటింగ్‌, ఆర్చరీలో శిక్షణ ఇస్తున్నారని వివరించారు. క్రీడా పాలసీలో భాగంగా డ్రాఫ్ట్‌ పాలసీని ప్రారంభించామని దానిలో మండల, గ్రామ పరిధిలోని క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇస్తామని, అందుకు అవసరమైన 100 మంది కోచల నియామకాలు జరుపుతామని తెలిపారు. జాతీయ క్రీడలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామని, అందుకు ప్రభుత్వం, శాప్‌ కృషి చేస్తుందని ఎండీ రేఖారాణి తెలిపారు.

No comments:

Post a Comment