Friday, November 4, 2016

ఇంటిని రెంట్‌కు ఇచ్చిన వెంక‌టేష్‌

విక్ట‌రీ వెంక‌టేష్ ఫిలింన‌గ‌ర్‌లో ఉన్న త‌న ఇంటిని అద్దెకు ఇచ్చాడు.. అదేంటి ఆయ‌న ఇంటిని రెంట్‌కి ఇవ్వ‌డ‌మేంటి ? ఆయ‌న‌కు అంత అవ‌స‌రం ఏముంటుంది అనుకుంటున్నారా.. ? ఇది నిజ‌మే.. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ ప్రాంతం సినీ ప్ర‌ముఖుల‌తో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది ఈ ప్రాంతం. సినీ ప్రముఖులంతా తిరిగే ఏరియా కావడంతో ఈ పోష్ ఏరియా నిరంతరం చాలా రిచ్‌గా, కార్లతో హ‌డావుడిగా ఉంటుంది. ఫిలిం నగర్ రోడ్ మొద‌టిలో ద‌గ్గుబాటి వెంకటేష్ ఇల్లు అంటే ఎవరికైనా తెలిసిపోతుంది.
ప్రస్తుతం విక్ట‌రీ వెంక‌టేష్‌ మణికొండకు షిఫ్ట్ అయిపోవడంతో.. ఫిలింనగర్ లో ఆయన ఇంటిని ఇత‌ర‌ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేశారు. వెంకీ ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా కలిపి ఓ చిన్నపాటి బిజినెస్ సెంటర్ గా రూపుదిద్దుకుంది. ఫుడ్ జాయింట్ సముదాయంగా మారిపోవడంతో..రిచ్ బాబులంతా.. బెంజ్ కార్లతో అర్ధరాత్రి వరకు అక్క‌డ నానా హంగామా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వెంకీ హౌస్‌ ఫుల్ బిజీగా మారిపోయింది.
ఫిలిం నగర్ సెంటర్లో ఈ రేంజ్లో ఉన్న‌ఫుడ్ సెంట‌ర్ లేక‌పోవ‌డంతో ఈ ప్లేస్‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఈ వ్యాపారం మూడు కాఫీలు, ముఫ్ఫై ప‌రోటాలుగా దూసుకెళుతోంది. ఇంపోర్టెడ్‌ ఐస్ క్రీమ్స్ విక్రయించే ఓ ఐస్ క్రీమ్ షాప్.. డిఫరెంట్ కాంబినేషన్స్ లభించే జ్యూస్ స్టాల్స్ ఇక్క‌డ వెలిసిపోయాయి. అన్నికాస్ట్‌లీ ఐట‌మ్స్‌, పేరు మోసిన బ్రాండ్స్ విరివిగా లభ్యమవుతుండడంతో వెంకీ హౌస్ ఇప్పుడు నిత్యం ఎంతో సంద‌డితో ఉంటోంది.

No comments:

Post a Comment