Thursday, October 20, 2016

ఏపీలో జిల్లాలు మారుతున్నాయి

ఏపీలో పాల‌న మార‌బోతోంది…ఇక‌పై స‌రికొత్త పాల‌న రానుంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యి అక్క‌డ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే ఏపీలో కూడా పాల‌న మారుతున్నా కొత్త జిల్లాలు ఏర్పాటు కాకుండా కొత్త పాల‌న రాబోతోంది. తెలంగాణ సీఎం కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేశారు. అయితే ఈ విష‌యంలో చంద్ర‌బాబు కూడా అలాగే చేస్తున్నా డిఫ‌రెంట్ స్టెప్స్ వేస్తున్నారు.
జిల్లాల విభ‌జ‌న/ పెంపుతో ఖ‌జానాపై ఆర్థిక భారం ప‌డుతుంది. అంతేకాదు, అధికారుల సంఖ్యా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతుంది. ఎవ‌రికి వారు త‌మ ప్రాంతాల‌ను జిల్లాలుగా చేయాల‌ని డిమాండ్లు చేస్తారు. ఈ త‌ల‌నొప్పి మాకెందుకు అనుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు పాల‌న‌ను ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ చేయ‌డంపై ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసేశారు. ప్ర‌స్తుతం ఉన్న రెవెన్యూ డివిజ‌న్ల‌ను పెంచాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.
ప్ర‌స్తుతం చాలా రెవెన్యూ డివిజ‌న్ల‌లో 20కు పైగా మండ‌లాలు ఉన్నాయి. అయితే దీన్ని మార్చి కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేయ‌డం ద్వారా పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌నున్నారు. నియోజకవర్గాల పరిధితో పాటు సుమారు 10 మండలాలు ఒక‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఉండేలా చూస్తే.. అప్పుడు నియోజకవర్గాల పరిధి మారినా రెవిన్యూ డివిజన్‌ పరిధి మారదని అధికారులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment