Tuesday, October 25, 2016

బాహుబ‌లిలో రాజ‌మౌళి చేసిన పెద్ద త‌ప్పు ఇదే

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ సినిమా చూసిన వెంట‌నే విమ‌ర్శ‌కులు చాలా మంది పెద‌వి విరిచారు. సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ మిన‌హా చెప్పుకోద‌గ్గ క‌థాబ‌లం లేద‌ని కామెంట్లు చేశారు. అయితే వారి విమ‌ర్శ‌ల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఆ సినిమా బాలీవుడ్ సినిమాల‌కే దిమ్మ‌తిరిగేలా ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది.
బాహుబ‌లి సినిమా ఫ‌స్ట్ డే కంప్లీట్ అయిన వెంట‌నే వ‌చ్చిన విమ‌ర్శ‌కుల‌కు రాజ‌మౌళి బాహుబ‌లి వ‌సూళ్ల‌తో స‌మాధానం చెప్ప‌డంతో పాటు బాహుబ‌లిపై వారి విమ‌ర్శ‌ల‌కు తాళం క‌ప్ప త‌గిలించాడు. అయితే బాహుబ‌లి సినిమా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టి…దేశ‌, విదేశాల్లో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొంది..ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నా ఆ సినిమాలో కొన్ని మిస్టేక్‌లు చేశానంటున్నాడు జ‌క్క‌న్న‌.
బాహుబ‌లి పార్ట్ 1లో రాజ‌మౌళి చేసిన బిగ్ మిస్టేక్‌ను ఆయ‌నే స్వ‌యంగా చెప్పాడు. ఆ మిస్టేక్ ఏంటో తెలిస్తే మ‌నం ఒక్క‌సారిగా అవాక్క‌వ్వాల్సిందే. బాహుబలి మొదటి భాగంలో రాజమౌళి ఓ చోట కనబడతాడు. జక్కన్న చేసిన క్యామియో రోల్‌ సినిమాలో బాగా పేలింది. ఓ ఐటెం సాంగ్‌కు ముందు ఆ రోల్ క‌న‌ప‌డుతుంది.
ఈ క్ర‌మంలోనే జ‌క్క‌న్న రెండో పార్ట్‌లో కూడా క‌న‌ప‌డ‌తాడ‌న్న ఊహాగాన‌లు మొద‌ల‌య్యాయి. ఈ వార్త‌ల‌పై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లే ఇచ్చాడు. ‘మొదటి భాగంలో నేను క్యామియో రోల్‌లో కనిపించడం పెద్ద మిస్టేక్‌. ఒక్కసారి మిస్టేక్‌ చేసేశాక మరోసారి దాన్ని రిపీట్‌ చేయకూడదు. అందుకే రెండో భాగంలో నేను కనిపించన’ని చెప్పాడు.
ఇక త‌న కేరీర్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహాభారతం’ సినిమా తీయడానికి తనకు మరో పదేళ్ల అనుభవం కావాలని…ప్ర‌స్తుతానికి త‌న ఆలోచ‌న‌ల‌న్ని బాహుబ‌లి పై మాత్ర‌మే ఉన్నాయ‌న్నాడు.

No comments:

Post a Comment