ముద్దుల మనవడితో గడపలేకపోతున్నానని తాత. కొడుకుని సరిగా చుసుకోలేకపోతున్నా అనే భాదతో తండ్రి లోకేశ్. నాలుగు రోజులు గుంటూరు, మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటుండటంతో దేవాన్ష్ తో గడపలేకపోతున్నామని లోకేశ్ పార్టీ సహచరుల వద్ద చెబుతున్నారు. ఇక చంద్రబాబు సంగతి తెలిసిందే నెలకి ఒక్కసారే హైదరాబాద్ వెళుతున్నారు. ప్రతిపక్షం విమర్శలతో చిర్రెత్తుకు వస్తున్న చంద్రబాబు కుటుంబానికి తాము పడుతున్న బాధ ఏమిటో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తున్నారు.
నిన్నటి వరకు చంద్రబాబునే టార్గెట్ గా పెట్టుకుని విమర్శలు చేసే ప్రతిపక్షనాయకులు ఇప్పుడు తమ దృష్టిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్పైకి మరల్చారు. చంద్రబాబు, లోకేష్ మద్య విభేదాలు వచ్చాయని మంత్రిపదవి కోసం చంద్రబాబుపై లోకేశ్ ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ తమకి చెందిన ఒక పత్రిక ద్వారా విమర్శించింది. ఈ మద్య కె.ఎల్.యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాపులో చివరి రోజు లోకేశ్ హాజరయ్యారు. అప్పుడు జరిగిన మీటింగ్ లో హోంమంత్రి చిన్న రాజప్ప, లోకేష్ మధ్య జరిగిన సంబాషణని వైసీపీ వేరే విధంగా ప్రచారం చేసి ఫూల్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
ఇలాంటి విమర్శల వల్ల చంద్రబాబు కుటుంబానికి చిర్రెత్తుకొచ్చింది. చంద్రబాబు కోడలు బ్రహ్మణి హెరిటేజ్ వ్యాపారంలో తలమునకలుగా ఉండటంతో విజయవాడ రావడానికి వీలు దొరకడం లేదు.. దీంతో దేవాన్ష్‌ను కూడా విజయవాడ తీసుకురాలేకపోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిన సమయంలో మాత్రమే దేవాన్ష్‌తో గడిపేందుకు కాసింత సమయం దొరుకుతున్నది.. పదిహేను రోజుల కిందట చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిన సమయంలో నాయనమ్మ భువనేశ్వరి.. తాత చంద్రబాబుతో కలిసి దేవాన్ష్ వాకింగ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.. సహజంగా తాతకు ముద్దుల మనవడితో గడపాలని.. ఆ చిన్నారిని షికారుకు తీసుకెళ్లాలని ఉంటుంది.. అయితే పరిపాలన విజయవాడకు మారడంతో చంద్రబాబు నెలలో అన్ని రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. దేవాన్ష్ కి సమయం కేటాయించలేకపోతున్నారు అని బాద పడుతున్నారు.
No comments:
Post a Comment