Saturday, October 15, 2016

మెట్రోపోలిటన్ హంగులతో గుంటూరు

ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి వైపు ఎంతో వేగంగా పరుగులు తీస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో రాజధాని అమరావతిలో భాగంగా ఉన్న గుంటూరు అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది.
సాధారణంగా మనకి గుంటూరు అనగానే గుర్తు వచ్చేది మిర్చి. ఆ గుంటూరు మిర్చి ఘాటుకి ఎంత పేరుందో ఇప్పుడు గుంటూరులో అభివృద్దికి అంతే చోటుంది. అయితే ఇప్పుడు గుంటూరులో గత కొంత కాలంగా జరుగుతున్న అభివృద్ధి చుస్తే ఔరా…అనిపిస్తుంది. గుంటూరు నగరం లోకి ప్రవేశించగానే కనిపించే ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొంచెం ముందుకు వెళ్తే లోపలకి వెళ్ళే కొద్ది మనకి ప్రతి చోట ఆశ్చర్యమే.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ITC 500 కోట్లకి పైగా భారీ వ్యయంతో సెవన్ స్టార్ హోటల్ తో పాటుగా గృహ సముదాయం నిర్మించనున్నది. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెంది ఎల్లప్పుడూ బస్సు,రైలు అందుబాటులో ఉండటం, 24గంటలు విద్యుత్త్ అందుబాటులో ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న సంస్థ ఏదైనా గుంటూరు వైపే తొంగి చూస్తుంది.
కొత్త ప్రయోగాలకి సైతం గుంటూరుని మాత్రమే ప్రభుత్వం ఎంచుకుంటుంది అంటే అక్కడి వారు ఎంత సహకరిస్తున్నారో, అక్కడి మానవ వనరులు ఏ రీతిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ మొదట గుంటూరు లోనే ప్రారంబించారు. వ్యవసాయ యునివర్శిటీ కోసం లాం ని ఎంచుకున్నారు.
ఇప్పటికే అన్ని బ్రాండెడ్ షోరూం లు గుంటూరు బాట పట్టగా , మల్టీప్లెక్స్ కల్చర్ రోజు రోజు కి పెరిగిపోతుంది . మొదటి రోజు నుంచి విద్యా రాజధాని గా పేరెన్నిక గలిగిన గుంటూరు నేటి రాజధాని హంగులతో ఊహించనంత వేగంగా తన రూపురేఖల్ని మార్చుకుంటుంది
నేటివరకు మెట్రోపోలిటన్ నగరాలకే పరిమితమయిన హై రైజ్ అపార్ట్మెంట్లకి ఇప్పుడు నగరంలో చాల సులభంగా అనుమతులు వచ్చేస్తున్నాయి.
ఈ క్రమంలో గుంటూరు నగరం లో మొట్టమొదటి హై రైజ్ అపార్ట్ మెంట్ అనగా 18 ఫ్లోర్ ల అపార్ట్ మెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టటం ఒక్క సారి గా అందరి చూపు గుంటూరు వైపు మరలింది …

No comments:

Post a Comment