Monday, October 24, 2016

బాబు కేబినెట్‌లో అవుట్..? ఇన్ లిస్టు ఇదే..!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశాన్ని చంద్ర‌బాబు గ‌త ఆరేడు నెల‌లుగా నాన్చుతూ వ‌స్తున్నారు. చంద్ర‌బాబు నాన్చుడు అలా ఉంటే ఆశావాహుల లిస్ట్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది. మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న‌వారు సైతం త‌మ‌కు ప‌ద‌వి వ‌స్తుందో రాదోన‌ని కూడిక‌లు , తీసివేత‌ల్లో మునిగిపోయారు.
2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి అధికారంలోకి రావాలంటే ధీటైన మంత్రి వ‌ర్గం ఉంటేనేకానీ సాధ్యం కాద‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. ఆ దిశ‌గా అద్బుత‌మైన టీం కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు టీడీపీలో కీల‌క‌మైన నేత‌ల‌కు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. చంద్ర‌బాబు దృష్టిలో ఎవ‌రున్నా ఆశావాహుల లిస్ట్ మాత్రం చాంతాండ‌త అన్న‌ట్టుగా ఉంది.
ఇక ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను తొల‌గిస్తార‌న్న వార్త‌లు కూడా తెలిసిందే. బాబు కేబినెట్ నుంచి అవుట్‌లిస్ట్‌లో ఉన్న‌వారి పేర్లు చూస్తే ప‌శ్చిమ‌గోదావ‌రి నుంచి పీత‌ల సుజాత‌, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్‌బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, విజ‌య‌న‌గ‌రం నుంచి కిమిడి మృణాళిని, అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని పేర్లు ఉన్నాయి.
ఇక కేబినెట్ ఇన్‌లిస్టులో చూస్తే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు, గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల న‌రేంద్ర‌, కృష్ణాకు చెందిన కాగిత వెంక‌ట్రావు, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌, చిత్తూరు జిల్లా నుంచి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు, అనంత‌పురం జిల్లా నుంచి ప‌య్యావుల కేశ‌వ్ త‌దిత‌ర ప్ర‌ధాన నేత‌ల‌ను కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ పుష్క‌లంగా ఉంది. ఇదేస‌మ‌యంలో త‌న కుమారుడు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలా? వ‌ద్దా? అనే అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు అయిన జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, జ‌లీల్‌ఖాన్ పేర్లు సైతం ఉన్నాయి. మ‌రి చాంతాడంత లిస్టులో ఫైన‌ల్‌గా బాబు ఎవ‌రిని ఫైన‌లైజ్ చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment