ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఇద్దరు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారట. అదేంటి ఏపీ సీఎం మీద తెలంగాణలో..అది కూడా అక్కడ అధికార టీఆర్ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఆశలు పెట్టుకోవడం ఏంటని షాక్ అవ్వొద్దు. ఇక్కడే ఉంది లాజిక్కంతా..
కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీల్లోకి జంపింగ్ పర్వాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చి టీఆర్ ఎస్‌కారెక్కిన ముఖ్య నేతలకు కేబినెట్‌లో చోటు ఇచ్చే అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
ఇది అక్కడ పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. దీనిపై టీడీపీ నేతలు ఏకంగా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి వరకు తీసుకువెళ్లారు. ఈ వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చి కారెక్కిన ఎర్రబెల్లి, కాంగ్రెస్ నుంచి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇంత మంది జంపింగ్‌లను కేబినెట్‌లోకి తీసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయని భావిస్తోన్న కేసీఆర్ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.
తెలంగాణలో అలా ఉంటే ఇటు ఏపీలో వైకాపా నుంచి వచ్చిన జంపింగ్‌లు మంత్రి పదవులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని చంద్రబాబు తన మంత్రి వర్గంలోకి తీసుకుంటే తాను కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట కేసీఆర్. ఇలా చేస్తే.. ఎలాంటి తలనొప్పులూ వచ్చే ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు.
ఏపీలో చంద్రబాబు వైకాపా నుంచి వచ్చిన జంపింగ్‌లకు మంత్రి పదవులు ఇస్తే తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్, గుత్తాలకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లెక్కన ఎర్రబెల్లి, గుత్తా భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నట్లయ్యింది.
No comments:
Post a Comment