Wednesday, October 19, 2016

వర్మ సెట్ లో సందడి చేసిన బాలయ్య

నిజంగా ఈ కలయికను కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరేమో. బాలయ్య ఏంటి? రాంగోపాల్ వర్మ సెట్ లో సందడి చేయడం ఏంటి అనుకుంటున్నారా? అది కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం శాతకర్ణి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ వెళ్ళాడు బాలయ్య.
వర్మ సెట్ కి బాలయ్య వెళ్ళడానికి కారణం ఏంటో తెలీదుగానీ, ముంబై వెళ్లిన బాలయ్య నేరుగా రాంగోపాల్ వర్మ సర్కార్-3 సెట్స్ కి వెళ్లి మరీ అమితాబ్ బచ్చన్ ను కలిశారు.వారిద్దరి కలయికతో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఆ ఫోటోలో బాలయ్య నట నటసార్వభౌమ ఎన్టీఆర్ స్టైల్ లో బిగ్ బి కి ఏదో చెబుతుంటే. ఆయన ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. అదే సమయంలో తన 100వ చిత్రం శాతకర్ణి గురించి కూడా ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.
ఆ తరువాత బాలయ్య ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మతోపాటు, చిత్ర యూనిట్ లోని పలువురిని కలిసి కాసేపు సరదాగా కాసేపు మాట్లాడి సందడి చేశారు. అయితే ఊహించని ఈ పరిణామంతో అభిమానులు శాతకర్ణిలో అమితాబ్ కూడా నటిస్తారేమో అని ఆసక్తిగా చర్చిస్తున్నారు.బాలయ్య తమ సెట్ కి వచ్చి తమతో సరదాగా గడిపినందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారట.
మంచి కథతో తన వద్దకు వస్తే తెలుగులో తప్పక నటిస్తానంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అమితాబ్ టాలీవుడ్ లో బాలీవుడ్ కన్నా బెటర్ సినిమాలు వస్తున్నాయని, బాహుబలి అందుకు నిదర్శనమని తెలుగు చిత్రసీమ పై పొగడ్తలు వర్షం కురిపించారు.
మరి ఇంతలోనే బాలయ్య అమితాబ్ వద్దకు వెళ్ళడంతో ఇటు అభిమానుల్లో అటు సినిమా పరిశ్రమలో ఆసక్తి మొదలయ్యింది.ఇప్పటికే గౌతమీపుత్రలో బాలీవుడ్ నటి హేమామాలిని బాలయ్య తల్లి పాత్ర పోషిస్తున్న విషయం మనకి తెలిసిందే  .

No comments:

Post a Comment