Monday, October 24, 2016

పోలవరం పై ఆగ్రహం..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం మీద సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో కాంట్రాక్టు కంపెనీల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో ఏ మాత్రం పురోగతి కనిపించట్లేదు అసహనం వ్యక్తం చేశారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, పవర్‌ హౌస్‌ తవ్వకం పనులు ఆలస్యమయ్యాయని…ఇకపై పనులు ఆలస్యమైతే సహించేది లేదని హెచ్చరించారు.
ఏ ఇబ్బంది వచ్చినా అధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు. రూ.110 కోట్ల పెండింగ్‌ బిల్లుల్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 52 వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున మట్టి పని జరగ్గా…ఇకపై రోజుకు 75 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వనున్నట్లు వివరించారు. 30టిప్పర్లు అదనంగా ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నాయని, మొత్తం 750ప్రొక్లెయినర్లతో త్వరలో తవ్వకం పనులను పెద్దఎత్తున చేపడతామని అన్నారు. ఈ నెల నిర్దేశించుకున్న లక్ష్యంలో స్పిల్‌ ఛానల్‌ తవ్వకం పనులు 381 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌వేకు సంబంధించి 25.80లక్షల క్యూబిక్‌ మీటర్లు, పవర్‌హౌస్‌ తవ్వకం పనులు 58.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మిగిలినట్లు అధికారులు చెప్పారు.
ఈ ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్లు రూపొందించి, అనుమతులు పొందాలన్నారు. వచ్చే సమీక్షలో పనుల పురోగతిని పర్యవేక్షించడంతో పాటు, నిర్మాణ సంస్థలకు చెల్లింపులపై చర్చిద్దామని సీఎం అధికారులతో చెప్పారు.

No comments:

Post a Comment