3నెలలు పాటు ఇంటర్నెట్, కాల్స్ ఫ్రీ అంటూ ఇప్పటికే తన టెలికాం రంగ ప్రత్యర్ధుల మార్కెట్ కూలదోసి టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కి ట్రాయ్ షాక్ ఇచ్చింది.
2004లో ట్రాయ్ జారీ చేసిన టారిఫ్ ప్లాన్ల ప్రకారం, ఐయూసీ కన్నా తక్కువగా కాల్ టారిఫ్ ఉండేందుకు వీల్లేదు. ఇప్పుడు ఐయూసీ రేటు నిమిషం కాల్ కు 14 పైసలుండగా.. అంతకన్నా తక్కువకు జియో కాల్స్ ఎలా అందిస్తుంది అని ఎయిర్ టెల్, ఐడియా సహా టెల్కోలు లేవనెత్తిన ప్రశ్నతో ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్ ఇచ్చింది.
రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను దీని పై పూర్తి స్థాయి వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు పేర్కొన్నాయి.
దీనిపై ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయ్యి టారిఫ్ ప్లాన్, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.
కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జియో.. సిమ్ కార్డు బ్రోచర్లపైనా ఇదే విషయాన్ని ప్రచురించింది.
ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై సంస్థ ఇప్పటివరకూ స్పందించక పోవడంతో.. దీనికి సరైన సమాధానం జియో వద్ద లేదని ఇతర టెలికాం కంపెనీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
మరి ఇప్పుడు రిలయన్స్ సంస్థ జియో వాడే వారికి ఇచ్చిన హామీలు కొనసాగిస్తుందా? లేక ట్రాయ్ కి అనుగుణంగా తన నిబంధనలు మర్చుకోనుందా?
No comments:
Post a Comment