Thursday, October 27, 2016

అబ్బాయ్ కోసం రంగంలోకి దిగిన బాబాయ్‌

జ‌గ‌న్ కోసం ఆయ‌న బాబాయ్ వైఎస్‌.వివేకానంద రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో విప‌క్ష వైకాపా క్రేజ్ రోజు రోజుకు త‌గ్గుతోంది. ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చాలా ఏరియాల్లో ధీటైన అభ్య‌ర్థుల కొర‌త ఉంది. ఇక ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు స‌మ‌ర్థులైన నాయ‌కులు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ నేప‌థ్యంలోనే అబ్బాయ్ జ‌గ‌న్ కోసం బాబాయ్ వైఎస్‌.వివేక రంగంలోకి దిగుతున్నారు.
రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్నారు.
వివేక అయితే పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌న్న అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వైకాపా విజ‌యం సాధించ‌డం సులువుకాద‌న్న టాక్ ఉంది. ఈ టైంలో క్లీన్ ఇమేజ్ ఉన్న త‌న బాబాయ్ ను బ‌రిలోకి దింపి విజ‌యం సాధిస్తే అది పార్టీకి మంచి బ‌లం ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌.
జ‌గ‌న్ నుంచి ఆదేశాలు రావ‌డంతో వివేకా కూడా ప‌ది రోజులుగా జిల్లాలో ప‌ర్య‌ట‌న కూడా మొద‌లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వివేకాను ఢీకొనేందుకు అధికార టీడీపీ కూడా సిద్ధ‌మైపోయింది. వివేక‌పై పులివెందులకే చెందిన బీటెక్ రవిని పోటీకి దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment